Jump to content

జగదీష్ విశ్వకర్మ

వికీపీడియా నుండి
జగదీష్ ఈశ్వరభాయ్ విశ్వకర్మ (పాంచల్)
జగదీష్ విశ్వకర్మ


పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16 – 2025 అక్టోబర్ 16

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012
నియోజకవర్గం నికోల్

పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16 – 2022 డిసెంబర్ 12

పదవీ కాలం
2022 ఆగస్టు 20 – 2022 డిసెంబర్ 12

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, గుజరాత్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2025 అక్టోబర్ 4
అధ్యక్షుడు జె.పి.నడ్డా
ముందు సి.ఆర్ పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-12) 1973 ఆగస్ట్ 12 (వయసు: 52)
అహ్మదాబాద్ , గుజరాత్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అల్కాబెన్
పూర్వ విద్యార్థి గుజరాత్ విశ్వవిద్యాలయం (బిఎ)
వృత్తి రాజకీయ నాయకుడు

జగదీష్ ఈశ్వరభాయ్ విశ్వకర్మ (పాంచల్) (జననం 12 ఆగస్టు 1973) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు నికోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు ఉన్నత & సాంకేతిక విద్య శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జగదీష్‌భాయ్ విశ్వకర్మ 1973 ఆగస్టు 12న ఈశ్వర్భాయ్, పార్వతిబెన్‌ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగింది, కళాశాల విద్య అహ్మదాబాద్‌లోని నవగుజరాత్ కళాశాలలో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జగదీష్‌భాయ్ విశ్వకర్మ 1998లో థక్కర్బపనగర్‌లో బూత్ ఇన్‌చార్జ్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో నికోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2013లో భారతీయ జనతా పార్టీకి ఇండస్ట్రీ సెల్ కన్వీనర్‌గా, ఆ తరువాత బిజెపి అహ్మదాబాద్ నగర అధ్యక్షుడిగా పని చేశాడు

జగదీష్‌భాయ్ విశ్వకర్మ 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో నికోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి శాసనసభ్యుడిగా, ఆ తరువాత 2021లో సహకార, అటవీ & పర్యావరణ, పరిశ్రమ, ప్రోటోకాల్, పౌర విమానయానం మంత్రిగా పని చేశాడు. ఆయన 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2022 డిసెంబర్ నుండి 2025 అక్టోబర్ 16 వరకు సహకార, ఉప్పు పరిశ్రమ, ప్రింటింగ్ స్టేషనరీ & ప్రోటోకాల్ (స్వతంత్ర బాధ్యత), సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు, కుటీర ఖాదీ & గ్రామీణ పరిశ్రమలు, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

జగదీష్‌భాయ్ విశ్వకర్మ 2025 అక్టోబర్ 4న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  2. "Minister Jagdish Vishwakarma named new Gujarat BJP chief" (in Indian English). The Hindu. 4 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  3. "Why the BJP chose Jagdish Vishwakarma, a non-Patel leader, as Gujarat chief" (in ఇంగ్లీష్). India Today. 6 October 2025. Retrieved 20 October 2025.
  4. "From Booth Worker To BJP's New Gujarat Chief: Meet Jagdish Vishwakarma". News18. 4 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.