ఛాయా దేవి

వికీపీడియా నుండి
(ఛాయాదేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఛాయా దేవి
సంజ్ఞ, ఛాయాలతో సూర్యుడు
ఛాయా దేవత
సంస్కృత అనువాదంఛాయా
అనుబంధందేవి, సంజ్ఞ నీడ
నివాసంసూర్యలోకం
మంత్రంఓం ఛాయవే నమః
భర్త / భార్యసూర్యుడు
తల్లిదండ్రులువిశ్వకర్మ
పిల్లలుశని, తపతి, భద్ర

ఛాయాదేవి సూర్యుని భార్య, హిందూమతంలో నీడ దేవత.[1] సూర్యుని మొదటి భార్య సరన్యు (సంజ్నా)కు నీడ (ప్రతిబింబం). ఛాయా సంజ్ఞ నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగా వర్ణించారు. ఈమెకు సావర్ణి మనువు అను కుమారుడు జన్మించాడు.[2]

పురాణ కథ

[మార్చు]

సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞ. సంజ్ఞ సూర్యుని వలన మనువు, యముడు,యమునలను సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంజ్ఞ సూర్యు వేడిని సహించలేక తన యోగబలంతో తనవలే ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంజ్ఞ, ఉత్తర కుశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి, ఆమె వలన సంవీర్ణ, శని, తపతి అనే ముగ్గురు బిడ్డలను కన్నాడు. కాలం గడచిన కొద్దీ ఛాయ, సంజ్ఞ సంతానంమీద ధ్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా, యముడు మాత్రం కోపగించుకునేవాడు.

అతనికి తల్లిమీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముని మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి, యమ ధర్మరాజ పదవినిచ్చాడు. తరువాత సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న ఆమెకు తన నోటిద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే వారే అశ్వినీ దేవతలుగా పిలువబడుతున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Monier Williams Sanskrit-English Dictionary (2008 revision) p. 406[permanent dead link]
  2. According to Hindu cosmology, man is currently in the seventh Manvantara.
  3. వార్త, యాత్ర (25 January 2018). "త్వం సూర్యం ప్రణమామ్యహం". Vaartha. Archived from the original on 17 August 2020. Retrieved 17 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఛాయా_దేవి&oldid=3101062" నుండి వెలికితీశారు