జగ్గన్నగారి శ్రీనివాస్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగ్గన్నగారి శ్రీనివాస్ రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-

వ్యక్తిగత వివరాలు

జననం (1969-08-31) 1969 ఆగస్టు 31 (వయసు 54)
గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు జె. మాణిక్యరావు
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్

జగ్గన్నగారి శ్రీనివాస్‌ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

జగ్గన్నగారి శ్రీనివాసరావు 1969 ఆగస్టు 31న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేటలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1999 ఏప్రిల్‌ 29న బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం[మార్చు]

జగ్గన్నగారి శ్రీనివాసరావు న్యాయవాది జీ కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పని చేసి హైకోర్టులో 2006 నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించి అన్ని స్థాయి కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశాడు. ఆయన 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పని చేస్తున్నాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3]

2022 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సమక్షంలో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  2. Eenadu (26 July 2022). "హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.