జమీందార్

వికీపీడియా నుండి
(జమీందారు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జమీందార్
(1966 తెలుగు సినిమా)
TeluguFilm Jamindar.jpg
దర్శకత్వం వి. మధుసూదనరావు
నిర్మాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
రేలంగి
సంగీతం టి. చలపతి రావు
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

జమీందార్ వి.మధుసూదనరావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, నాగభూషణం, లింగమూర్తి ముఖ్యపాత్రల్లో నటించిన 1965 నాటి తెలుగు చలనచిత్రం. తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఈ సినిమాని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన జమీందార్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమా జనవరి 7, 1966న విడుదలయింది.[1]

చిత్రకథ[మార్చు]

శేషు అనబడే శేషగిరిరావు (అక్కినేని నాగేశ్వరరావు), సరోజ (కృష్ణకుమారి) ఒక పిక్నిక్ లో కలుసుకుంటారు, వారి పరిచయం ప్రేమగా మారుతుంది. శేషు అన్నావదినెలు సుబ్బారావు (గుమ్మడి), లక్ష్మి (పి.హేమలత)లకు శేషును అదుపుచెయ్యడం ఓ పెద్ద పని. వారికి శేషును అదుపుచేస్తూ సరదాగా కాలంగడపడంలోనే సంతోషం. నరహరి (ముదిగొండ లింగమూర్తి), రాజారెడ్డి (నాగభూషణం) యుద్ధంలో పనిచేసే రోజుల్లో ప్రభుత్వసొమ్ము రూ.20లక్షలు ఒక స్థావరం నుంచి మరోదానికి తరలిస్తున్నప్పుడు, అదనుచూసి దొంగిలిస్తారు. ప్రభుత్వోద్యోగం నుంచి ఇద్దరిలో ముందు రిటైరైన నరహరి కాంట్రాక్టరు అవతారమెత్తుతాడు. భార్య (సూర్యకాంతం), కూతురు సరోజలతో సంపదను అనుభవిస్తూ సుఖంగా జీవిస్తూంటాడు. ఈలోగా రాజారెడ్డి కూడా ఉద్యోగం నుంచి రిటైరై తానూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేపడదామని డబ్బు ఎక్కడ దాచావంటూ నరహరిని అడుగుతాడు. తనకేమీ తెలియదని నరహరి తెగేసి చెప్తాడు, అయినా దాని సంగతి తేల్చాకే కదులుతానంటూ రాజారెడ్డి ఇంట్లో నరమరి దిగబడతాడు. ఇంతలో ప్రేమించుకున్న శేషు-సరోజల పెళ్ళికి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ సమయంలో అప్పటికే శేషుకు వేరే అమ్మాయితో సంబంధం ఉన్నట్టు, ఆమెకు కడుపుచేసి వదిలేసినట్టు ఓ అన్నచెల్లెళ్ళను పురమాయించి అల్లరిచేయిస్తాడు రాజారెడ్డి. ఇదంతా నిజంకాదని శేషు చెప్పినా వినకుండా అవన్నీ నమ్మి సరోజతో సహా అందరూ అతన్ని అసహ్యించుకుని గెంటేస్తారు.

అదేరోజు రాత్రి రాజారెడ్డి నరహరిని కత్తితో హతమార్చి ఆ నిందను శేషు మీద తోసెయ్యబోతే, అతన్ని కాపాడేందుకు అతని అన్న సుబ్బారావు కేసు తననెత్తిన వేసుకుంటాడు. ఆపైన నేరాన్ని కనుక్కునే క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది సినిమా. సినిమా మలుపులు తిరిగి క్లైమాక్సుకల్లా శేషగిరిరావు ప్రభుత్వం నియమించిన సీఐడీ అనీ, పోయిన ఇరవైలక్షల రూపాయలు వెతికేందుకు నియమించిందని తెలుస్తుంది. చివరకి అసలు నేరస్థులు శిక్షింపబడి ఇరవైలక్షల రూపాయలూ ప్రభుత్వానికి స్వాధీనం కావడమూ, హీరోహీరోయిన్ల మధ్య కలతలు తొలిగిపోయి కలిసిపోవడంతో కథ ముగుస్తుంది.

నటీనటులు[మార్చు]

స్పందన[మార్చు]

ఈ చిత్రం మాస్ ని కూడా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.[2]

పాటలు[మార్చు]

  1. అమ్మాయిగారు చాల చాల కోపంగా - టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం
  2. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే - ఘంటసాల,సుశీల
  3. కస్తూరి రంగ రంగా - చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల
  4. చుక్కలు పొడిచేవేళ అహ మక్కువ తీరేవేళ ఆడపిల్లే పొడుపుకథ పొడవాలి - రచన: ఆరుద్ర[3] ; గానం: పి.సుశీల, ఘంటసాల
  5. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల
  6. నేనే నేనే లేత లేత పూలబాలను తేనెటీగ సోకినా తాళజాలను - రచన: ఆరుద్ర; గానం: ఎస్. జానకి
  7. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంచేస్తావు - ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ (1967-68). మద్రాసు: గోటేటి బుక్స్. 2017-06-16. p. 18.{{cite book}}: CS1 maint: date and year (link)
  2. బి.వి.ఎస్.రామారావు (2014-10-01). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  3. జమీందార్, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 6-7.

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జమీందార్&oldid=3875540" నుండి వెలికితీశారు