జనం మనం
జనం మనం (తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | మోహన్‌దాస్ |
నిర్మాణం | మాదాల రంగారావు |
కథ | మాదాల రంగారావు |
తారాగణం | మాదాల రంగారావు, గుమ్మడి, ప్రభ |
సంగీతం | టి.చలపతిరావు |
గీతరచన | మల్లిక్ |
సంభాషణలు | మోహన్‌దాస్ |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్.కృష్ణారావు |
కూర్పు | చౌదుల సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | నవతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
జనం మనం మాదాల రంగారావు నిర్మాణ సారథ్యంలో మోహన్‌దాస్ దర్శకత్వంలో నవతరం పిక్చర్స్ బ్యానర్‌పై 1984, ఆగష్టు 15న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు[మార్చు]
- మాదాల రంగారావు - సూర్యం
- గుమ్మడి వెంకటేశ్వరరావు - పరమేశ్వరశాస్త్రి
- ప్రభ
- లక్ష్మీచిత్ర
- సాక్షి రంగారావు
- నల్లూరి వెంకటేశ్వర్లు
- జయప్రకాశ్ రెడ్డి
- ఆర్.నారాయణమూర్తి
- విజయకుమారి
సాంకేతికవర్గం[మార్చు]
- కథ, నిర్మాత: మాదాల రంగారావు
- దర్శకుడు: మోహన్ దాస్
- సంగీతం: టి.చలపతిరావు
- నేపథ్యగాయకులు: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి, విజయలక్ష్మీశర్మ
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
- కూర్పు: చౌదుల సుబ్బారావు
సంక్షిప్త చిత్రకథ[మార్చు]
పరమేశ్వరశాస్త్రి సంగీత విద్వాంసుడు. పరమ నైష్టికుడు. అతని సంగీతం దైవానికి అంకితం. అతని కుమారుడు సూర్యం తండ్రి శిక్షణలో సంగీతం నేర్చుకున్నాడు. కానీ తండ్రీ కొడుకుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పరమేశ్వరశాస్త్రి భక్తి సంగీతం ప్రజలను మత్తులో పడవేస్తుందని సూర్యం అభిప్రాయం. ప్రజలకే తన సంగీతాన్ని అంకితం చేయాలనుకుంటాడు. దానితో ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది. సూర్యం ఇల్లు వదిలిపెడతాడు. జీవనం కోసం అనేక వృత్తులు చేస్తాడు. ప్రజానాట్యమండలితో సూర్యానికి పరిచయం ఏర్పడుతుంది. సూర్యం సామాన్య జనంతో కలిసిపోతాడు. తల్లి మరణించిందని తెలిసి ఇంటికి వెళితే పరమేశ్వరశాస్త్రి అతనికి తల్లిని కడసారి చూసే అవకాశం కూడా ఇవ్వడు. పరమేశ్వరశాస్త్రి పరిస్థితి తారుమారవుతుంది. బిక్షమెత్తవలసి వస్తుంది. రాజకీయనాయకులు ఆడిన నాటకంలో మళ్ళీ తండ్రీకొడుకులు ఘర్షణ పడతారు. దేవునికి, సామాన్యులకు మధ్య, గుడికి గుడిసెలకు మధ్య సంఘర్షణ చిత్రంలో పతాక సన్నివేశం[1].
మూలాలు[మార్చు]
- ↑ ఎం.ఎల్.రెడ్డి (27 August 1984). "చిత్రసమీక్ష - జనం మనం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 13 January 2021.