Jump to content

జయదేవ్ ఉనద్కత్

వికీపీడియా నుండి
జయదేవ్ ఉనద్కత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జయదేవ్ దీపక్‌భాయ్ ఉనద్కత్
పుట్టిన తేదీ (1991-10-18) 1991 అక్టోబరు 18 (వయసు 33)
పోర్‌బందర్, గుజరాత్
ఎత్తు6 అ. 3 అం. (191 cమీ.) [1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 267)2010 డిసెంబరు 16 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2022 డిసెంబరు 22 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 197)2013 జూలై 24 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 1 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.91 (formerly 77)
తొలి T20I (క్యాప్ 64)2016 జూన్ 18 - జింబాబ్వే తో
చివరి T20I2018 మార్చి 18 - బంగ్లాదేశ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.77
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–presentసౌరాష్ట్ర
2010–2012, 2016కోల్‌కతా నైట్‌రైడర్స్
2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2014–2015ఢిల్లీ డేర్ డెవిల్స్
2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్s
2018–2021రాజస్థాన్ రాయల్స్
2022ముంబై ఇండియన్స్
2023లక్నో సూపర్ జెయింట్స్
2023ససెక్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 7 101 116
చేసిన పరుగులు 29 1,848 503
బ్యాటింగు సగటు 14.50 18.48 10.93
100లు/50లు 0/0 0/8 0/1
అత్యుత్తమ స్కోరు 14* 92 57
వేసిన బంతులు 156 312 17,403 6,134
వికెట్లు 3 8 382 168
బౌలింగు సగటు 56.00 26.12 22.41 28.97
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 22 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 2/42 4/41 8/39 5/23
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 45/– 28/–
మూలం: CricInfo, 2023 మార్చి 24

జయదేవ్ దీపక్ భాయ్ ఉనద్కత్ (జననం 1991 అక్టోబరు 18) భారత జాతీయ జట్టుకు ఆడిన ఒక భారతీయ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు. 2010లో అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2020 మార్చిలో, సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్‌ సాధించడంలో కెప్టెన్‌గా ఆ జట్టును నడిపించాడు. 2022 డిసెంబరులో, ఉనద్కత్ 12 సంవత్సరాల తర్వాత టెస్టు XIలో తిరిగి వచ్చాడు. [2]

దేశీయ కెరీర్

[మార్చు]

దేశీయంగా ఉనద్కత్, సౌరాష్ట్ర తరపున ఆడతాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనేక జట్లకు ఆడాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంపిక చేసినప్పుడు అతను అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాళ్ళలో ఒకడు. [3] 2013 మేలో అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన అత్యుత్తమ T20 కెరీర్ బౌలింగ్ గణాంకాలను 5/25 సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [4]

2014 IPL వేలంలో అతన్ని ఢిల్లీ తీసుకుంది. 2016 ఫిబ్రవరిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 160 lakh (US$2,00,000) కు ఉనద్కత్‌ను కొనుక్కుంది.[5] 2017 ఫిబ్రవరిలో, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్‌కి మారాడు. [6] 10వ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడు. [7] [8]


2018 జూలైలో, అతను 2018–19 దులీప్ ట్రోఫీ [9] కోసం ఇండియా బ్లూ కోసం జట్టులో ఎంపికయ్యాడు. 2018 అక్టోబరులో 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా B జట్టులో ఎంపికయ్యాడు. [10]

2019 జనవరిలో, అతను రంజీ ట్రోఫీలో 200 వికెట్లు తీసిన సౌరాష్ట్ర బౌలర్లలో రెండవ వాడు అయ్యాడు. [11] 2019 ఆగష్టులో 2019-20 దులీప్ ట్రోఫీ [12] [13] కోసం ఇండియా రెడ్ టీమ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019–20 దేవధర్ ట్రోఫీ లో ఇండియా A జట్టులో స్థానం పొందాడు.[14] అతను 2019-20 రంజీ ట్రోఫీలో పది మ్యాచ్‌లలో 67 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. [15] [16]

2010లో రంగప్రవేశం చేసాక జయదేవ్ ఉనద్కత్, ఒక్క టెస్టు కూడా ఆడలేదు [17]

2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ముంబై ఇండియన్స్ అతనిని కొనుగోలు చేసింది. [18]

2022 డిసెంబరు 23న, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం IPL వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతనిని కొనుగోలు చేసింది. [19]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2010లో ఇంగ్లండ్‌లో భారత అండర్-19 జట్టు తరపున ఆడిన తర్వాత, గ్రేస్ రోడ్‌లో వెస్టిండీస్ అండర్-19తో జరిగిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశంలో 13 వికెట్లు తీసిన తర్వాత, ఉనద్కత్‌ను శ్రీలంకలో భారత జాతీయ జట్టుకు నెట్ బౌలర్‌గా ఉపయోగించుకున్నారు. 2010 డిసెంబరులో సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాపై భారతదేశం తరపున అతని అంతర్జాతీయ రంగప్రవేశం జరిగింది. [20]

2022 డిసెంబరు 22న మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 2వ టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో ఉనద్కత్ ఎంపికయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. [21]

2016 జూన్లో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేపై ఉనద్కత్ తన తొలి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) ఆడాడు. [22]

మూలాలు

[మార్చు]
  1. "Jaydev Unadkat Profile". NDTV Sports (in ఇంగ్లీష్). Retrieved 8 January 2022.
  2. Harish, Kotian (24 March 2020). "'How We Won the Ranji Trophy'". Rediff.com.
  3. "IPL player list at 2013 auction". ESPN Cricinfo. 3 February 2013.
  4. Jaydev Unadkat's five-wicket haul sees Bangalore home by four runs against Delhi
  5. "Watson goes for whopping 9.5 cr, Negi emerges costliest Indian buy". The Hindu (in Indian English). 6 February 2016. ISSN 0971-751X. Retrieved 6 February 2016.
  6. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 20 February 2017.
  7. "Unadkat in the 20th over: 0 W W W 0 0". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 May 2017.
  8. "44th match: Sunrisers Hyderabad v Rising Pune Supergiant at Hyderabad (Deccan), May 6, 2017 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 29 May 2017.
  9. "'Fit' Samson returns to India A squad". ESPN Cricinfo. 23 July 2018. Retrieved 23 July 2018.
  10. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 19 October 2018.
  11. "Unadkat, Jadeja peg Karnataka back". Cricket Country. Retrieved 28 January 2019.
  12. "Shubman Gill, Priyank Panchal and Faiz Fazal to lead Duleep Trophy sides". ESPN Cricinfo. Retrieved 6 August 2019.
  13. "Duleep Trophy 2019: Shubman Gill, Faiz Fazal and Priyank Panchal to lead as Indian domestic cricket season opens". Cricket Country. Retrieved 6 August 2019.
  14. "Deodhar Trophy 2019: Hanuma Vihari, Parthiv, Shubman to lead; Yashasvi earns call-up". SportStar. 24 October 2019. Retrieved 25 October 2019.
  15. Harish, Kotian (23 March 2020). "Jaydev Unadkat: 'My stars are aligned at the moment'". Rediff.com.
  16. "Ranji Trophy, 2019/20: Most wickets". ESPN Cricinfo. Retrieved 13 March 2020.
  17. "Kumar Sangakkara wanted me to start afresh: Jaydev Unadkat opens up about IPL journey, India comeback chances". India Today (in ఇంగ్లీష్). May 26, 2021. Retrieved 29 August 2021.
  18. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  19. "IPL Auction 2023 | Unadkat sold at base price; here's all you need to know". India TV (in ఇంగ్లీష్). Retrieved 25 December 2022.
  20. "Jaydev Unadkat". ESPN Cricinfo.
  21. "Jaydev Unadkat replaces Kuldeep Yadav to make Test comeback after 12 years". 22 December 2022.
  22. "India tour of Zimbabwe, 1st T20I: Zimbabwe v India at Harare, Jun 18, 2016". ESPN Cricinfo. Retrieved 18 June 2016.