జనసేన పార్టీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జన సేన పార్టీ
వ్యవస్తాపకుడు పవన్ కళ్యాణ్
స్థాపన 14 మార్చి 2014 (2014-03-14)
సిద్ధాంతం Populist
Regionalist
ECI Status రాష్ట్ర పార్టీ
వెబ్ సిటు
http://janasenaparty.org/
వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్

జనసేన లేదా జనసేన పార్టీ అనునది ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. జన సేన అనగా ప్రజా సైన్యం అని అర్థం. పార్టీ లోగో మరియు రంగులు చే గువేరా మరియు అనేక ఇతర ప్రభావవంతమైన నాయకుల వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి.

చరిత్ర[మార్చు]

పవన్ కళ్యాణ్ మార్చి 10, 2014 న ఎన్నికల కమిషన్ ను కలసి పార్టీ పేరు నమోదు కోసం ఒక అప్లికేషన్ సమర్పించారు.

ఆవిర్భావం[మార్చు]

మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు.[1]

లక్ష్యాలు[మార్చు]

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో నిలకడ లేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించారు. ఆవిర్భావ సభలో ప్రసంగాన్ని అనుసరించి మౌలిక లక్ష్యాలుగా వీటిని పేర్కొనవచ్చు:[1]

  • బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన.
  • విద్య, వైద్యం మెరుగుపరచడం.
  • చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.
  • ప్రజాధనం వ్యయానికి కాపలా.
  • జాతీయ సమైక్యత.

పార్టీ చిహ్నం మరియు జెండా[మార్చు]

ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను మరియు పోరాటాలను నిర్వచించే ఒక దళముల కలయిక.

దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత మరియు సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి మరియు స్థిరత్వమును సూచిస్తుంది.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఇదే పేరుతో మరొక ధరఖాస్తు అందినట్టుగా ఎన్నికలు కమీషనర్ సూచించారు. దీనిపై త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తానని టివి.9 వారి ఇంటర్యూలో తెలియచేసారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

[[ప

లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]