జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో, జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు (హింది: जन लोकपाल विधेयक) (పౌర విచారణాధికారి బిల్లు ) అనేది జన్ లోక్‌పాల్ అని పిలువబడే ఒక విచారణాధికారిని సృష్టించే అవినీతి-వ్యతిరేక చట్టం యొక్క ముసాయిదా; ఎన్నికల కమిషన్ వలెనే ఇది కూడా రాజకీయ నాయకులను మరియు ప్రభుత్వాధికారులను ప్రభుత్వ అనుమతి అవసరంలేకనే విచారించగలిగే ఒక స్వతంత్ర సంస్థ.[1]

శాంతి భూషణ్, ఇండియన్ పోలీస్ సర్వీస్ విశ్రాంత అధికారిణి కిరణ్ బేడి, జస్టిస్ N. సంతోష్ హెగ్డే, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ J. M. లింగ్డోలచే ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ నాయకులు మరియు పౌర సమాజం యొక్క సంప్రదింపులతో రచించబడిన ఈ బిల్లులు, కేంద్రంలో లోక్‌పాల్ (విచారణాధికారి) మరియు రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త సంస్థల స్థాపనను ప్రతిపాదిస్తుంది. ఈ బిల్లులు అవినీతిపై సమర్ధంగా పనిచేస్తూ ఫిర్యాదులను వెలుగులోకి తెచ్చేవారికి రక్షణ కల్పించే ఒక సమర్ధవంతమైన అవినీతి-వ్యతిరేక మరియు క్లేశ నివారణ యంత్రాంగమును సృష్టించటానికి రూపొందించబడింది.[2][3]

42 సంవత్సరాలుగా, ప్రభుత్వ-రూపొందిత బిల్లులు భారతదేశ పార్లమెంట్ యొక్క ఎగువ సభ అయిన రాజ్య సభ యొక్క ఆమోదాన్ని పొందలేక పోయింది.[4] మొదటి లోక్‌పాల్ బిల్లు 1969లో 4వ లోక్ సభలో ఆమోదించబడింది[clarification needed What is this?] అయితే రాజ్య సభలో నిలిచిపోయింది. తరువాత లోక్‌పాల్ బిల్లులులు వరుసగా 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008లలో ప్రవేశపెట్టబడ్డాయి కానీ ఆమోదం పొందడంలో విఫలమయ్యాయి.[5] అన్నా హజారే యొక్క నాలుగు రోజుల నిరాహార దీక్ష తరువాత,[clarification needed] ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2011 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టబడుతుందని ప్రకటించారు.[6]

నేపథ్యం[మార్చు]

ప్రభుత్వంచే రూపొందించబడిన 2010 లోక్‌పాల్ బిల్లులుకు మరియు ఈ ఉద్యమం యొక్క సభ్యులు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ న్యాయమూర్తి మరియు కర్ణాటక లోకాయుక్త అయిన N. సంతోష్ హెగ్డే, సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరియు ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం యొక్క సభ్యులతో కలిసి తయారుచేయబడిన జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లులుకు మధ్యగల తీవ్ర వైరుధ్యాల పట్ల వ్యతిరేకతతో జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు‌ను తిరిగి రూపొందించాలనే పిలుపు ఊపందుకుంది. అంతర్జాల సామాజిక మాధ్యమాలైన ట్విటర్ మరియు ఫేస్‌బుక్‌ల ద్వారా అనేకమంది ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ రవి శంకర్, స్వామి రాందేవ్, స్వామి అగ్ని‌వేష్‌లతో పాటు భారత క్రికెట్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్,[7] అనేకమంది ప్రముఖ వ్యక్తులు విస్తృత ప్రజామోదం పొందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్[8] ద్వారా తమ బహిరంగ మద్దతును ప్రకటించారు. బిల్లులు మద్దతుదారులు ప్రస్తుతమున్న చట్టాలు అవినీతిని అరికట్టటానికి సరిపోవనీ మరియు బలహీనమైనవనీ భావిస్తున్నారు.[9][10]

ప్రతిపాదిత బిల్లులు యొక్క కీలక అంశాలు.[మార్చు]

 1. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తతో పాటు కేంద్ర ప్రభుత్వ అవినీతి-వ్యతిరేక సంస్థ లోక్‌పాల్ ‌ను ఏర్పాటు చేయుట.
 2. సుప్రీం కోర్ట్ మరియు కాబినెట్ సెక్రెటేరియట్‌ల వలెనే, లోక్‌పాల్, కాబినెట్ సెక్రటరీ మరియు ఎన్నికల కమిషన్‌లచేత పర్యవేక్షించబడుతుంది. ఫలితంగా, ఇది ప్రభుత్వం నుండి స్వతంత్రంగాఉండి, తన పరిశోధనలలో మంత్రిత్వశాఖల ప్రభావానికి లోనుకాకుండా ఉంటుంది.
 3. సభ్యులు, న్యాయమూర్తులు, స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు, పౌరులు మరియు రాజ్యాంగ సంస్థల ద్వారా పారదర్శక మరియు భాగస్వామ్య పద్ధతిలో నియమించబడతారు.
 4. ఒక ఎంపిక కమిటీ తుది ఎన్నిక కోసం ఎంపిక చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది, తరువాత వీటి యొక్క వీడియో రికార్డింగులు బహిర్గతపరచబడతాయి.
 5. లోకాయుక్త తను చేపట్టిన కేసుల జాబితా, క్లుప్తంగా వాటి వివరాలు, వాటి ఫలితాలు మరియు వాటిపై తీసుకున్నటువంటి లేదా ప్రతిపాదించిన చర్యలకు సంబంధించిన వివరాలను ప్రతి నెలా తన వెబ్‌సైట్‌లో ప్రచురిస్తుంది. ఇది క్రితంనెలలో లోకాయుక్తకు చేరిన కేసుల జాబితా, విచారించబడిన కేసులు మరియు ఇంకనూ విచారించవలసిన కేసుల జాబితాను కూడా ప్రచురిస్తుంది.
 6. ప్రతి కేసు యొక్క పరిశోధన ఒక సంవత్సరంలో పూర్తికావాలి. ఏవైనా తుది విచారణలు తదుపరి సంవత్సరంలో పూర్తి అయ్యేటట్లుగా, గరిష్ఠంగా రెండు సంవత్సరాల కాల వ్యవధి ఇవ్వబడతాయి.
 7. ఒక అవినీతిపరుడైన వ్యక్తి చేత ప్రభుత్వానికి కలిగిన నష్టం నేర నిర్ధారణ సమయంలో అతని నుండి వసూలు చేయబడుతుంది.
 8. ఒక పౌరునికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయపు పని నిర్దేశించిన సమయంలో పూర్తికాని యెడల, లోక్‌పాల్ దానికి బాధ్యులైనవారిపై ఆర్థిక జరిమానా విధిస్తుంది, ఆ తరువాత అది సంబంధిత ఫిర్యాదుదారునికి పరిహారంగా ఇవ్వబడుతుంది.
 9. లోక్‌పాల్ యొక్క ఏ అధికారిపై వచ్చిన ఫిర్యాదైనా ఒక నెలలోనే పరిశోధించబడి పూర్తిచేయబడుతుంది మరియు ప్రాముఖ్యత కలిగినదిగా గుర్తించబడితే ఆ అధికారి రెండు నెలలలోగా తొలగించబడతాడు.
 1. ప్రస్తుతం ఉనికిలో ఉన్న అవినీతి నిరోధక సంస్థలు (CVC, CBI యొక్క శాఖాపరమైన నిఘా మరియు అవినీతినిరోధక విభాగం) లోక్‌పాల్లో విలీనం చేయబడతాయి, అది ఏ అధికారి, న్యాయాధికారి లేదా రాజకీయవేత్తనయినా పరిశోధించి మరియు విచారించే శక్తిని మరియు అధికారాన్ని గలిగి ఉంటుంది.
 2. సమర్ధవంతమైన అవినీతి కేసుల పట్ల సంస్థను హెచ్చరించే కార్యకర్తలకు దానిచే రక్షణ కూడా కల్పించబడుతుంది.

ప్రతిపాదనల మధ్య తేడాలు[మార్చు]

ముసాయిదా లోక్‌పాల్ బిల్లు 2010 మరియు జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు మధ్య తేడా
[11]
ముసాయిదా లోక్‌పాల్ బిల్లు (2010) జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు (ప్రజా విచారణాధికారి బిల్లు)
అవినీతికి సంబంధించిన చర్యలపై లోక్‌పాల్కు తనకు తానుగా చర్య తీసుకొనే అధికారం లేదా సాధారణ ప్రజానీకం నుండి ఫిర్యాదులను స్వీకరించే అధికారం లేదు. అది కేవలం లోక్ సభ యొక్క స్పీకర్ లేదా రాజ్య సభ అధ్యక్షునిచే పంపబడిన ఫిర్యాదులను మాత్రమే విచారించగలదు. లోక్‌పాల్ ‌కు అవినీతికి సంబంధించిన చర్యలపై తనకు తానుగా చర్యలను చేపట్టడానికి లేదా సాధారణ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి అధికారం ఉంటుంది.
లోక్‌పాల్ పాత్ర కేవలం ఒక సలహా మండలిగా నివేదికలను "అర్హులైన అధికారికి" పంపడానికి పరిమితమవుతుంది. లోక్‌పాల్ పాత్ర సలహా మండలి కంటే ఎంతో అధికంగా ఉండి దోషులుగా గుర్తించబడిన వారినెవరినైనా విచారించే అధికారం కలిగి ఉంటుంది.
లోక్‌పాల్ పోలీసు అధికారాలు, FIR నమోదు సామర్ధ్యం లేదా నేర విచారణలో ముందుకుసాగే అధికారాలను కలిగి ఉండదు. లోక్‌పాల్ పోలీసు అధికారాలతో పాటు FIRలు నమోదు చేసే సామర్ధ్యం కూడా కలిగి ఉంటుంది.
CBI మరియు లోక్‌పాల్ ‌లు వేర్వేరుగా ఉంటాయి. లోక్‌పాల్ మరియు CBI యొక్క అవినీతి నిరోధక విభాగం ఒక స్వతంత్ర సంస్థగా ఉంటాయి.
అవినీతికి శిక్ష కనీసం 6 నెలల నుండి గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కనీస శిక్షలు 5 సంవత్సరాలతో ప్రారంభమై గరిష్ఠ స్థాయిలో జీవిత ఖైదు వరకు ఉండవచ్చు.

నిరసనలు[మార్చు]

2011 మార్చి 13న ఢిల్లీ నివాసితుల సమూహం తెల్ల చొక్కాలు మరియు t-షర్ట్ లు ధరించి అవినీతి-వ్యతిరేక ప్రచారానికి మరియు జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు‌కు మద్దతుగా నాలుగు గంటలపాటు నగరమంతా పర్యటించారు.[12]

జన్ లోక్‌పాల్ బిల్లులు చట్టం కొరకు, 2011 ఏప్రిల్ 5న అవినీతి-వ్యతిరేక కార్యకర్త అన్నా హజారే "ఆమరణ" నిరాహార దీక్ష ప్రారంభించాడు.[13] ఈ కోరికలకు మద్దతుగా సుమారు 6,000 మంది ముంబై నివాసితులు ఒక రోజు నిరాహారదీక్ష ప్రారంభించారు.[14] నిరసనకారులు పసుపును వారి వర్ణంగా ఎంచుకున్నారు మరియు పసుపు వస్త్రాలు, t-షర్ట్ లు మరియు పచ్చ జండాలు ఊపుతూ కనిపించారు. పసుపు ఆదివారాన్ని పాటించడానికి నగరాల మధ్య సమన్వయం జరుగుతోంది.[ఉల్లేఖన అవసరం]

ప్రభుత్వంచే జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు ఆమోదించబడనట్లయితే, 2011 ఏప్రిల్ 13న జైల్ భరో ఆందోళన్ [15] ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు హజారే ప్రకటించాడు. తన సమూహం ఆరు కోట్ల (60 మిలియన్ల) టెక్స్ట్ సందేశాలను మద్దతుగా పొందిందని[16] మరియు పెద్ద సంఖ్యలో అంతర్జాల కార్యకర్తల మద్దతు ఉందని కూడా ఆయన ప్రకటించాడు.

ఈ నిరసనలు రాజకీయ స్వభావాన్ని కలిగి లేవు మరియు పార్టీలు ఈ ప్రచారాన్ని తమ స్వంత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నట్లు హజారే భావించడం వలన, ఆయన నిరసనలలో రాజకీయనాయకుల ప్రవేశాన్ని హజారే మద్దతుదారులు ప్రోత్సహించలేదు.[17]

ప్రముఖ మద్దతుదారులు[మార్చు]

ఈ బిల్లులు మరియు నిరసనలు కూడా అనేక వర్గాల ప్రజల నుండి మద్దతు పొందాయి, వీరిలో రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు మరియు వినోదరంగానికి చెందిన వారు ఉన్నారు.

ప్రభుత్వ స్పందన[మార్చు]

అన్నా హజారే "ఆమరణ దీక్ష" ప్రకటించిన తరువాత కూడా[ఉల్లేఖన అవసరం], ప్రభుత్వం ప్రతిపాదిత బిల్లుల యొక్క కాపీని తాను అందుకోలేదని ప్రకటించింది, ఆయన ప్రధాన మంత్రిచే చర్చలకు ఆహ్వానించబడ్డారు, ఆ విధమైన చర్చలకు మే 13 వరకు ప్రభుత్వానికి సమయం లేదని కూడా తెలుపబడ్డారు.[18] ఆమరణ నిరాహార దీక్ష నుండి హజారేను విరమింపచేయడానికి, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను లోక్‌పాల్ బిల్లు‌లో ఏ విధంగా చేర్చవచ్చో పరిశీలించవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రజా మరియు న్యాయ మంత్రిత్వ శాఖలకు సూచించింది.[19]

5 ఏప్రిల్ 2011న, జాతీయ సలహా మండలి ప్రభుత్వంచే రూపొందించబడిన లోక్‌పాల్ బిల్లు‌ను తిరస్కరించింది. ఏప్రిల్ 7న ఈ బిల్లులుపై విభేదాలను తొలగించే మార్గాల కొరకు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి కపిల్ సిబాల్, సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేష్ మరియు అరవింద్ కేజ్రివాల్‌లను కలిసాడు.[20] హజారే దీక్షకు CPI (M) మద్దతు ప్రకటించింది, వారి పోలిట్ బ్యూరో సమర్ధవంతమైన లోక్‌పాల్ బిల్లు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

అనేక మార్లు చర్చలు జరిపిన తరువాత, 2011 ఏప్రిల్ 8న, ప్రభుత్వం తన డిమాండ్ లన్నిటికీ అంగీకరించినందు వలన తాను శనివారం ఉదయం దీక్ష విరమించనున్నట్లు అన్నా హజారే తన మద్దతుదారుల వద్ద ప్రకటించాడు. అంగీకారం కుదిరిన ప్రకారం, పదిమంది సభ్యులు గల ఉమ్మడి ముసాయిదా సంఘంలో ఐదుగురు పౌరసమాజం నుండి ఉంటారు. ప్రణబ్ ముఖర్జీ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా మరియు శాంతి భూషణ్ ఉపాధ్యక్షుడిగా ఉంటారు.[21]

ముసాయిదా కమిటీ[మార్చు]

2011 ఏప్రిల్ 8న ముసాయిదా కమిటీ అధికారికంగా ఏర్పడింది. ఇది పది మంది సభ్యులను కలిగి ఉండి, వీరిలో ఐదుగురు ప్రభుత్వం నుండి మరియు ఐదుగురు పౌర సమాజం నుండి ఉంటారు.

జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు యొక్క విమర్శలు[మార్చు]

అవినీతితో పోరాటంలో జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు 'సరళ' పద్ధతిలో ఉందని కొంతమంది ప్రజలు అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్, ఢిల్లీకి చెందిన ప్రతాప్ భాను మెహతా మాటలలో, "వ్యవస్థాపరమైన భావనలో ఈ బిల్లులు సాధ్యమైనంత సరళమైన; ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అతి హీనమైన వినాశకర ఉపోద్ఘాతాన్ని" కలిగి ఉంది.[22]

హజారే యొక్క సన్నిహిత అనుచరుడు, అరవింద్ కేజ్రివాల్ లోక్‌పాల్ బిల్లులు ఒక రాజ్యాంగేతర సంస్థగా ఉంటుందనే ఆరోపణను అపహాస్యం చేసాడు. పౌర సమాజంచే వ్రాయబడే జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు అవినీతి నేరాలను పరిశోధించి, విచారణ న్యాయస్థానాలు మరియు ఉన్నత న్యాయస్థానాలకు పరిశోధించి మరియు విచారించడానికి ఒక నివేదికను మాత్రమే సమర్పిస్తుందని ఆయన తెలిపాడు. సుప్రీం కోర్ట్, లోక్‌పాల్‌ను రద్దు చేయవచ్చని కూడా ప్రతిపాదిత బిల్లులులో స్పష్టంగా తెలియచేయబడిందని కూడా కేజ్రివాల్ ప్రకటించాడు.[23]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లు కొరకు నిరసనలు
 • అవినీతి గోచరాల సూచీ
 • భారతదేశంలో అవినీతి
 • భారతదేశంలో మోసాల జాబితా (క్రానికల్)
 • భారతదేశపు నల్ల ధనం
 • భారత దేశంలో "పైన ఉన్న వారిలో ఎవరూ కాదు" అనే ఓటింగ్ ఎంపిక

సూచనలు[మార్చు]

 1. "Dandi March 2 for Jan Lokpal Bill". Hindustan Times. 2011-03-27. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 2. "Activists Take Out March to Demand Jan Lokpal Bill". Outlook (magazine). Jan 30, 2011. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 3. "Hazare fears govt may block Lokpal Bill". The Times of India. Mar 17, 2011. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 4. "City activists garner support for Jan Lokpal bill". Hindustan Times. 2011-03-14. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 5. "Lokpal bill to cover PM". CNN-IBN. Nov 21, 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 6. "Anna Hazare's anti-corruption movement: Time-line". Mathrubhumi. Apr 09,2011. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help); Check date values in: |date= (help)
 7. "Support pours in for Hazare's movement". The Hindu. 7 April 2011. Retrieved 13 April 2011.
 8. "Bollywood supports Anna Hazare". Cite news requires |newspaper= (help)
 9. "Anna Hazare faults Lokpal Bill". The Hindu. 30 March 2011. Retrieved 13 April 2011.
 10. "Lead, kindly light". The Hindu. 13 April 2011. Retrieved 13 April 2011.
 11. "Lokpal Bill: Govt version vs civil society version". The Times of India. 7 April 2011. Retrieved 7 April 2011.
 12. "Drive around Delhi to demand strong Lokpal Bill". Sify News. 13 March 2011. మూలం నుండి 5 April 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 5 April 2011.
 13. "Anna Hazare announces fast unto death till Jan Lokpal Bill enacted". The Economic Times. 4 April 2011. మూలం నుండి 5 April 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 5 April 2011.
 14. "Mumbai to join Hazare's fast today for Jan Lokpal". The Indian Express. 5 April 2011. మూలం నుండి 5 April 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 5 April 2011.
 15. "Anna Hazare announces jail bharo movement on April 13". Indian Express. 8 April 2011. Retrieved 8 April 2011.
 16. NULL. "Anna Hazare: I asked PM whether his team shares his values - Forbes India". Moneycontrol.com. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 17. "Hazare fast: people heckle, chase out politicos - Politics - Politics News - ibnlive". Ibnlive.in.com. 2010-02-03. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 18. "What is Jan Lokpal Bill? | Sumit Gupta (aka sumit4all)". Sumit4all.com. 2011-03-12. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 19. "Find ways to include activists' opinion: PMO". Hindustan Times. 2011-03-10. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 20. "Hazare fast: Sibal meets Agnivesh, Kejriwal to pursue constructive dialogue". TruthDive. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 21. "Front Page : Government concedes Anna Hazare's demands". The Hindu. Retrieved 2011-04-09. Cite web requires |website= (help)
 22. "Of the few, by the few version". The Indian Express. 7 April 2011. Retrieved 8 April 2011.
 23. "I will fight till death: Anna Hazare". The Hindu. 7 April 2011. Retrieved 12 April 2011. Italic or bold markup not allowed in: |newspaper= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Corruption in India మూస:Scandals in India