జకియా ఖానమ్
మయాన జకియా ఖానమ్ | |||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 నవంబరు 26 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నామినేటెడ్ స్థానం | ||
---|---|---|---|
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2020 ఆగస్టు 20 నుండి ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1973 సెప్టెంబరు 01 రాయచోటి, వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎం.హజీజ్ ఖానమ్, ఎం.దిలావర్‌ఖాన్ | ||
జీవిత భాగస్వామి | దివంగత ఎం.అఫ్జల్ ఖాన్ | ||
సంతానం | ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు |
మయాన జకియా ఖానమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా 2021 నవంబరు 26న బాధ్యతలు చేపట్టింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]జకియా ఖానమ్ 1973 సెప్టెంబరు 01న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటిలో ఎం. హజీజ్ ఖానమ్, ఎం. దిలావర్‌ఖాన్ దంపతులకు జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసింది.
కుటుంబం
[మార్చు]1989 సెప్టెంబరు 01న మయాన అఫ్జల్ అలీఖాన్ అనే అతనితో జకియా ఖానమ్ వివాహం జరిగింది. ఆమె భర్త అలీఖాన్ రాయచోటి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
రాజకీయ జీవితం
[మార్చు]జకియా ఖానమ్ తన భర్త అఫ్జల్ అలీఖాన్ మరణాంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నరు కోటాలో ఎమ్మెల్సీగా 2020 జులై 29న నియమితురాలైంది.[2] [3] జకియా ఖానమ్ 2021 నవంబరు 21న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టింది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (26 November 2021). "మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్ బాధ్యతల స్వీకారం". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ Sakshi (29 July 2020). "గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ "AP Governor Nominates Two Mlcs: ఇద్దరు ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్.. గెజిట్ నొటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారి | ap Governor Nominates Two Mlcs Who Are Ysrcp Leaders". web.archive.org. 2021-01-20. Archived from the original on 2021-01-20. Retrieved 2024-06-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Namasthe Telangana (26 November 2021). "ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియాఖానమ్." Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.