జంధ్యాల దక్షిణామూర్తి
జంధ్యాల దక్షిణామూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యులు.
జివిత విశేషాలు
[మార్చు]ఆయన జూన్ 21 1902 న కృష్ణా జిల్లా మచిలీపట్నం లో గౌరినాథశాస్త్రి, వెంకటలక్ష్మీ దంపతులకు జన్మించారు.[1] విజయవాడ లో ప్రాథమిక,ఉన్నత విద్యలను పూర్తిచేసారు. విశాఖపట్నంలోని మెడికల్ కళాశాలలో, మద్రాసులోని రాయపురం మెడికల్ స్కూల్ లో వైద్యవిద్యనభ్యసించారు. బెంగళూరులో నిమింటో హాస్పటల్ లో ఆఫ్తాల్మోలజీలో ప్రత్యేక శిక్షణ పొందారు. కలకత్తా ట్రోపికల్ మెడిసన్ సెంతర్ లో నేత్రవైద్య పరిశోధనలు చేసారు.
1928 లో తిరిగి బెజవాడ వచ్చి మెడికల్ ప్రాక్టీసు ప్రారంభించారు. రోగనిదాన శాస్త్రంమీద గాఢాధ్యయనం చేసారు. "పేదల డాక్టరు" గా కోస్తా జిల్లాలలో పేరొందారు. బీదవారికి చికిత్స, మందులు ఉచితంగా అందించడమే కాక, వారి అవసరాలను గమనించి డబ్బు కూడా సహాయం చేసేవారు.[2]
రాజకీయాలలో
[మార్చు]ఆయన అనతికాలంలోనే ప్రజలకు దగ్గరయ్యారు. విజయవాడ మ్యునిసిపల్ కౌన్సిలర్ గా (1930 నుండి), మ్యునిసిపల్ చైర్మన్ గా (1957-60) పనిచేసారు. వైద్య చికిత్సారంగానికి దూరమై, రాజకీయ చికిత్సకు సమీపమై విజయవాడ ప్రజల మన్ననలందుకున్నారు. రాష్ట్రప్రభుత్వం "పురప్రముఖ్" బిరుదుతో సత్కరించింది.
ఆయన 1966 సెప్టెంబరు 30 న మరణించారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన చతుర్థ కుమారుడు జంధ్యాల శంకర్ డాక్టరు గా ప్రస్థానాన్ని ప్రారంభించి వైద్యవృత్తిలో రాణించి విజయవాడ మ్యునిసిపల్ మేయర్ గా (1987-92) పనిచేసరు.
మూలాలు
[మార్చు]- ↑ "Dakshinamurthy Jandhyala". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-15.
- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011.