జబ్ వి మెట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jab We Met
దస్త్రం:Jab We Met Poster.jpg
దర్శకత్వము Imtiaz Ali
నిర్మాత Dhillin Mehta
రచన Imtiaz Ali
తారాగణం Shahid Kapoor
Kareena Kapoor
సంగీతం Pritam
Sanjoy Chowdhury (background)
Irshad Kamil (lyrics)
సినిమెటోగ్రఫీ Natarajan Subramaniam
కూర్పు Aarti Bajaj
డిస్ట్రిబ్యూటరు Shree Ashtavinayak Cine Vision Ltd
విడుదలైన తేదీలు United Kingdom
25 October 2007
Worldwide
26 October 2007
నిడివి 142 min
భాష Hindi/Punjabi
మొత్తం వ్యయం Rs. 55 crores[1]

జబ్ వి మెట్ ([1], ఆంగ్లం: సిన్స్ వుయ్ మెట్ ) 2007లో విడుదలయిన హాస్య ప్రేమకథా చిత్రం, దీని కథ రాసింది మరియు దర్శకత్వం వహించింది ఇంతియాజ్ అలీ.శ్రీ అష్ట వినాయక సినివిజన్ లిమిటెడ్ వారు సమర్పించిన ఈ చిత్రానికి ధిల్లిన్ మెహతా నిర్మాతగా వ్యవహరించారు. నటులు షాహిద్ కపూర్, కరీనా కపూర్ లు ఈ చిత్రం ద్వారా నాలుగోసారి కలిసి నటించారు. ఉత్తర [[భారతదేశ గొప్ప నటులు ధారా సింగ్, సౌమ్యా టాండన్|భారతదేశ [[గొప్ప నటులు ధారా సింగ్, సౌమ్యా టాండన్]]]] లు సహాయపాత్రలలో నటించారు.

ఈ చిత్రకథ ఒక చురుకైన పంజాబీ అమ్మాయి, జీవితం మీద నిరాశచెందిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాత్రిపూట ఢిల్లీకి వెళ్ళే రైలులో కలుసుకోవడంతో కథ మొదలవుతుంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి స్టేషను వద్ద దిగిపోయిన అతన్ని తిరిగి రైలు ఎక్కించే ప్రయత్నంలో ఆమె కూడా అతనితోపాటు ఒక నిర్మానుష్య ప్రాంతంలో మిగిలిపోతుంది. అత్యంత ఒత్తిడికి లోను చేస్తున్న అతని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన అతను మనసులో ఏవిధమైన లక్ష్యం లేకుండా ఉంటాడు, ఆ అమ్మాయి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పించి, తరువాత తన రహస్య ప్రేమికునితో పారిపోవడానికి సాయం అడుగుతుంది.

యు.కె.లో విడుదలకు ఒక రోజు ముందే, 26 అక్టోబరు 2007న ప్రపంచవ్యాప్తంగా విడుదలయి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరియు ఇతర దేశాలలో కూడా గొప్ప విజయాన్ని అందించింది. ఈ చిత్ర విజయంతో,చిత్ర పంపిణీదారులు శ్రీ అష్ట వినాయక సినివిజన్ లిమిటెడ్ వారు ఈ సినిమాను మోజర్ బేర్ కంపెనీ సహాయంతో నాలుగు దక్షిణభారత భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంలలో తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు.[2]

విషయసంగ్రహము[మార్చు]

ఒక గొప్ప పారిశ్రామికవేత్త యొక్క క్రుంగిపోయిన కొడుకైన ఆదిత్య కాష్యప్ (షాహిద్ కపూర్), తన ప్రేయసి వివాహం వేరొకనితో జరగడం చూసి నిరాశ చెందుతాడు. తన మొహాన్ని ప్రపంచానికి చూపించడానికి సిగ్గుపడి, ఆ పెళ్ళి నుండి బయటకు వచ్చి, ఆ రాత్రి రైలు ఎక్కుతాడు. ప్రయాణంలో ఉండగా, సొంత ఊరు భటిండా(పంజాబ్)కు వెళుతున్న ఒక అందమైన, చురుకైన అమ్మాయి గీత్ ధిల్లాన్ (కరీనా కపూర్)ను కలుస్తాడు.

ప్రారంభంలో, ఆదిత్య, గీత్ వల్ల చాలా చిరాకు పడతాడు, కలిసిన ప్రతిసారి అతన్ని మానసికంగా విసిగిస్తూ ఉంటుంది. కుటుంబసభ్యులు కోపపడతారనే భయంతో, తన ప్రియుడు అంశుమన్(తరుణ్ అరోరా)తో కలిసి పారిపోదామనే ఆలోచనను ఆదిత్యకు వివరిస్తుంది గీత్. గీత్ తో విసిగిపోయిన ఆదిత్య రైలు దిగిపోతాడు. అతన్ని తిరిగి తీసుకురావాలనే ప్రయత్నంలో గీత్ కూడా రైలు దిగుతుంది. చివరికి వారిద్దరు నిర్మానుష్య ప్రాంతం బాద్నగర్ లో సామాను, డబ్బు లేకుండా మిగిలిపోతారు.

గీత్, తనను పంజాబ్ లోని తన ఇంటివద్దకు చేర్చే బాధ్యత ఆదిత్యదే అని అతన్ని విసిగిస్తూ ఉంటుంది. 
విస్తారమైన ఉత్తర భారతదేశ ముఖ్య ప్రాంతంలో వారిద్దరు కలిసి ఇంటికి వెళ్ళడానికి సరదాగా బస్సులు, టాక్సీలు, ఒంటె బండ్లలో తమ ఉద్విగ్న భరిత ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. ఆదిత్య, గీత్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల అతనికి మళ్ళీ జీవితం మీద ఆసక్తి కలుగుతుంది.

ఇంటికి రావడంతోనే, గీత్ కుటుంబం(పవన్ మల్హోత్రా, దారా సింగ్ మరియు కిరణ్ జునేజా) వారిద్దరూ ప్రేమికులని అపోహ పడతారు, కాని వీరిద్దరూ వారి మధ్య అటువంటిదేమీ లేదని కుటుంబానికి విశ్వాసం కలిగిస్తారు. ఆదిత్య తను గొప్ప పారిశ్రామికవేత్తని వారికి తెలియకూడదని, తను ఒక సంగీత విద్వాంసుడినని చెప్పి వారిని నమ్మిస్తాడు. కొద్దిరోజుల తరువాత గీత్ కుటుంబం, గీత్ కు ఒక పెళ్ళిసంబంధం చూస్తారు. అతడు గీత్ ను కలవడానికి వచ్చినప్పుడు, గీత్ ఆదిత్యతో కలిసి అతనికి అనుమానం కలిగే విధంగా ప్రవర్తిస్తుంది. దాంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి, గీత్ మనాలిలో ఉన్న తన ప్రియుడు అంశుమన్ ను పెళ్ళిచేసుకోవడానికి ఆదిత్యతో కలిసి ఇంటినుండి పారిపోతుంది. అయితే, గీత్ సోదరి వారిద్దరు కలిసి పారిపోవడాన్ని గమనించి కుటుంబసభ్యులకు చెప్తుంది. వాళ్ళు కంగారుగా తప్పించుకుని పారిపోవడంతో, గీత్ కుటుంబసభ్యులకు వారిద్దరూ ప్రేమికులనే అనుమానం బలపడుతుంది. వారు మనాలి వరకు వెళ్ళినతర్వాత ఎవరిదారిన వారు విడిపోతారు.

ముంబయికి తిరిగిరావడంతోనే గీత్ సాంగత్యంలో అతనికి అలవడిన ఆశావాద దృక్పదంతో, ఆదిత్య తన పరిశ్రమను ఉన్నత స్థానానికి తీసుకువెళతాడు. తొమ్మిది నెలల తరువాత, "గీత్" పేరు మీదుగా ఒక క్రొత్త ఉత్పత్తి, ఒక కాలింగ్ కార్డు మార్కెట్ లోకి ప్రవేశపెడతాడు. గీత్ కుటుంబం ఈ ఆవిష్కరణను టి.వి.లో చూసి ఆదిత్యను కలవడానికి ముంబాయికి వెళతారు. గీత్ ఇంతవరకూ ఇంటికి వెళ్ళలేదని తెలుసుకుని ఆదిత్య ఆశ్చర్యపోతాడు. తనను తిరిగి ఇంటికి తీసుకువచ్చే బాధ్యతను ఆదిత్య తీసుకుంటాడు.

ఆదిత్య తిరిగి మనాలి చేరుకుంటాడు, గీత్ తన భర్తతో కలిసి ఉంటుందని బావించిన ఆదిత్య, అంశుమన్ తనతో పెళ్ళికి తిరస్కరించి, నడిరోడ్డు మీద వదిలేశాడని తెలుసుకుంటాడు.

అంశుమన్ చేసిన పనికి అతన్ని సిగ్గుపడేలా చేసి, గీత్ ను వెదకడానికి బయలుదేరతాడు. చివరకు హిమాలయ పట్టణం సిమ్లాలో ఆమె జాడ తెలుసుకుంటాడు. అనాధలా, ఒంటరిగా, దీన స్థితిలో ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఆమె పరిస్థితి చూసి కృంగిపోతాడు. ఆ పరిస్థితులను ఎదుర్కొనేలా ఆమెకు ధైర్యం చెప్పి తనను మాములు స్థితికి తీసుకువస్తాడు. కాని అంశుమన్ తిరిగి గీత్ దగ్గరికి వచ్చి తన తప్పు తెలుసుకున్నానని, తనను క్షమించమని, ఒప్పుకుంటే తనతో కలిసుంటానని అడుగుతాడు. గీత్ కు అతన్ని క్షమించి, అతనితో కలిసి ఉండటము ఇష్టం లేకపోయిన ఆదిత్య తనను ఒప్పిస్తాడు అయితే వాస్తవానికి ఆదిత్య అప్పటికే గీత్ ను ప్రేమిస్తుంటాడు. గీత్ ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వారు ముగ్గురు కలిసి తిరిగి భటిండా బయలుదేరుతారు. అక్కడ గీత్, అంశుమన్ ప్రేమ గురించి చెప్పాలనుకుంటారు. కాని భటిండాలో, గీత్ కుటుంబ సభ్యులు ఆదిత్య, గీత్ లు ప్రేమించుకుంటున్నారనే అనుకుంటారు. ఈ గందరగోళంలో వీరికి అసలు విషయం చెప్పడానికి అవకాశం దొరకదు. ఈ గందరగోళాన్ని తప్పించే ప్రయత్నంలో ఉండగా, గీత్ తన మనసులో ఉన్నది అంశుమన్ కాదని, ఆదిత్య అని తెలుసుకుంటుంది. చివరికి గీత్, ఆదిత్య పెళ్ళితో ఒక్కటవుతారు.

నటీ నట వర్గం[మార్చు]

దస్త్రం:Kareena & Shahid in JWM.jpg
ఈ చిత్ర నటులు : షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ (l-r)

నిర్మాణం[మార్చు]

ఈ చిత్ర తోలి నిర్మాణ కార్యక్రమాలు 2007 లో మొదలుపెట్టినప్పుడు, శ్రీ అష్ట వినాయక సినివిజన్ లిమిటెడ్ వారు నిజజీవితంలో అప్పటి ప్రేమ జంట అయిన షాహిద్ మరియు కరీనా కపూర్ లు కలిసి నటిస్తున్న ఈ మొదటి [["హాస్య ప్రేమకథా చిత్రానికి" ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు.|"హాస్య ప్రేమకథా చిత్రానికి"[[ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు.[3]]]]] అలీ ఈ చిత్రానికి నటులను ఎన్నుకుంటున్నప్పుకు కరీనా కపూర్ గీత ధిల్లాన్ పాత్రకు అతని మొదటి ఎంపిక కాగా, షాహిద్ ను మాత్రం అతన్ని కలిసిన, అతను కేవలం చిత్రాలలోని యువకుడు మాత్రమే కాదని తెలుసుకొని, తరువాత ఆదిత్య కాష్యప్ పాత్రకు ఎంపిక చేశారు. అలీ వారిద్దరి పాత్రల గురించి మాట్లాడుతూ," ఈ చిత్ర కథానాయిక రైలు తప్పిపోయినప్పుడు సహజంగా కనిపించాలి, ఆమె ఏ విధమైన అలంకారం లేకపోయినప్పుటికి, అందంగా, చురుకుగా, మాటకారిగా, చిరాకు కలిగించకుండా ఆసక్తి కరంగా ఉండాలి. నేను ప్రత్యేకంగా కరీనాకు అభిమానిని కాను, ఆమె చిత్రాలు ఎక్కువగా చూడనప్పటికి ఆమె గీత్ పాత్రకు న్యాయం చేస్తుందని నాకు తెలుసు.[...] [షాహిద్ గురించి మాట్లాడుతూ], నేను అతన్ని కలిసినప్పుడే అతను చేసిన పాత్రలలో అతన్ని మరిచిపోలేమని నాకు అర్ధమైంది. అతను జీవితంలో చాలా పక్వతను సాధించాడు అది అతని పాత్రలలో కనిపిస్తుంది. పక్వతను సాధించిన ఒక సాధారణ యువకుని పాత్రకు అతను న్యాయం చేశాడు." అని చెప్పారు[4]

ఈ చిత్రవర్గం 20 మార్చి 2007 నుండి చండీఘర్, పంజాబ్ లలో షూటింగ్ మొదలుపెట్టి, తరువాత సిమ్లా[5], మనాలి, హిమాచల్ ప్రదేశ్ [6] లలో కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించారు. హిమాలయాలు[7] మరియు రోథంగ్ పాస్ లలో ఒక పాటను చిత్రీకరించారు.[8] చిత్ర ఆఖరిభాగాన్ని ముంబాయిలో చిత్రిస్తున్నప్పుడు, కరీనా, షాహిద్ ల జంట విడిపోయినట్లుగా పుకార్లు సూచించాయి. ముందు ఇది చిత్రం పేరు కోసం చేశారని మీడియా వర్గాలు పేర్కొన్నప్పటికి, తరువాత వారు విడిపోవడం నిజమని నిర్ధారించబడింది.[9] ఈ సినిమా పేరు కోసం అందరికీ తెలిసేలా ఎన్నిక జరిగింది; చిత్ర ప్రేక్షకులకు పంజాబ్ మెయిల్ , ఇష్క్ వయా భటిండా , మరియు జబ్ వి మెట్ ల నుండి ఒకటి ఎన్నుకునే అవకాశం దొరికింది.[10][11]

చిత్ర విజయం కోసం, ఈ చిత్ర నటులు విడివిడిగా అనేక టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరీనా కపూర్ సరెగమప చాలెంజ్ 2007 అనే పాటలపోటీ కార్యక్రమానికి అతిధి న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా, షాహిద్ వరుసగా అముల్ స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా మరియు ఝలక్ దిఖలాజా [12][13] అనే కార్యక్రమాలలో కనిపించారు. తరువాత వారిద్దరు కలిసి నాచ్ బలియే అనే కార్యక్రమంలో కనిపించారు.[14] ఇవే కాకుండా, ఈ చిత్ర నిర్మాతలు [[ముంబాయిలోని పశ్చిమ మరియు మధ్య రైల్వే లోని రెండు స్థానిక రైళ్ళకు చిత్రంలోని బొమ్మలను రంగులు వేయించారు, రైలు ప్రయాణికులకు షాహిద్ తో మాట్లాడే అవకాశం కలిగించి జబ వుయ్ మెట్ విజయం కోసం కృషి చేశారు.|ముంబాయి[[లోని పశ్చిమ మరియు మధ్య రైల్వే లోని రెండు స్థానిక రైళ్ళకు చిత్రంలోని బొమ్మలను రంగులు వేయించారు, రైలు ప్రయాణికులకు షాహిద్ తో మాట్లాడే అవకాశం కలిగించి జబ వుయ్ మెట్ విజయం కోసం కృషి చేశారు.[15]]]]] 23 అక్టోబరు 2007 నాటి రాత్రి, ముంబాయిలోని యాష్ రాజ్ స్టూడియోస్ లో ఈ చిత్రం కోసం పనిచేసిన కార్యవర్గం మరియు వారి కుటుంబసభ్యుల కోసం ఈ సినిమాను ముందుగా ప్రదర్శించారు.[16]

విడుదల[మార్చు]

స్వీకారం[మార్చు]

ఈ చిత్రం 26 అక్టోబరు 2007 న భారతదేశం మొత్తం మీద 70% విడుదలయి వారాంతానికి 90% నికి పెరిగి శుభారంభాన్ని ఇచ్చింది.[17] మొదటివారం 350 ధియేటర్లలో[18] సుమారుగా 11.75 కోట్ల రూపాయలు వసూలు చేసి, రెండవవారంలో అడుగు పెడుతూనే భారీ వసూళ్ళను[19] నమోదు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలలో 40% - 50% పెరుగుదలను నమోదు చేసుకుంది.[20]

రెండవవారం 9 కోట్లరూపాయలు వసూలు చేసి, రెండు వారాలకు కలిపి 21కోట్ల రూపాయల భారీ వసూళ్ళతో,[21] ఈ చిత్రం ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.[22] మూడవవారంలో జబ్ వి మెట్ మరో 2కోట్ల రూపాయలను వసూలు[23] చేసినప్పటికి, కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. సరిగ్గా అప్పుడే విడుదలయిన ఫరాహ్ ఖాన్ యొక్క ఓమ్ శాంతి ఓమ్ మరియు సంజయ్ లీలా బన్సాలీ యొక్క సావరియా చిత్రాల వల్ల ఈ చిత్ర ప్రదర్శనల సంఖ్య తగ్గిపోయింది.[24] ప్రేక్షకులు నటనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మరియు తరువాతి చిత్రాలు బాగా ప్రదర్శించ బడకపోవడం వలన, తరువాత వారాలలో ఈ చిత్ర కాపీలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి,[25][26] ఫలితంగా ఈ చిత్రం వసూళ్ళు 50% పెరుగుదలను నమోదుచేశాయి.[27] 14 నవంబరు 2007 నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని,[28] ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదుచేసుకుంది[29] మరియు తర్వాత విడుదలయిన ఓమ్ శాంతి ఓమ్ కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వగలిగింది.[30]

ఫిబ్రవరి 2008 నాటికి జబ్ వి మెట్ సుమారుగా 30కోట్లరూపాయల వ్యాపారాన్ని చేసి,[31] ఆ సంవత్సరానికి గొప్ప విజయంగా నిలిచింది.[29][32] జనవరి 30, 2008న బాక్సాఫీస్ వద్ద 100 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఢిల్లీలోని PVR సినిమాస్ వారు, ప్రేమికుల రోజు సంధర్బంగా ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.[33]

అదే సమయంలో, జబ్ వి మెట్ ఇతర దేశాలలో ముఖ్యంగా ఇతర దేశాల కంటే ఒకరోజు ముందు అక్టోబరు 26న విడుదలయిన యు.కె.లో కూడా విజయాన్ని సాధించింది. యు.కె. లో 10వ స్థానాన్ని పొంది, ముందుగా ప్రదర్శించే రాత్రి ప్రదర్శనలలో £ 11,488లు, మొదటి వారాంతంలో £144,525లు మొత్తంగా £156,013లు కేవలం 31 ఆటలలో వసూలు చేయగలిగింది.[34] ఈ చిత్రం తన విజయయాత్రను రెండవవారం కూడా కొనసాగిస్తూ, భారీ వ్యాపారాన్ని నమోదు చేసి, రెండువారాలకు కలిపి £325,996 [సుమారుగా 2.67 కోట్లు)లు వసూలు చేసింది]; సూపర్ హిట్ గా నిలిచింది.[35] 5వారాల తరువాత జబ్ వి మెట్ 54ధియేటర్ల[36][37] నుండి £43,529లు వసూలుచేసి, మొత్తంగా £424,681 [సుమారుగా రు. 3.30 కోట్లు)లు భారీవసూళ్ళు చేసింది.

సమీక్షలు[మార్చు]

ఈ చిత్రం విడుదలతోనే అందరి మన్ననలను పొందింది. విమర్శకులు కూడా ఈ చిత్ర నిరాడంబరతను, కథను మెచ్చుకుని, "ఈ చిత్రం 2007వ సంవత్సరపు బాలీవుడ్ యొక్క ఉత్తమ ప్రేమ కథా చిత్రాలలో ఒకటి"గా అభివర్ణించారు.[38][39] ఈ చిత్ర దర్శకత్వం మరియు నటనను ప్రత్యేకంగా అభినందించారు. ఇండియాFM నుండి తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి 5కు 3.5 రేటింగ్ ఇచ్చి "ఈ చిత్రాన్ని వెచ్చని ఎండలో ఉల్లాసాన్నిచ్చే చల్లని పుచ్చకాయ రసం" అని వర్ణించారు.[38] 2 సుభాష్ కె. ఝా గారు, "జబ్ వి మెట్ చిత్రాన్ని చూసేటప్పుడు కలిగే ఆ ప్రత్యేక అనుభవం ఈ వయస్సులో రావడం చాలా కష్టమని అభివర్ణించారు."[40] CNN-IBN నుండి రాజీవ్ మసంద్ గారు, ఈ చిత్రానికి 5కు గాను 3 నక్షత్రాలను ఇచ్చి, మన మొహంపై నవ్వు చిందించే చిన్ని చిన్ని అనుభవాలు కలిసిన చిత్రంగా దీన్ని అభివర్ణించారు.[41]

చాలామంది విమర్శకులు ఈ చిత్ర విజయానికి ప్రేమజంట షాహిద్ మరియు కరీనాల మధ్య ప్రత్యేక బంధమే కారణమని ఒప్పుకున్నారు. రాజీవ్ మసంద్ గారు ఇంకా మాట్లాడుతూ, "ఈ చిత్రం యొక్క మాయాజాలం అంతా ఈ చిత్ర కథానాయకుల జంట మొదట తెరపై కనిపించినప్పటినుండి మన ఏకాగ్రతను పట్టుకోవడంలో ఉందని చెప్పారు".[41] తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ, "షాహిద్ ఇంతవరకూ రాని గొప్ప పాత్రను జబ్ వుయ్ మెట్ లో పోషించారని, కరీనా కూడా గొప్పగా నటించిందని తెలిపారు. జబ్ వి మెట్ ఆమె జీవితంలో మలుపని[వ్యక్తిగతంగానే కాక వృత్తిపరంగాకూడా] అభిప్రాయపడ్డారు.

ఆమె నటనను వర్ణించడానికి సరైన పదం -అద్భుతం. ఆమె ఆత్మవిశ్వాసంతో తన పాత్రను గొప్పగా తీర్చిదిద్దుకుంది. కుచ్ కుచ్ హోతా హై (1998) చిత్రం కాజోల్ కు చేసిన సాయం ఈ సినిమా కరీనాకు చేసింది.[38] సుభాష్ కె ఝా గారు వారిద్దరి బంధం గురించి మాట్లాడుతూ, " అక్కడ ఎంతో ప్రకాశవంతంగా ఉంది. కరీనా మరియు షాహిద్ ల మధ్య సన్నివేశాలను మనం నటనగా అనుకోలేమని, వారి నటనతో నిజమనిపించే భ్రమలోకి తీసుకు వెళతారని " వర్ణించారు.[40]

ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 5కు గాను, 4 నక్షత్రాలను ఇచ్చి ఈ చిత్రం అద్భుతమైన నటనను కనబరచిన షాహిద్ మరియు కరీనాలకు చెందుతుందని, యువకుడు, యువతిని కలిసే కథకు ఒక క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చారని అభిప్రాయపడ్డారు.[42] ఇండియాగ్లిట్జ్.కామ్ నుండి జోగిందర్ తుతేజ 5 గాను 3.5 నక్షత్రాలను ఇచ్చి ఈ చిత్రాన్ని "షాహిద్-కరీనా" ల DDLJ గా అభివర్ణించి, ఈ చిత్రం గురించి మాట్లాడుతూ " ఏ ఇద్దరు నటులైనా వారి నటనకు సరైన ప్రతిఫలము, ప్రాధాన్యత లభించకపోతే బాధగా ఉంటుంది" అని అభిప్రాయపడ్డారు.[43]

ఈ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీకి కూడా అందరి మన్ననలు లభించాయి. ఇండియాటైమ్స్ ఆయన గురించి, 2004 లో విడుదలైన "సోచా నా థా " లాంటి గొప్ప సినిమా తరువాత ఇంతియాజ్ అలీ, మంచి ఫలితాలను చాలా సులభంగా పొందుతున్నారు"[44] అని వ్రాసారు. బాలీవిస్తా.కామ్ వారు ఈ చిత్ర ఇతివృత్తంతో భారతదేశంలో గాని, ప్రపంచవ్యాప్తంగా గాని చాలా తక్కువ సినిమాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఇంతియాజ్ అలీ గారి కథ మరియు దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేకతలని వ్రాసారు.[45]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

జబ్ వి మెట్ చిత్రం సాధించిన పురష్కారాలు మరియు ప్రతిపాదనల పట్టిక కొంతవరకు క్రింద ఇవ్వబడినది.

సంవత్సరం ఇచ్చినవారు పురష్కారాలు ఫలితం
2007). హెచ్ టి కేఫ్ పిల్మ్ అవార్డ్స్[46] ఉత్తమ నటి గెలిచినవి
2009 స్టార్ స్క్రీన్ అవార్డ్స్[47] ఉత్తమ నటి గెలిచినవి
అదనంగా ఆరు ప్రతిపాదనలు[48]
స్టార్ డస్ట్ అవార్డ్స్[49] ఉత్తమ చిత్రం (శ్రీ అష్ట వినాయక సినివిజన్ లిమిటెడ్) గెలిచినవి
ఈ ఏటి ఉత్తమతార-స్త్రీలకు గెలిచినవి
ఎడిటర్ ఎన్నిక ద్వారా ఉత్తమ నటుడు గెలిచినవి
అదనంగా మూడు ప్రతిపాదనలు' [50]
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్[51] ఉత్తమ నటి గెలిచినవి
ఉత్తమ సంభాషణ(ఇంతియాజ్ అలీ) గెలిచినవి
అదనంగా అయిదు ప్రతిపాదనలు' [52]
యాన్యుయల్ సెంట్రల్ యూరోపియన్
బాలీవుడ్ అవార్డ్స్[53]
ఉత్తమ జంట గెలిచినవి
అప్సర ఫిల్మ్ & టెలివిజన్
ప్రొడ్యూసర్స్ గైడ్ అవార్డ్స్(Producers Guild Awards)[54]
ఉత్తమ నటి గెలిచినవి
ఉత్తమ సంభాషణ (ఇంతియాజ్ అలీ) గెలిచినవి
ఉత్తమ సంగీతం (ప్రీతమ్) గెలిచినవి
అదనంగా ఆరు ప్రతిపాదనలు' [55]
జీ సినీ అవార్డ్స్(Zee Cine Awards)[56] ఉత్తమ నటి గెలిచినవి
ఈ ఏటి ఉత్తమ పాట(మౌజ హి మౌజ ) గెలిచినవి
ఉత్తమ స్క్రీన్ ప్లే(Best Screenplay) గెలిచినవి
అదనంగా అయిదు ప్రతిపాదనలు' [57]
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్
అకాడమీ అవార్డ్స్[58]
ఉత్తమ నటి గెలిచినవి
ఉత్తమ సంభాషణ(ఇంతియాజ్ అలీ) గెలిచినవి
అదనంగా అయిదు ప్రతిపాదనలు' [59]

డివిడి మరియు సౌండ్ ట్రాక్[మార్చు]

Jab We Met
దస్త్రం:JWM CD Cover.jpg
Soundtrack album by Pritam
Released
21 September 2007 (India)
Genre Feature film soundtrack
Length 45:01
Label
T-Series
Producer Dhillin Mehta
Pritam chronology
Bhool Bhulaiyaa
(2007)
Jab We Met
(2007)
Dus Kahaniyaan
(2007)

డివిడి[మార్చు]

7 డిసెంబరు2007 న ఈ చిత్రం డివిడి రూపంలో అధికారికంగా యు.ఎస్, యు.కె, యు.ఎ.ఇ. లలోను, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి విడుదల చేయబడింది. ఇంగ్లీషు, పోర్చుగీసు, అరబిక్ & స్పానిష్ పేర్లు కలిగిన ఈ డివిడి, ఒక పెట్టెలో అమర్చబడి ఇవ్వబడింది.[60]

భారతదేశంలో, జబ్ వి మెట్ డివిడి జనవరి 29న 50 రూపాయల కంటే తక్కువ ఖర్చులో రెండు డివిడిలు కలిగిన ఒకే ప్యాక్ గా విడుదలయింది. ఈ చిత్ర నిడివి 138 నిముషాలు కావడంతో, ప్యాక్ లోని అదనంగా ఉన్న డివిడిలో 20 నిముషాల పాటు చిత్రనిర్మాణంలో జరిగిన కొన్ని సన్నివేశాలను ఉంచారు. ఇండియా ఎఫ్.ఎమ్ ఈ డివిడికి 5 కు గాను 4 నక్షత్రాలను ఇచ్చి, "జబ్ వి మెట్ ఖచ్చితంగా కొనాల్సినది. ఈ విషయంలో రెండవ ఆలోచన లేదు" అని అభిప్రాయపడింది. జబ్ వి మెట్ విడుదలయిన తర్వాత వచ్చిన హాస్య సినిమాలలో ఓమ్ శాంతి ఓమ్, వెల్ కమ్ మరియు తారే జమీన్ పర్ మాత్రమే కొంత విజయాన్ని సాధించగలిగాయి. దీన్నిబట్టి ఇంతియాజ్ అలీగారి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో చెప్పనక్కరలేదు.[61]

సౌండ్‌ట్రాక్[మార్చు]

ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రీతమ్ చేత కంపోజ్ చేయబడిన పాటలకు ఇర్షాద్ కామిల్ రచయితగా వ్యవహరించాడు. ఈ చిత్ర ఆడియో, 21సెప్టెంబరు 2007న సరెగమప చాలెంజ్ 2007 సంగీత కార్యక్రమంలో అగ్రనటి కరీనాకపూర్ చే విడుదలచేయబడింది.[12] ఇండియా ఎఫ్.ఎమ్ నుంచి జోగిందర్ తుతేజా ఈ చిత్ర ఆడియోకు 5 కు గాను 3.5 నక్షత్రాలు ఇచ్చి, ఆడియో గురించి మాట్లాడుతూ," 2007లో ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించిన భూల్ భులైయా , ఆవారాపన్ , హాట్రిక్ , క్యా లవ్ స్టోరీ హై మరియు జస్ట్ మారీడ్ సినిమాలకు మంచి సంగీతాన్ని అందించి వెలుగులోనికి వచ్చారు. కాని లైఫ్...ఇన్ ఎ మెట్రో లాంటి ప్రేక్షకాదరణ పొందిన ఆల్బమ్ తర్వాత అంతటి సంతృప్తి ఇచ్చే అనుభవం జబ్ వి మెట్. ఈ ఆల్బమ్ ను అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే గొప్ప ఆడియోకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు".[62]

ఈ చిత్ర ఆడియో మొదట 8వ స్థానంలో ఉన్నప్పుటికీ, రెండవ వారానికి 5వ స్థానానికి ఎగబాకింది.[63] తరువాత కొన్నివారాలకే ఈ ఆల్బమ్ నిదానంగా మ్యూజిక్ చార్ట్స్ లో పైకి ఎగబాకి[64], ఈ సినిమా విడుదల తర్వాత ఆల్బమ్ అమ్మకాలలో పెరుగుదల కనిపించింది.[65][66] నవంబరు 19న ఆ వారంలో ఈ ఆల్బమ్ ఓమ్ శాంతి ఓమ్ ఆడియోయొక్క స్థానాన్ని ఆక్రమించి మొదటి స్థానాన్ని పొంది[67], ఆ తర్వాత వారంలో రెండవస్థానానికి తగ్గింది.[68] కొత్తగా విడుదలయిన ఆడియోలతో గట్టి పోటీ ఎదురైనప్పటికి ఈ ఆల్బమ్ 9 వారాల పాటు మొదటిస్థానాన్ని నిలబెట్టుకుని,[69][70] 2007లో విజయవంతమైన ఆల్బమ్ లలో ఒకటిగా నిలిచింది.[71]

జబ్ వి మెట్ పాటలు రెడిఫ్స్ మరియు ఇండియా ఎఫ్.ఎమ్స్ 2007సంవత్సరాంతపు పట్టికలో మొదటి పది స్థానాల్లో నిలిచిన ఆల్బమ్సులో ఒకటిగా నిలిచాయి.[72][73]

పాట పాడింది/పాడినవారు సమయం గమనికలు
మౌజ హి మౌజ మికా సింగ్ 4:04 షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ ల మధ్య చిత్రీకరించబడింది.
తుమ్ సే హి మోహిత్ చౌహాన్ 5:23 షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ ల మధ్య చిత్రీకరించబడింది.
యే ఇష్క్ హై శ్రెయా ఘోషాల్ 4:44 షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ ల మధ్య చిత్రీకరించబడింది. ఈ పాటకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వారి ఉత్తమ నేపధ్య గాయని పురష్కారం 2008కి గాను శ్రెయా ఘోషాల్కు లభించింది.
నగాదా నగాదా సోనూ నిగమ్ & జావెద్ అలీ 3:51 షాహిద్ కపూర్,కరీనా కపూర్ మరియు సౌమ్యా టాండన్ ల మధ్య చిత్రీకరించబడింది.
ఆవో మిలో చలో షాన్ & ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ 5:28 షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ ల మధ్య చిత్రీకరించబడింది.
ఆవోగే జబ్ తుమ్ ఉస్తాద్ రషిద్ ఖాన్ 4:25 షాహిద్ కపూర్, కరీనా కపూర్ మరియు తరుణ్ అరోరాల మధ్య చిత్రీకరించబడిన ఈ పాటను అతిథి కంపోజర్ సందేశ్ శాండిల్యా కంపోజ్ చేసారు.
తుమ్ సే హి(Remix) మోహిత్ చౌహాన్ 4:21
యే ఇష్క్ హై (Remix) అంతరా మిత్రా 4:31
మౌజ హి మౌజ (Remix) మికా సింగ్ 4:07 షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ ల మధ్య చిత్రీకరించబడింది.
తుమ్ సే హి (ఇన్స్ట్ట్రుమెన్టెల్) ఇన్స్ట్ట్రుమెన్టెల్ 4:53

సూచనలు[మార్చు]

  1. Verma, Meenakshi (2008-01-14). "IFC to invest Rs 150 cr for movie distribution right". Economic Times. Retrieved 2008-08-30. 
  2. Adarsh, Taran. "Now 'Jab We Met' in South languages". Indiafm.com. Retrieved 2008-01-08. 
  3. Kumar, Nikhil. "Full-fledged onscreen romance for Kareena and Shahid". ApunKaChoice.com. Retrieved 2008-04-21. 
  4. Khanna, Parul. "Shahid-Kareena split scared me: Imtiaz Ali". Hindustan Times. Retrieved 2008-04-21. 
  5. Indo-Asian News Service (IANS). "Kareena and Shahid start shooting in Shimla". NowRunning.com. Retrieved 2007-05-21. 
  6. IndiaGlitz. "Shree Ashtavinayak Cinevision signs Shahid-Kareena Kapoor Starrer!". Indiaglitz.com. Retrieved 2007-02-22. 
  7. IndiaFM News Bureau. "Saroj Khan trains Kareena in Himalayas". Indiafm.com. Retrieved 2008-04-21. 
  8. Dalal, Sandipan. "Shahid and Kareena breathless". The Times of India. Retrieved 2007-07-22. 
  9. Adarsh, Taran. "Will they work together?". Indiafm.com. Retrieved 2008-04-21. 
  10. Times News Network (TNN). "Kareena-Shahid starrer has a title". The Times of India. Retrieved 2007-08-20. 
  11. Businessofcinema.com Team. "Ali throws open title of Shahid-Kareena film". Businessofcinema.com. Retrieved 2007-08-13. 
  12. 12.0 12.1 Barnali. "'Disco Fever' on Friday; High Voltage Fun with Kareena Kapoor,Saturday". India-forums.com. Retrieved 2007-09-21. 
  13. Businessofcinema.com Team. "Shahid Kapur on Star Voice of India". Indiafm.com. Retrieved 2008-04-21. 
  14. "Shahid and Kareena get together again". IBNLive. Retrieved 2008-04-21. 
  15. IndiaFM News Bureau. "Shahid Kapoor travels by Mumbai's Local Train". Indiafm.com. Retrieved 2008-04-21. 
  16. Bollywood Trade News Network. "Bollywood bigwigs appreciate JAB WE MET". Glamsham.com. Retrieved 2007-10-25. 
  17. Tuteja, Joginder (Bollywood Trade News Network). "JAB WE made a box office success". Glamsham.com. Retrieved 2007-10-27. 
  18. Tuteja, Joginder (IndiaGlitz). "Box office analysis". Indiaglitz.com. Retrieved 2007-11-08. 
  19. Tuteja, Joginder (Bollywood Trade News Network). "JAB WE MET enters strongly into second week". Glamsham.com. Retrieved 2007-11-01. 
  20. Tuteja, Joginder. ""Worldwide JWM shows have increased by 50%" - Imtiaz Ali". Indiafm.com. Retrieved 2007-11-05. 
  21. Tuteja, Joginder (IndiaGlitz). "Box office analysis". Indiaglitz.com. Retrieved 2007-11-16. 
  22. IndiaGlitz. "JWM joins DDLJ and HAHK league". Indiaglitz.com. Retrieved 2007-11-07. 
  23. Abid (Bollywood Trade News Network). "Bollywood box-office report of the week". Glamsham.com. Retrieved 2007-11-23. 
  24. IndiaGlitz. "JAB WE MET to benefit?". Indiaglitz.com. Retrieved 2007-11-10. 
  25. Tuteja, Joginder. ""I was willing to chop off Manoj Kumar scene" - Farah Khan". Indiafm.com. Retrieved 2007-11-17. 
  26. P. Paal, Jaahnavi. "Jab We Met back with a vengeance". Indiantelevision.com. Retrieved 2007-11-13. 
  27. Tuteja, Joginder (Bollywood Trade News Network). "JAB WE MET back in circulation in a big way". Glamsham.com. Retrieved 2007-11-24. 
  28. IndiaFM News Bureau. "Jab We Met completes 50 days". Indiafm.com. Retrieved 2007-12-14. 
  29. 29.0 29.1 "Box Office 2007". BoxOfficeIndia.com. Archived from the original on 2012-07-30. Retrieved 2008-01-09. 
  30. Tuteja, Joginder (Bollywood Trade News Network). "JWM at more number of shows than OSO". Glamsham.com. Retrieved 2007-12-15. 
  31. Suri, Deepak. "Jab We Met Celebrates 100 Days". BoxOfficeIndia.com. Archived from the original on 2012-07-20. Retrieved 2008-02-01. 
  32. N, Patcy. "The top grossers of 2007". Rediff.com. Retrieved 2007-12-24. 
  33. Tuteja, Joginder (Bollywood Trade News Network). "JAB WE MET - Now a Valentine special". Glamsham.com. Retrieved 2008-01-30. 
  34. Adarsh, Taran. "Overseas: Shahid's biggest opener in U.K.". Indiafm.com. Retrieved 2007-10-31. 
  35. Adarsh, Taran. "Overseas: 'J.W.M.' is super-strong!". Indiafm.com. Retrieved 2007-11-07. 
  36. Adarsh, Taran. "Overseas: 'O.S.O. has a record start in U.K., U.S.A.". Indiafm.com. Retrieved 2007-11-14. 
  37. Adarsh, Taran. "Overseas: Business hits rock-bottom!". Indiafm.com. Retrieved 2007-12-19. 
  38. 38.0 38.1 38.2 Adarsh, Taran. "Movie Review: Jab We Met". Indiafm.com. Retrieved 2007-10-26. 
  39. D'Souza, Martin. "Jab We Met: Movie Review". Glamsham.com. Retrieved 2007-10-27. 
  40. 40.0 40.1 K. Jha, Subhash. "Subhash K. Jha speaks about Jab We Met". Indiafm.com. Retrieved 2007-10-27. 
  41. 41.0 41.1 Masand, Rajeev. "Jab We Met an engaging watch". CNN-IBN. Retrieved 2007-10-26. 
  42. Kazmi, Nikhat. "Jab We Met". The Times of India. Retrieved 2007-10-27. 
  43. Tuteja, Joginder (IndiaGlitz). "Jab We Met - Shahid-Kareena's DDLJ". Indiaglitz.com. Retrieved 2007-10-27. 
  44. Lance Fernandes, Praveen. "Jab We Met". Indiatimes. Retrieved 2007-10-26. 
  45. Bollyvista.com. "Jab We Met Movie Review". Bollyvista.com. Retrieved 2007-10-26. 
  46. Kotwani, Hiren. "Starry debut for HT Café Film Awards". Hindustan Times. Retrieved 2007-12-30. 
  47. Bollywood Hungama News Network. "Winners of 14th Annual Star Screen Awards". Indiafm.com. Retrieved 2008-01-11. 
  48. IndiaFM News Bureau. "Nominees for 14th Annual Screen Awards". Indiafm.com. Retrieved 2008-01-02. 
  49. Bollywood Hungama News Network. "Winners of Max Stardust Awards 2008". Indiafm.com. Retrieved 2008-01-26. 
  50. Bollywood Hungama News Network. "Nominations for Max Stardust Awards 2008". Indiafm.com. Retrieved 2007-12-25. 
  51. Bollywood Hungama News Network. "Winners of 53rd Annual Filmfare Awards". Indiafm.com. Retrieved 2008-02-23. 
  52. Bollywood Hungama News Network. "Nominees - 53rd Annual Filmfare Awards". Indiafm.com. Retrieved 2008-02-06. 
  53. IANS. "OSO sweeps Central European Awards". Sify. Retrieved 2008-03-11. 
  54. PTI. "'Chak De..' has a field day at Producers Guild Awards". The Hindu. Retrieved 2008-03-31. 
  55. Bollywood Hungama News Network. "Nominations for 3rd Apsara Film & Television Producers Guild Awards". Indiafm.com. Retrieved 2008-03-14. 
  56. Bollywood Hungama News Network. "Winners of the Zee Cine Awards 2008". Indiafm.com. Retrieved 2008-04-27. 
  57. Nijjar, Lucky. "ZEE Cine Awards nominations list announced". Biz Asia. Retrieved 2008-03-29. 
  58. "IIFA 2008: And the award goes to...". IBNLive. Retrieved 2008-07-01. 
  59. Bollywood Hungama News Network. "Nominations for the IIFA Awards 2008". Indiafm.com. Retrieved 2008-04-18. 
  60. IndiaGlitz. "JAB WE MET out on DVDs internationally". Indiaglitz.com. Retrieved 2007-12-07. 
  61. Tuteja, Joginder. "DVD Review: Jab We Met". Indiafm.com. Retrieved 2008-01-29. 
  62. Tuteja, Joginder. "Music Review: Jab We Met". Indiafm.com. Retrieved 2007-09-24. 
  63. IndiaFM News Bureau. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-10-08. 
  64. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-10-22. 
  65. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-10-29. 
  66. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-11-05. 
  67. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-11-20. 
  68. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-11-26. 
  69. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2007-12-03. 
  70. Tuteja, Joginder. "Top Ten albums of the week". Indiafm.com. Retrieved 2008-02-04. 
  71. "Music Hits 2000-2009 (Figures in Units)". BoxOfficeIndia.com. Archived from the original on 2012-05-27. Retrieved 2008-01-09. 
  72. Verma, Sukanya. "The Best Music of 2007". Rediff.com. Retrieved 2007-12-18. 
  73. Tuteja, Joginder. "Top-10 soundtracks of 2007". Indiafm.com. Retrieved 2007-12-31. 

వెలుపటి వలయము[మార్చు]

మూస:Imtiaz Ali films మూస:Bollywood