Jump to content

జనార్దన్ ప్రసాద్ మిశ్రా

వికీపీడియా నుండి
జనార్దన్ ప్రసాద్ మిశ్రా

పదవీ కాలం
1998  1999
ముందు ముక్తార్ అనీస్
తరువాత రాజేశ్ వర్మ
నియోజకవర్గం సీతాపూర్
పదవీ కాలం
1991  1996
ముందు రాజేంద్ర కుమారి బాజ్‌పేయ్
తరువాత ముక్తార్ అనీస్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం సీతాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం

జనార్దన్ ప్రసాద్ మిశ్రా (జననం 6 నవంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సీతాపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జనార్దన్ ప్రసాద్ మిశ్రా భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రాజేంద్ర కుమారి బాజ్‌పేయ్ పై 37706 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1996 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి ముక్తార్ అనిస్ చేతిలో 10046 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

జనార్దన్ ప్రసాద్ మిశ్రా 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ప్రేమ్ నాథ్ వర్మపై 27,920 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి రాజేష్ వర్మ చేతిలో 36,362 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

జనార్దన్ ప్రసాద్ మిశ్రా 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 137822 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Sitapur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 25 June 2025. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  2. "Rajesh Verma: BJP's Trust In The Sitapur Seat" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 March 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  3. "सीतापुर लोकसभा सीट पर BSP की हैट्रिक, अब BJP की बारी, क्या INDIA गठबंधन कर पाएगा कोई कमाल" (in హిందీ). TV9 Bharatvarsh. 24 March 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.