జయంత్ సి పరాన్జీ
జయంత్ సి. పరాన్జీ | |
---|---|
వృత్తి | సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1997−ప్రస్తుతం |
జయంత్ సి. పరాంజీ భారతీయ సినిమా దర్శకుడు. ప్రత్యేకంగా తెలుగు చిత్రపరిశ్రమకు చెందినవాడు.[1] ఆయన ప్రీతీ జింటా , ఐశ్వర్య రాయ్, సోనాలీ బింద్రే, లీసా రాయ్, అంజలా జవేరీ, బిపాషా బసు వంటి బాలీవుడ్ తారలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడు.[2] ఆయన వివిధ కళాప్రక్రియలతో చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి నటుల చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]పరాంజీ కర్ణాటక రాష్ట్రంలోని కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. ఆయన బెంగుళూరు లోని గాంధీనగర్ లో పెరిగాడు. ఆ ప్రాంతంలో అనేక మంది కన్నడ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ యొక్క కార్యాలయాలు ఉండేవి. ఆయన హైదరాబాదు లో స్థిరపడిన తరువాత ప్రసిద్ధమైన ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించాడు. తరువాత టెలివిజన్ లోని తెలుగు సీరియళ్లకు దర్శకత్వం చేసేవాడు. ఆయన దూరదర్శన్ లో ప్రసారితమైన తెనాలిరామ సీరియల్ ద్వారా ఖ్యాతి పొందాడు. ఖరీదైన సెట్లలో చిత్రీకరించిన ఈ సీరియల్ త్వరగా అగ్రస్థానాన్ని చేరుకుంది. ఆయన ఫీచర్ పిల్మ్స్ తిసే ముందు అడ్వర్‌టైజ్ మెంటు డాక్యుమెంటరీలను చిత్రికరించాడు. ఆయన చిత్ర దర్శకునిగా దగ్గుబాటి వెంకటేష్ కథానాయకునిగా విడుదలైన ప్రేమించుకుందాం రా ద్వారా ప్రవేశించాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | నటీనటులు | వివరణ |
---|---|---|---|
1997 | ప్రేమించుకుందాం రా | దగ్గుబాటి వెంకటేష్, అంజలా జవేరీ | |
1998 | బావగారూ బాగున్నారా? | చిరంజీవి, రంభ | |
1998 | ప్రేమంటే ఇదేరా | దగ్గుబాటి వెంకటేష్, ప్రీతి జింతా | |
1999 | రావోయి చందమామ | అక్కినేని నాగార్జున, అంజలా జవేరీ, ఐశ్వర్యారాయ్ | |
2002 | టక్కరి దొంగ | మహేష్ బాబు, లీసా రాయ్, బిపాషా బసు | |
2002 | ఈశ్వర్ | ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్ | |
2004 | లక్ష్మీనరసింహా | నందమూరి బాలకృష్ణ, అసిన్ | |
2004 | శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. | చిరంజీవి, సోనాలి బెంద్రే | |
2004 | సఖియా | తరుణ్ కుమార్, నౌహీద్ సౌరిసి | |
2005 | అల్లరి పిడుగు | నందమూరి బాలకృష్ణ, కత్రినా కైఫ్[5] | |
2011 | తీన్ మార్ | పవన్ కళ్యాణ్, త్రిష కృష్ణన్ | |
2014 | నిన్నిందలి | పునీత్ రాజ్‌కుమార్, ఎరికా ఫెర్నాండెజ్ |
ఇతర లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "I am the real-life Raj from DDLJ: Jayanth C Paranji". The Times of India.
- ↑ "Penchant for making love stories". The Hindu.
- ↑ "Jayant Paranji". IMDB.com. Retrieved 29 June 2010.
- ↑ "Jayanth C Paranji". FilmiBeat.
- ↑ "An out and out potboiler Commercial potboiler". Chennai, India: The Hindu. 8 October 2005. Archived from the original on 18 ఫిబ్రవరి 2006. Retrieved 29 June 2010.