జగదీప్ ధన్కర్
| జగదీప్ ధన్‌ఖడ్ | |||
| |||
| పదవీ కాలం 2022 ఆగస్టు 11 – 2025 జూలై 21 | |||
| రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
| ముందు | వెంకయ్య నాయుడు | ||
| తరువాత | సీ. పీ. రాధాకృష్ణన్ | ||
| పదవీ కాలం 2019 జూలై 30[1] – 2022 జూలై 18[2] | |||
| ముందు | కేశరి నాథ్ త్రిపాఠి | ||
| తరువాత | లా. గణేశన్ (అదనపు బాధ్యతలు) | ||
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
| |||
| పదవీ కాలం 1990 నవంబర్ 21 – 1991 జూన్ 21 | |||
| ముందు | పి. నాంగ్యాల్ | ||
| తరువాత | ఆర్.కె. కుమార్ | ||
| పదవీ కాలం 1993 డిసెంబర్ 4 – 1998 నవంబర్ 29 | |||
| ముందు | జగ్జీత్ సింగ్ | ||
| తరువాత | నాథు రామ్ | ||
| నియోజకవర్గం | కిషన్‌గఢ్[3] | ||
| పదవీ కాలం 1989 డిసెంబర్ 2 – 1991 జూన్ 21 | |||
| ముందు | మహమ్మద్ అయూబ్ ఖాన్ | ||
| తరువాత | మహమ్మద్ అయూబ్ ఖాన్ | ||
| నియోజకవర్గం | జుంఝును | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1951 మే 18 కితానా , రాజస్థాన్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1991–2003) జనతాదళ్ (1991 వరకు) | ||
| జీవిత భాగస్వామి |
సుదేశ్ ధంఖర్ (m. 1979) | ||
| సంతానం | 1 | ||
| పూర్వ విద్యార్థి | రాజస్థాన్ విశ్వవిద్యాలయం (బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ) | ||
| వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు | ||

జగదీప్ థన్కర్ (జననం 1951 మే 18) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఆయన 2019 నుండి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, 2022 నుండి 2025 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పని చేశాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]జగదీప్ ధంఖర్ 1951 మే 18 న భారతదేశంలోని రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని కిథానా గ్రామంలో గోకల్ చంద్ & కేసరి దేవి దంపతులకు హిందూ రాజస్థానీ జాట్ కుటుంబంలో జన్మించాడు. ఆయన చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను, ప్రాథమిక & మధ్యస్థ పాఠశాల విద్యను కిథానా ప్రభుత్వ పాఠశాల, ఘర్ధన ప్రభుత్వ పాఠశాల నుండి పూర్తి చేసి జైపూర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ & ఎల్‌ఎల్‌బి పట్టా పొందాడు.
ధంఖర్ 1979లో సుదేష్ ధంఖర్‌ను వివాహం చేసుకున్నాడు, వారికి కుమార్తె కామ్నా ఉంది.[4]
రాజకీయ జీవితం
[మార్చు]జగదీప్ ధన్‌ఖడ్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జుంఝును లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై చంద్రశేఖర్ మంత్రివర్గంలో 1990 నవంబర్ 21 నుండి 1991 జూన్ 21 వరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1993 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో కిషన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జగదీప్ ధన్‌ఖడ్ 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జుంఝును లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 94,376 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2003లో భారతీయ జనతా పార్టీలో చేరి 2008 శాసనసభ ఎన్నికలకు పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా, 2016లో బిజెపి న్యాయ & న్యాయ వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహించాడు.
జగదీప్ ధంఖర్‌ను 2019 జూలై 20న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించగా జూలై 30న కోల్‌కతాలోని రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనను 2022 జూలై 16న 2022లో జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి తరపున నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అభ్యర్థిగా అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో గెలిచి,[5] 2022 ఆగస్టు 11న భారత ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[6][7]
జగదీప్ ధంఖర్ 2025 జూలై 21న ఆరోగ్య సమస్యల కారణాలతో భారత ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాడు.[8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Jagdeep Dhankhar takes oath as West Bengal Governor". Outlook. 30 July 2019. Archived from the original on 13 January 2020. Retrieved 13 January 2020.
- ↑ "Dhankhar resigns as Bengal guv after VP nomination, Manipur's La Ganesan gets additional charge". Hindustan Times (in ఇంగ్లీష్). 17 July 2022. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "Kishangarh Assembly Election MLA Political Data". entranceindia.com. 6 October 2018. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "Our Governor: Raj Bhavan, West Bengal, India". Raj Bhavan, West Bengal, India. Retrieved 15 May 2021.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్". 10TV Telugu. 6 August 2022. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కఢ్ ప్రమాణ స్వీకారం". A. B. P. Desam. 11 August 2022. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ ప్రమాణస్వీకారం". NT News. 11 August 2022. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా". Eenadu. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా". Andhrajyothy. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా..!". NT News. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.