Jump to content

జమ్నాలాల్ బజాజ్ అవార్డు

వికీపీడియా నుండి
జమ్నాలాల్ బజాజ్ అవార్డు
2018లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ద్వారా అవార్డును స్వీకరిస్తున్న డా.క్లేబోర్న్ కార్సన్
Date1978
దేశంభారతదేశం
అందజేసినవారుజమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్

జమ్నాలాల్ బజాజ్ అవార్డు గాంధేయ విలువలు, సమాజ సేవ, సామాజిక అభివృద్ధి రంగాలలో ప్రోత్సహించేందుకు ప్రదానం చేసే ఒక భారతీయ పురస్కారం. 1978లో బజాజ్ గ్రూప్‌కు చెందిన జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ అవార్డు ఏటా నాలుగు విభాగాలలో ఇస్తారు. సాధారణంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి లేదా ఒక ప్రముఖ వ్యక్తి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.[1] ప్రస్తుతం రాహుల్ బజాజ్ నేతృత్వంలో ఉన్న ఫౌండేషన్, 1977లో బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, దాత, మహాత్మా గాంధీ సన్నిహితుడు జమ్నాలాల్ బజాజ్ జ్ఞాపకార్థం సృష్టించబడింది. ఈ అవార్డు ప్రదానోత్సవం ఆయన జన్మదినోత్సవం, నవంబర్ 4న జరుగుతుంది.

పురస్కారాలు

[మార్చు]

ఈ అవార్డుక్రింద ఒక ప్రశంసా పత్రం, ఒక ట్రోఫీ, ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చెక్కు ఇస్తారు. దీనిని నాలుగు విభాగాలలో ఇస్తారు. అవి:

  1. నిర్మాణాత్మక కృషి, 1978లో స్థాపించబడింది.
  2. గ్రామీణాభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ అనువర్తనం, 1978లో స్థాపించబడింది.
  3. మహిళా శిశు అభివృద్ధి, సంక్షేమాలకు అత్యుత్తమ సహకారం, జానకీ దేవి బజాజ్ జ్ఞాపకార్థం 1980లో స్థాపించబడింది.
  4. భారతదేశం వెలుపల గాంధీ విలువలను ప్రోత్సహించినందుకు అంతర్జాతీయ అవార్డు, ఇది 1988లో జమ్నాలాల్ బజాజ్ జన్మ శతాబ్ది సందర్భంగా స్థాపించబడింది.

జమ్నాలాల్ బజాజ్ శతజయంతి జ్ఞాపకార్థం, ఫౌండేషన్ 1990లో నెల్సన్ మండేలాకు ఒక ప్రత్యేక అవార్డును ప్రదానం చేసింది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం నిర్మాణాత్మక కృషి సైన్స్ & టెక్నాలజీ స్త్రీ & శిశు సంక్షేమం అంతర్జాతీయం
1978 జగత్‌రామ్ దావే సతీష్ చంద్ర దాస్ గుప్త
1979 సరళాదేవి & మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) జయంత్ శ్యామ్‌రావ్ పాటిల్
1980 గాంధీ నికేతన్ ఆశ్రమం అనిల్ సద్గోపాల్ జయశ్రీ రైజి & కమలాబాయి హొస్పేట్
1981 అమల్ ప్రవా దాస్ ఎ.ఎం.ఎం.మురుగప్ప చెట్టియార్ రమాదేవి చౌదరి
1982 గోకుల్ బాయి భట్ ప్రేమ్‌భాయ్ తారాబెన్ మష్రూవాలా
1983 తగడూరు రామచంద్రరావు మణిభాయ్ దేశాయ్ పుష్పాబెన్ మెహతా
1984 పోపట్‌లాల్ రామచంద్ర షా మోహన్ నరహరి పారిఖ్ గౌరా దేవి
1985 టి.ఎస్.అవినాషలింగం సంజిత్ రాయ్ అనుతాయి వాఘ్
1986 సుందర్‌లాల్ బహుగుణ విలాస్ బి.సాలుంకె వాసంతి ఎస్.రాయ్
1987 నట్వర్ ఠక్కర్ సునీత్ ధనజి బొండే అన్నాప్రగడ సి కృష్ణ రావు
1988 శంకరలింగం జగన్నాథన్ & కృష్ణమ్మాళ్ ఈశ్వర్‌భాయ్ పటేల్ మాలతీదేవి చౌదరి పియరీ పరొడి
1989 కె.జనార్దనన్ పిళ్లై టి. జి. కె. మీనన్ ఇందిరాబాయి హల్బే డేనిలో డొల్చి
1990 తీరథ్ రామ్ ఎస్.ఎ.దాభోల్కర్ రతన్ శాస్త్రి ఎ.టి.అరియరత్నె
1991 ద్వారకో సుందరాని ఎస్.కృష్ణమూర్తి మిర్మిర రాధా భట్ ఛార్లెస్ వాకర్
1992 ఠాకూర్‌దాస్ బంగ్ కె.విశ్వనాథన్ షాలినీ మోఘే హోమర్ ఎ. జాక్
1993 విచిత్ర నారాయణ్ శర్మ దినకర్‌రావ్ జి. పవార్ కాంతాబెన్ & హరివిలాస్ బెన్ షా జోహాన్ గాల్టుంగ్
1994 ఎల్.ఎన్.గోపాలస్వామి వి.ఎస్.అగర్వాల్ శాంతి దేవి గెడాంగ్ బగుస్ ఓకా
1995 కాశీనాథ్ త్రివేది జి. మునిరత్నం నాయుడు విమలా బహుగుణ కమల
1996 మనుభాయ్ పంచోలి శ్రీనాథ్ శేషగిరి కల్బాగ్ ఇందుమతి పారిఖ్ అడాల్ఫో డి ఒబైటా
1997 ఆర్.కె.పాటిల్ ఎస్.ఎస్.కాటగిహళ్ళిమఠ్ వినోబా నికేతన్ యంగ్ సీక్ ఛౌ
1998 ఆచార్య రామమూర్తి దేవేంద్ర కుమార్ రాజమ్మాళ్ పి. దేవదాస్ కుమారి ఝర్ణ ధార చౌధురి
1999 నారాయణదేశాయ్ అజయ్ కుమార్ బసు సరస్వతీ గోరా జోసెఫ్ రాట్‌బ్లాట్
2000 సోమదత్ వేదాలంకర్ భాస్కర్ సావె విద్యాదేవి డెస్మండ్ టుటు
2001 సిసిర్ సన్యాల్ అనిల్ కె.రాజవంశి రహ్మత్ సుల్తాన్ ఫజెల్‌భాయ్ సతీష్ కుమార్
2002 సిద్ధరాజ్ ధడ్డ అరుణ్ కుమార్ దావె చిత్రా నాయక్ జార్జ్ విల్లోఘ్బి
2003 రబీంద్రనాథ్ ఉపాధ్యాయ్ వినాయక్ పాటిల్ అలీస్ గర్గ్ మేరీ ఇ. కింగ్
2004 రాధాకృష్ణ బజాజ్ ప్రభాకర్ శంకర్ ఠాకూర్ సరోజినీ వరదప్పన్ మేరీ థోజర్
2005 పి.గోపీనాథన్ నాయర్ రాజేంద్ర సింగ్ అరుణాబెన్ శంకరప్రసాద్ దేశాయ్ డైసాకు ఇకెడ
2006 సేలం నంజుండయ్య సుబ్బారావు[2] అనిల్ ప్రకాష్ జోషి రాణి ఆభయ్ బాంగ్ [ఇస్మాయిల్ సెరాగెల్డిన్
2007 యశ్‌పాల్ ఎం.మిట్టల్ ఆనంద్ దినకర్ కార్వే అశోక గుప్తా మిఛెల్ నాగ్లర్
2008 బిశ్వనాథ్ పట్నాయక్ తుషార్ కంజీలాల్ ఫూల్‌బసన్ యాదవ్ లూయిస్ కంపాన
2009 గోపరాజు లవణం[3] అయ్యప్ప మసగి జయ అరుణాచలం ఛార్లెస్ పీటర్ డౌగెర్టి
2010 చునీలాల్ వైద్య చెవంగ్ నోర్ఫెల్ శకుంతలా చౌదరి లియా డిస్కిన్[1]
2011 రమేష్ భయ్యా & విమలా బెహన్ అనుపం మిశ్రా శోభన రనాడే ఆగస్ ఇంద్ర ఉదయన
2012 జయంత్ మత్కర్[4] కళ్యాణ్ పాల్ గ్లెన్ డి. పైజ్ నిఘట్ షఫీ
2013 జి.వి.సుబ్బారావు స్నేహలతా నాథ్[5] విద్యా దాస్ జీన్ మేరీ ముల్లర్
2014 సురేంద్ర కౌలగి రామ్ కుమార్ సింగ్ చెన్నుపాటి విద్య సులక్ శివరక్ష
2015 మాన్ సింగ్ రావత్ పెరుమాళ్ వివేకానందన్ అన్నా ఫెర్రర్ మినోరు కసయ్
2016 మోహన్ హీరాబాయ్ హీరాలాల్ బి.వి.నింబ్కర్ ఎన్. మంగాదేవి రాచెడ్ ఘన్నౌచి
2017 శశి త్యాగి జన్ స్వాస్థ్య సహయోగ్ ప్రవీణ్ నాయర్ జియాద్ మెడౌఖ్
2018 ధూమ్ సింగ్ నెగి రూపల్ దేశాయ్ ప్రసన్న భండారి క్లేబోర్న్ కార్సన్
2019 భవానీ శంకర్ కుసుమ్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాటి షహీన్ మిస్త్రి సోనియా డెఒట్టో
2020[6] కరోనా కారణంగా రద్దు చేయబడింది
2021 ధరంపాల్ సైని లాల్ సింగ్ లూసీ కురియన్ డేవిడ్ హెచ్.ఆల్బర్ట్
2022 నీలేష్ దేశాయి మన్‌సుఖ్‌భాయ్ ప్రజాపతి సోఫియా షేక్ ఒగారిట్ యూనన్, వాలిద్ స్లయ్బి
2023 రెగీ జార్జ్ & లలితా రెగీ రామలక్ష్మి దత్త సుధా వర్గీస్ రహ నబా కుమార్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Nonagenarians among four Jamnalal Bajaj awardees". The Hindu. 29 October 2010.
  2. "Jamnalal Bajaj awards presented". The Hindu. 7 Nov 2006. Archived from the original on 10 February 2007.
  3. "Jamnalal Bajaj awards announced". The Times of India. 8 Oct 2009. Archived from the original on 7 July 2012.
  4. "Jamnalal Bajaj awards presented". Indian Express. 21 Dec 2012.
  5. "Snehlata Nath, Jamnalal Bajaj Awards 2013, Outstanding Contribution in Application of Science and Technology for Rural Development". Jamnalal Bajaj Foundation. Retrieved 2020-04-27.
  6. "Home". jamnalalbajajawards.org.