జగన్నాథ ఆలయం, అహ్మదాబాద్
| జగన్నాథ్ ఆలయం | |
|---|---|
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 23°00′41.1″N 72°34′51.2″E / 23.011417°N 72.580889°E |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | గుజరాత్ |
| జిల్లా | అహ్మదాబాద్ |
| ప్రదేశం | జమల్పూర్, అహ్మదాబాద్ |
| సంస్కృతి | |
| దైవం | జగన్నాథుడు |
| ముఖ్యమైన పర్వాలు | రథయాత్ర |
| చరిత్ర, నిర్వహణ | |
| దేవస్థాన కమిటీ | శ్రీ జగన్నాథ మందిర్ ట్రస్టు కమిటీ |
జగన్నాథ దేవాలయం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో హిందూ దేవుడైన జగన్నాథుడికి అంకితం చేయబడిన ఒక దేవాలయం. ఈ దేవాలయం తన వార్షిక రథయాత్ర ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది, ఇది పూరీలోని రథయాత్ర తర్వాత మూడవ అత్యంత ముఖ్యమైన, పెద్ద ఉత్సవం. ఈ దేవాలయం ప్రతిరోజూ ఉదయం 04:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు, మధ్యాహ్నం 03:00 నుండి రాత్రి 09:00 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది.
రథ యాత్ర
[మార్చు]అహ్మదాబాద్‌లో జరిగే వార్షిక రథయాత్ర, పూరీలో జరిగే రథయాత్రతో ఒకే రోజున జరుగుతుంది. సంప్రదాయం ప్రకారం, ముందుగా ఏనుగులు శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రను దర్శించి, ఆ తరువాత రథయాత్రను ముందుండి నడిపిస్తాయి.[1] ఈ రథయాత్రకు ముందు, గుజరాత్ ముఖ్యమంత్రి ‘పహింద్ విధి’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో జగన్నాథుని రథం వెళ్లే మార్గాన్ని ప్రతీకాత్మకంగా శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల గుండా సుమారు 14 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ యాత్ర సరస్పూర్ వద్ద ఆగుతుంది. అక్కడ స్థానికులు జగన్నాథుని భక్తులకు ‘మహాభోజనం’ (సామూహిక భోజనం) సమర్పిస్తారు. ఈ రథయాత్రను గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రజా పండుగగా "లోకోత్సవం" గా జరుపుకుంటారు. అహ్మదాబాద్ రథయాత్ర, పూరి, కోల్ కతా జరిగే రథయాత్రల తర్వాత, దేశంలో మూడవ అతిపెద్ద రథయాత్రగా ప్రసిద్ధి చెందింది.
1969 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆలయంపై దాడి
[మార్చు]1969 సెప్టెంబర్ 18న, జమాల్‌పూర్ ప్రాంతంలో భుఖారీ సాహెబ్ అనే సూఫీ సంత్ సమాధి వద్ద ఉర్స్ పండుగ జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. అదే సమయంలో, సమీపంలోని జగన్నాథ ఆలయం నుంచి సాధువులు తమ ఆవులను ఆలయానికి తిరిగి తీసుకువెళ్తున్నారు. గందరగోళంలో కొందరు ముస్లిం మహిళలకు గాయాలు అయ్యాయి. ఆవులు కొన్ని వ్యాపార బండ్లను దెబ్బతీశాయి.
దీంతో ఉద్రిక్తత పెరిగి హింస చెలరేగింది. కొందరు ముస్లిం యువకులు సాధువులపై దాడి చేసి జగన్నాథ ఆలయ కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ ప్రధాన పూజారి సేవాదాస్‌జీ నిరసనగా ఉపవాసం ప్రారంభించాడు. ముస్లిం నాయకుల బృందం వచ్చి క్షమాపణ చెప్పడంతో ఆయన ఉపవాసం విరమించాడు.
తరువాత, కొందరు హిందువులు ఆలయం దగ్గర ఉన్న ఒక దర్గాను ధ్వంసం చేశారు. దీని వల్ల ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరి నిరసన తెలిపారు. సెప్టెంబర్ 19 మధ్యాహ్నం సుమారు 2,500 నుంచి 3,000 మంది ముస్లింలు మళ్లీ ఆలయంపై దాడి చేశారు. ఆ తరువాత వదంతులు వ్యాపించి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అగ్నిప్రమాదాలు, హత్యలు, ప్రార్థనా స్థలాలపై దాడులు చోటు చేసుకున్నాయి.
అనుసంధానం
[మార్చు]రోడ్డు మార్గం ద్వారా-అహ్మదాబాద్ నగరం గుజరాత్ ప్రతి ప్రధాన నగరానికి రహదారి మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. జగన్నాథ ఆలయానికి చాలా ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.
విమాన మార్గం ద్వారా-అహ్మదాబాద్ ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలకు వాయుమార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచం నలుమూలల నుండి విమానాలు అందుతాయి.
రైలు ద్వారా-అహ్మదాబాద్ నగరం రైల్వే ద్వారా గుజరాత్ ప్రధాన నగరాలకు కూడా అనుసంధానించబడి ఉంది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అనేక నగరాల నుండి రైళ్లు వస్తాయి. అహ్మదాబాద్ నుండి జగన్నాథ్ ఆలయానికి రైలు ఉంది.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "136th Jagannath rath yatra begins in Ahmedabad amid tight security". India Today. 10 July 2013. Retrieved 13 July 2014.
- ↑ "136th Jagannath rath yatra begins in Ahmedabad amid tight security". India Today. 10 July 2013. Retrieved 13 July 2014.