జగమొండి
జగమొండి | |
---|---|
![]() జగమొండి సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | వి. మధుసూదనరావు |
రచన | ఆర్.కె. ధర్మరాజు (కథ), వి. మధుసూదనరావు (చిత్రానువాదం) |
నిర్మాత | కె. ఛటర్జీ |
నటవర్గం | శోభన్ బాబు, రతి అగ్నిహోత్రి, సత్యనారాయణ |
కూర్పు | వి. అంకిరెడ్డి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సమత మూవీస్ |
విడుదల తేదీలు | 1981 |
నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జగమొండి 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సమత మూవీస్ పతాకంపై కె. ఛటర్జీ నిర్మాణ సారథ్యంలో వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రతి అగ్నిహోత్రి, సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]
కథ[మార్చు]
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ శోభన్ బాబు స్మగ్లింగ్ చేసి సత్యనారాయణ, ప్రభాకరరెడ్డిలను పట్టుకొని జైలులో వేస్తాడు. ఆ తరువాత దొరికిన సెలవుతో సరదాగా భార్య (షావుకారు జానకి), కొడుకును తీసుకొని ఊటి వెలుతాడు. ఊటి శక్షభన్ బాబును విలన్ గ్యాంగ్ చంపేస్తారు. కొడుకును కూడా చంపబోతుంటే కార్ డ్రైవర్ (రాళ్ళపల్లి) కాపాడతాడు. ఆ ప్రమాదంలో గాయాలపాలై తన పిల్లలను (రాజ్యలక్ష్మీ, రాజ్ కుమార్) జానకికి అప్పగించి చనిపోతాడు. శోభన్ బాబు (జానకి కొడుకు) ఆ ప్రమాదంలో తల్లి నుంచి విడిపోయి జగమొండి అని పేరులో చెడ్డవాళ్ళు చేసి పనికి అడ్డుపడుతూవుంటాడు. జానకి, రాళ్ళపల్లి పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. జగమొండి విలన్లను పట్టుకొని, తన తండ్రిని చంపిన వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడన్నది మిగతా కథ. రాజ్యలక్ష్మీకి సురేష్, రాజ్ కుమార్ కు గీత, శోభన్ బాబుకు రతి జంటగా నటించారు.
నటవర్గం[మార్చు]
- శోభన్ బాబు
- రతి అగ్నిహోత్రి
- సత్యనారాయణ
- ప్రభాకరరెడ్డి
- షావుకారు జానకి
- సురేష్
- గీత
- రాజబాబు
- రాళ్ళపల్లి
- రాజ్యలక్ష్మీ
- రాజ్ కుమార్
- సుంకర లక్ష్మి
సాంకేతికవర్గం[మార్చు]
- చిత్రానువాదం, దర్శకత్వం: వి. మధుసూదనరావు
- నిర్మాత: కె. ఛటర్జీ
- కథ: ఆర్.కె. ధర్మరాజు
- సంగీతం: కె. చక్రవర్తి
- కూర్పు: వి. అంకిరెడ్డి
- నిర్మాణ సంస్థ: సమత మూవీస్
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.[3]
- అజ్జీరబజ్జీ మసాల (03:23)
- అరె డిస్క్ టింగులాడి (04:10)
- చుప్పనాతి సుబ్బమ్మ (03:19)
- గుండెలోవున్నది (03:53)
- వన్ టూ త్రి ఫోర్
- చక్కనమ్మకు
మూలాలు[మార్చు]
- ↑ Cinestaan, Movies. "Jagamondi (1981)". www.cinestaan.com. Retrieved 20 August 2020.
- ↑ Moviebuff, Movies. "Jagamondi". www.moviebuff.com. Retrieved 20 August 2020.
- ↑ SenSongsMp3, Songs (17 July 2015). "Jagamondi Mp3 Songs". www.sensongsmp3.co.In. Retrieved 20 August 2020.