Jump to content

జపు డేరు

వికీపీడియా నుండి
జపు డేరు

పదవీ కాలం
1984 – 2004
ముందు సినామ్ దుసుసోవ్ బోమ్డిలా
తరువాత ఆర్.టి. ఖుంజుజు
నియోజకవర్గం బొమ్‌డిలా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్)
వృత్తి రాజకీయ నాయకుడు

జపు డేరు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జపు డేరు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1984 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి పీపీఏ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సినామ్ డుసుసోవ్ పై 157 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1990 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి రించిన్ ఖారుపై 831 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

జపు డేరు 1995 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్.టి. ఖుంజుజుపై 821 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఆర్.టి. ఖుంజుజుపై 360 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

జపు డేరు 2004, 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బొమ్‌డిలా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్.టి. ఖుంజుజుపై 685 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. CEO Arunachal Pradesh. "List of contesting candidates" Archived 2 ఆగస్టు 2014 at the Wayback Machine
  2. "Arunachal Pradesh General Legislative Election 1984". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
  6. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జపు_డేరు&oldid=4589712" నుండి వెలికితీశారు