జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్
| Established | 1976 |
|---|---|
| Location | దోమల్‌గూడ, హిమాయత్‌నగర్, హైదరాబాదు, తెలంగాణ |
| Type | పురావస్తు మ్యూజియం |
| Website | http://www.mittalmuseum.com/ |
జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్, భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న ఒక పురావస్తు మ్యూజియం. ఇందులో జగదీష్ మిట్టల్ (1925-2025), అతని భార్య కమలా మిట్టల్ వ్యక్తిగత కళా సేకరణలు ఉన్నాయి.[1][2] జగదీష్ మిట్టల్ స్వయంగా ఒక కళాకారుడు, దశాబ్దాలుగా కళలను సేకరించాడు. 1990లో జగదీష్ మిట్టల్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది.[3]
1976లో, ఈ జంట తమ కళా సేకరణను దేశానికి అప్పగించాలని నిర్ణయించుకుని, హైదరాబాదులో జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అనే పబ్లిక్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం సేకరణలో క్రీ పూ 1, క్రీ పూ 1900 మధ్య కాలానికి చెందిన 2 వేల కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి.[4]
వీటిలో సూక్ష్మ చిత్రాలు (మొఘల్ చిత్రకళ), డ్రాయింగ్లు, మాన్యుస్క్రిప్ట్స్, ఇస్లామిక్ కాలిగ్రఫీ, జానపద, శాస్త్రీయ కాంస్యాలు, టెర్రకోట వస్తువులు, చెక్క చెక్కడాలు, దంతాలు, గాజు, పింగాణి, లోహపు వస్తువులు. అలాగే, కాంస్య, ఇత్తడి, రాగి, వెండి, బిద్రీ కళా వస్తువులు, వస్త్రాలు కూడా ఉన్నాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Home | Jagdish and Kamla Mittal Museum of Indian Art". www.mittalmuseum.com. Retrieved 2019-01-27.
- ↑ Murthy, Neeraja (2014-10-08). "Honouring Jagdish Mittal". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-27.
- ↑ "Gazette of India" (PDF).
- ↑ "He lives for art". The Hindu (in Indian English). 2014-12-18. ISSN 0971-751X. Retrieved 2019-01-27.
- ↑ "One man's lifelong devotion to Indian art". Apollo Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-27. Retrieved 2019-01-27.
- ↑ Singh, Vishwaveer (2018-08-19). "Custodian of Culture". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2019-01-27.