జమిదగ్గుమిల్లి
జమిదగ్గుమిల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పామర్రు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 396 |
- పురుషులు | 189 |
- స్త్రీలు | 207 |
- గృహాల సంఖ్య | 130 |
పిన్ కోడ్ | : 521356 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
'జమీదగ్గుమిల్లి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 356., యస్.ట్.డీ కోడ్=08674.
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం[మార్చు]
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్ఝవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి.
సమీప మండలాలు[మార్చు]
పమిడిముక్కల, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, మొవ్వ
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ప్రభుత్వ సాయంతోపాటు, గ్రామస్థులు శ్రీ సీతాల సాంబశివరావు, శ్రీ కాకర్ల చంద్రనారాయణ, మరికొందరి సహకారంతో, 1967 లో ఈ పాఠశాలను 1.8 ఎకరాల స్థలంలో, నిర్మించారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు వివిధ వృత్తులలో రాణించుచున్నారు. వీరు, ఈ పాఠశాల అభివృద్ధికి, స్థానికులతో కలిసి, తమ తోడ్పాటును అందించుచున్నారు. [3] ఈ పాఠశాలలో 2016,డిసెంబరు-1న, దాతల సహకారంతో, చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన దాత కీ.శే. సీతాల శివరామకృష్ణమూర్తి, శ్రీమతి కృష్ణ తులసి దంపతుల వితరణతో, రెండు లక్షల రూపాయల వ్యయంతో, ఈ విగ్రహం, సంబంధిత మండపం ఏర్పాటు చేసారు. [4]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామంలో రాజకీయాలు[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వేములమడ మంగమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం.
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 396 - పురుషుల సంఖ్య 189 - స్త్రీల సంఖ్య 207 - గృహాల సంఖ్య 130
- జనాభా (2001) -మొత్తం 481 -పురుషులు 235 -స్త్రీలు 246 -గృహాలు 136 -హెక్టార్లు 223
మూలాలు[మార్చు]
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Zamidaggumilli". Retrieved 29 June 2016. External link in
|title=
(help)
[2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 24వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-14; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-2; 2వపేజీ.