జయశ్రీ (శ్రీజయ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయశ్రీ
జయశ్రీ
జననం
జయశ్రీ

(1991-11-28) 1991 నవంబరు 28 (వయసు 32)
జాతీయతభారతీయురాలు
విద్యవిద్యార్హత
వృత్తివృత్తి
తల్లిదండ్రులుఈశ్వరి, శివశంకర్
పురస్కారాలుఉత్తమ నటి - అశ్శరభశరభ (నాటకం), నంది నాటక పరిషత్తు - 2015

జయశ్రీ తెలుగు నాటకరంగంలో యువనటి.

జననం

[మార్చు]

ఈవిడ నవంబర్ 28, 1991లో ఖమ్మం జిల్లా లోని మామిళ్లగూడెంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఈశ్వరి, శివశంకర్. వీరి తండ్రి సినిమా కెమెరామెన్ గా పనిచేశారు.



చదువు

[మార్చు]

ప్రాథమిక విద్య నుండి బి.కాం వరకు విజయవాడలో జరిగింది. ప్రైవేటుగా ఎంబీఏ, జర్నలిజం చేశారు. అటుతర్వాత నటనపై ఉన్న ఆసక్తితో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేశారు.

కళారంగ ప్రవేశం

[మార్చు]

పాఠశాల నుండే డ్యాన్స్, వ్యాసరచన మొదలైన వాటిల్లో చురుకుగా పాల్గొన్నారు. చిన్నతనంలోనే ఉమామహేశ్వరావు గారి దగ్గర శాస్త్రీయ నృత్యం, యు. సన్నికుమార్ గారి దగ్గర ప్రాశ్చత్య నృత్యం, దాసరి నారాయణరావు శిష్యులైన సత్యంయాబి దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నారు.

సినిమా

[మార్చు]

దర్శకుడు రాజ్ వంశీ ‘‘మధుర మీనాక్షి’’ సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆతర్వాత కురువాడ మురళీధర్ నిర్మించిన ‘‘చిలిపి అల్లరిలో చిన్ని ఆశ’’ లో, ‘‘యుద్ధం’’లో, 2017లో శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వంలో వచ్చిన అవంతిక మొదలైన సినిమాల్లో నటించింది.

నాటకరంగం

[మార్చు]

కళ్యాణి నాటకం ద్వారా నాటకరంగ ప్రవేశం చేసింది. కె.ఎల్. ప్రసాద్ రచించిన ఈ నాటకానికి డా. కోట్ల హనుమంతరావు దర్శకుడు.

నటించిన నాటకాలు/నాటికలు

[మార్చు]
  1. కళ్యాణి
  2. మిస్ మీనా
  3. కొమరం భీం
  4. నచ్చావోయ్ నారాయణ
  5. కట్టుబానిస
  6. అమ్మకింక సెలవా ?
  7. అభయం
  8. ఊరుమ్మడి బతుకులు
  9. ఇంటి దొంగ
  10. అభిజ్ఞాన శకుంతలం
  11. అమ్మ చెప్పిన కథ
  12. కలహాల కాపురం
  13. ఈ పయనమెటు
  14. అశ్శరభ శరభ
  15. ఎవరిని ఎవరు క్షమించాలి
  16. నాయకురాలు నాగమ్మ[1][2][3]
  17. స్వక్షేత్రం
  18. ప్రేమకు వేళాయెరా
  19. రజాకార్
  20. ధ్యేయం
  21. బాగుంది ఇంకా బాగుంటుంది
  22. తేలు కుట్టిన దొంగలు
  23. జ్యోతిరావ్ పూలే
  24. గుణపాఠం

దర్శకత్వం వహించిన నాటకాలు

[మార్చు]
  1. నిశ్శబ్ధం నీకు నాకు మధ్య (విద్యార్థి దర్శకత్వ పరీక్షలో భాగంగా యండమూరి వీరేంధ్రనాథ్ రచించిన నాటకానికి దర్శకత్వం వహించారు)
  2. మహాత్మ జ్యోతిరావు పూలే

టీవి రంగం

[మార్చు]

దూరదర్శన్ (సప్తగిరి) లో ప్రసారమైన పసిడిమొగ్గలు ధారావాహికలో కథానాయికగా నటించారు. అంతేకాకుండా మా టీవి (పుణ్యక్షేత్రాలు), జెమిని టీవి, స్టార్ సితారా, విస్సా టీవి లలో యాంకరింగ్ చేశారు.

అవార్డులు

[మార్చు]
  • పరుచూరి రఘుబాబు పరిషత్తు - ఉత్తమ నటి - కళ్యాణి నాటకం.
  • సుమధుర కళానికేతన్ - ఉత్తమ నటి - నచ్చావోయ్ నారాయణ (నూతన ఆంధ్రప్రదేశ్ మొదటి అవార్డు)
  • నంది నాటకోత్సవం 2015 - ఉత్తమ నటి - అశ్శరభశరభ నాటకం

పురస్కారాలు

[మార్చు]
  • వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌)[4]

మూలాలు

[మార్చు]
  1. www.thehindu.com (February 26, 2016). "Period plays make a mark". Retrieved 16 November 2016.
  2. www.thehindu.com (May 26, 2016). "Nayakuralu Nagamma, a visual delight". Retrieved 16 November 2016.
  3. timesofindia.indiatimes.com (Nov 15, 2016). "Bringing alive Nagamma's life on stage". Retrieved 16 November 2016.
  4. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Archived from the original on 19 ఏప్రిల్ 2023. Retrieved 17 January 2017.
  • సూర్య చిత్ర పత్రిక, 2012 నవంబర్ 23 లో జయశ్రీ ఇంటర్వ్యూ

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.