జయప్రభ
Jump to navigation
Jump to search
జయప్రభ | |
---|---|
జననం | అనిపిండి జయప్రభ 1957 జూలై 29 నాగపూర్, మహారాష్ట్ర |
ప్రసిద్ధి | స్త్రీవాద కవయిత్రి, కథా రచయిత్రి |
మతం | హిందూ |
జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
విశేషాలు
[మార్చు]ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించారు .[1] ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివారు . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నారు .[2] తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు.[3] ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు .[4]
రచనలు
[మార్చు]- ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
- యశోధరా వగపెందుకే
- చింతల నెమలి
- యుద్ధోన్ముఖంగా...
- క్షణ క్షణ ప్రయాణం
- ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
- భావకవిత్వంలో స్త్రీ
- వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
- వామనుడి మూడోపాదం
- నాలుగో గోడ
- పైటని తగలెయ్యాలి
- విచ్చుకత్తులు
- యశోదరా వగపెందుకే
- సూర్యుడు కూడా ఉదయిస్తాడు
మూలాలు
[మార్చు]- ↑ కథానిలయంలో జయప్రభ వివరాలు[permanent dead link]
- ↑ http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm
- ↑ మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2017-03-13.