జనతాదళ్

వికీపీడియా నుండి
(జనతా దళ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జనతా దళ్ ఒక భారతదేశ రాజకీయ పార్టీ. ఇది జనతా పార్టీ లోని ఒక ప్రధాన రాజకీయ పక్షంతో పాటు, లోక్ దళ్ మరియు వి.పి.సింగ్ నాయకత్వంలోని కొందరు భారత జాతీయ కాంగ్రెస్ లోని సభ్యుల కలయికతో ఏర్పడింది.

అధికారంలోకి[మార్చు]

జనతా దళ్ యొక్క ఎన్నికల గుర్తు

1989 లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ) బోఫోర్స్ కుంభకోణం ఆరోపణల వలన ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన తరువాత, ఇది మొదటి సారిగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో జనతా దళ్ మరి కొన్ని చిన్న పార్టీలు ఉండగా, భారతీయ జనతా పార్టీ మరియు కమ్యూనిస్టులు బయటి నుంచి మద్దతు ఇచ్చారు. వి.పి.సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. నవంబరు 1990లో ఈ సంకీర్ణం కుప్ప కూలింది. చంద్ర శేఖర్ నాయకత్వంలో, జనతా దళ్ లోని ఒక వర్గము మరియు కాంగ్రెస్ (ఐ) మద్దతుతో మరొక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోని సేనియర్ నేత, ప్రధాని పదవికి అభ్యర్థి కాగల అశోక్ కుమార్ సేన్ పార్టీని వదిలి జనతా దళ్ ప్రభుత్వంలో ఉక్కు మరియు గనుల శాఖకు క్యాబినెట్ మంత్రిగా చేరడం, అప్పట్లో ఎంతో వివాదాస్పదం అయింది. ఎలాగైతేనేమి, ఈ సంకీర్ణం జూన్ 1991లో కూలిపోయి మళ్ళీ ఎన్నికలు రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం అయ్యింది.

1996లో కాంగ్రెస్ (ఐ) బయటి నుంచి మద్దతు ఇవ్వగా, హెచ్. డి. దేవెగౌడ ప్రధాన మంత్రిగా జనతా దళ్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పార్టీకి రెండవ విడత అధికారం మొదలయింది. యునైటెడ్ ఫ్రంట్ లోని భాగస్వామ్య పక్షాల మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే ఆశతో ఒక సంవత్సరం లోపే కాంగ్రెస్ (ఐ) తన మద్దతును ఉపసంహరించుకోగా ఇందర్ కుమార్ గుజ్రాల్ జనతా దళ్ నుంచి తరువాతి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వం కొన్ని నెలల్లోనే కూలిపోగా, ఫిబ్రవరి 1998లో జనతా దళ్ నాయకత్వంలోని సంకీర్ణం భారతీయ జనతా పార్టీకి తన అధికారాన్ని కోల్పోయింది.

జనతా పరివార్ పార్టీలు[మార్చు]

యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ లోని పార్టీలు

 • యం.పి.వీరెంద్రకుమార్ గారి సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్) పార్టీ

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోని పార్టీలు

 • జనతా దళ్ (యునైటెడ్)
 • జార్జ్ ఫెర్నాండెజ్ గారి సమతా పార్టీ. ఇది ప్రస్తుతం బ్రహ్మానంద్ మండలం మరియు జయ జైట్లీ నాయకత్వంలో ఉంది.
 • సుబ్రహ్మణ్య స్వామి నాయకత్వంలోని జనతా పార్టీ

నూతన థర్డ్ ఫ్రంట్ లోని పార్టీలు

 • సమాజ్ వాది పార్టీ
 • బిజు జనతా దళ్
 • రాష్ట్రీయ జనతా దళ్
 • అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్
 • జనతా దళ్ (సెక్యులర్)
 • ఓం ప్రకాష్ చౌతాలా నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్
 • లోక్ జనశక్తి పార్టీ
 • ప్రస్తుతం కమల్ మొరార్క నాయకత్వం వహిస్తున్న, కీ.శే. చంద్ర శేఖర్ గారి సమాజ్ వాది పార్టీ (రాష్ట్రీయ)

మూస:Leaders of Janata Dal

"https://te.wikipedia.org/w/index.php?title=జనతాదళ్&oldid=2368409" నుండి వెలికితీశారు