జమీలా నిషాత్
జమీలా నిషాత్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1955 హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం. |
వృత్తి | కవి, సంపాదకురాలు, విద్యావేత్త, స్త్రీవాది |
జాతీయత | భారతీయురాలు |
విద్య | మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ |
రచనా రంగం | గజల్, నాజ్మ్ |
విషయం | సాహిత్యం |
జమీలా నిషాత్ (జననం 1955) భారతీయ ప్రముఖ మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి. తెలంగాణలోని హైదరాబాదుకు చెందిన ఆమె ఉర్దూ కవయిత్రి, సంపాదకురాలు కూడా. ఆమె స్త్రీవాది.[1]
వృత్తాంతం
[మార్చు]జమీలా నిషాత్ హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ పోర్ట్రెయిట్ ఆర్టిస్ట్. అతను కళాకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్‌కు సన్నిహిత మిత్రుడు.[2]
జమీలా నిషాత్ పెళ్లి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ ఇంగ్లిష్‌తోపాటు థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లమో చేసింది. ఆమె ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం ప్రచురించే కితాబ్ నుమా పత్రిక, మరి కొన్న పత్రికలలో కవితలు రాసింది. ఆమె మొదటి పుస్తకం 2000 సంవత్సరంలో లావా, కవితల సంకలనంగా ప్రచురించబడింది.
ఆమె కవితలలో కొన్నింటిని లావా నుండి హోషాంగ్ మర్చంట్ అనువదించాడు. ఈ అనువాద కవితలను సాహిత్య అకాడమీ 2008లో ప్రచురించింది.[3] ఆమె మూడు ఇప్పటి వరకు మూడు సంకలనాలను ప్రచురించింది.[4][5]
1999లో ఆమె జీవితచరిత్రపై స్పారో (SPARROW) ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది.[6] హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (HLF) లో ఆమె వక్తగా వ్యవహరించింది. ఇటలీలోని సాలెర్నోలో 2015 జూన్ 3 నుండి 8 వరకు జరిగిన మార్పు కోసం 100 వేల కవుల సదస్సులో ఆమె స్త్రీవాద కవులలో ఒకరు.
2012లో ఆమె ముస్లిం మహిళలకు సేవ చేసేందుకు "షాహీన్ కలెక్టివ్ - షాహీన్స్ ఉమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్" ("Shaheen Collective - Shaheen's Women Resource and Welfare Association") ని స్థాపించింది.[7] ఈ సంస్థ మహిళల సంక్షేమం, గృహ, సామాజిక హింస నిర్మూలన కోసం పనిచేస్తుంది.[8][9]
రచనలు
[మార్చు]- బటర్‌ఫ్లై కేరెస్సెస్ (ప్యాట్రిడ్జ్ ఇండియా, 2015 ద్వారా ప్రచురించబడింది), రేడియో ఇంటర్వ్యూ
- లామ్స్ కి సావ్ఘాట్ (ఎడ్యుకేషనల్ పబ్లిషింగ్ హౌస్, న్యూఢిల్లీ,2006)
- లమ్హేకి అంఖ్ (అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, సికింద్రాబాద్, 2002 ద్వారా ప్రచురించబడింది)
- లావా (2000)
- ఇంకేషాఫ్ సంకలనం, దక్కన్ ఉమెన్ రైటర్స్ సంకలనం, అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, సికింద్రాబాద్ (2000)
అవార్డులు
[మార్చు]మగ్దూం మొహియుద్దీన్ అవార్డు (1972)
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (2015) ద్వారా దేవి అవార్డు[10]
మూలాలు
[మార్చు]- ↑ "Activist Jameela Nishat Speech Over Women Safety - Sakshi". web.archive.org. 2023-02-22. Archived from the original on 2023-02-22. Retrieved 2023-02-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ The Sunday Tribune. "Pioneer of Change". The Tribune - Tribune India.
- ↑ The Hindu. "A universe of verse". The Hindu Newspaper.
- ↑ Arlene R. K. Zide (1993). In Their Own Voice: Penguin Anthology of Contemporary Indian Women Poets - Arlene R. K. Zide, Pages, 166-167. Penguin books India (p) ltd.
- ↑ Ammu Joseph. Storylines: Conversations with Women Writers, Pages, 233-237. Women's World India and Asmita Resource Centre for Women, 2003.
- ↑ Sparrow. "Jameela Nishat A Poem Slumbers In My Heart". Sparrow, January, 1999. Archived from the original on 3 July 2017. Retrieved 19 January 2015.
- ↑ "Shaheen Womens Resource and Welfare Association in Old Basti - Sakshi". web.archive.org. 2023-02-22. Archived from the original on 2023-02-22. Retrieved 2023-02-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ NewsWala. "Members of NGOs Wep-Ushassu and Shaheen Resource Centre for Women take out rally on International Day of the Girl". Newswala, 11 October 2012. Archived from the original on 2 April 2015. Retrieved 28 March 2015.
- ↑ Vanitha TV. "Ms.Jameela Nishat - Shaheen Women's Resource and Welfare Association". Vanitha TV.
- ↑ The Hindu. "Devi Award". The New Indian Express.