జర్బెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జర్బెరా
A white Gerbera × hybrida
Scientific classification Edit this classification
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: పుష్పించే మొక్కలు
Clade: Eudicots
Clade: Asterids
Order: ఆస్టరేలిస్
Family: ఆస్టరేసి
Subfamily: Mutisioideae
Tribe: Mutisieae
Genus: Gerbera
L. 1758 non Boehmer, 1760 (Asteraceae) nec J.F.Gmel., 1791[1]
Synonyms[2]
  • Gerbera sect. Piloselloïdes Less.
  • Lasiopus Cass.
  • Piloselloides (Less.) C.Jeffrey ex Cufod.
  • Berniera DC.
  • Atasites Neck.

జర్బెరా (Gerbera) (/ˈɜːrbərə/ or /ˈɡɜːrbərə/) అనేది ఆస్టరేసియ కుటుంబానికి చెందిన మొక్కల ప్రజాతి పేరు. ఇవి దక్షిణమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని ఉష్ణ మండల ఆవాస ప్రాంతాలకు చెందిన పూల మొక్కలు. ఈ ప్రజాతికి చెందిన మొక్కలు చక్కని అలంకరణ మొక్కలు. బహు వార్షికాలు. తెలుపు, పసుపు, నారింజ, ఎరుపు, పింక్, ఊదా మొదలైన ఆకర్షణీయమైన రంగులలో పూసే పూవులకు ఇవి ప్రసిద్ధి. గులాబీ, కార్నేషన్, చేమంతి, తులిప్ పువ్వుల తరువాత ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న విడి పూలు (cut flowers) జర్బెరా పూలు. జర్బెరా మొక్కలనే సాధారణంగా ఆఫ్రికన్ డైసీ (African daisy) లేదా ట్రాన్సవాల్ డైసీ లని కూడా వ్యవహరిస్తారు.

చరిత్ర

[మార్చు]

జర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు, వైద్యుడు అయిన ట్రగుట్ జర్బెరా (1710-1743) గౌరవార్దం ఈ పూల మొక్కల ప్రజాతికి "జర్బెరా" పేరు పెట్టబడింది.[3] లిన్నేయస్ మిత్రుడైన జర్బెరా రష్యాలో విస్తృతంగా పర్యటించి అక్కడి స్థానిక జాతులకు చెందిన వృక్షాలను అధ్యయనం చేసాడు.[4] 1880 లో రాబర్ట్ జేమ్ సన్ దక్షిణ ఆఫ్రికా లోని బార్బెర్టన్ (Barberton) వద్ద ఈ జర్బెరా డైసీ మొక్కలను కనుగొన్నాడు. 1899 లో జె.డి. హూకర్ అనే బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు ఆఫ్రికన్ డైసీ గా వ్యవహరించబడే జర్బెరా జేమ్సోని (Gerbera jamesonii) అనే మొక్కను కుర్టీస్ బొటానికల్ మేగజైన్ లో వర్ణించడం ద్వారా, జర్బెరా ప్రజాతి మొక్కలను తొలిసారిగా శాస్త్రీయంగా వర్ణించినవాడయ్యాడు. ఇవి 19 వ శతాబ్దంలో యూరప్ ఖండంలో ప్రవేశపెట్టబడ్డాయి. అమెరికాలో 1970 లో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు వీటిని ప్రజననం (breeding) చేయడం మొదలుపెట్టిన తరువాతనే జర్బెరా మొక్కలు అమెరికాలో బాగా పాపులర్ అయ్యాయి.

లక్షణాలు

[మార్చు]

జర్బెరా మొక్కలు బహు వార్షికాలు. అంటే ఒక మొక్క సంవత్సరాల తరబడి అన్ని ఋతువులలోను పుష్పిస్తూనే ఉంటుంది. ఈ మొక్కలకు ప్రత్యేకంగా ఒక కాండం అంటూ ఉండదు. గుబురుగా వున్న ఆకుల సమూహం నుంచి పొడుచుకొని వచ్చిన ఒక పొడుగాటి కాడ, దాని చివరి భాగంలో పువ్వు పూస్తుంది. ఈ పువ్వు మధ్యలో తమ్మె వుండి, దాని చుట్టూ సూర్య కిరణాల లాంటి సన్నని పొడుగాటి రేకులు వికసించి ఉంటాయి. తెలుపు, పసుపు, ఎరుపు, ఆరెంజ్, పింక్, ఊదా లాంటి ఆకర్షణీయమైన రంగులలో ఈ పూలు పూస్తాయి. తరుచుగా ఒకే పువ్వుకు వివిధ రంగుల రేకులు కూడా ఉంటాయి. పువ్వు చూడడానికి పొద్దుతిరుగుడు పూవు, చామంతి పూవు మాదిరిగా ఉంటుంది. వికసించిన పూలు 2 నుంచి 5 అంగుళాల వరకు వ్యాసం కలిగి ఉంటాయి.విడిపూలు (కట్ ఫ్లవర్స్) గా వున్న ఈ పూలు చూడడానికి ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ఈ పూలలో ఒంటి రేకు (single petal), ముద్దరేకు (multiple petals) రకాలు వున్నాయి. జర్బెరా పూలు ఏడాది పొడుగునా పూస్తూనే ఉన్నప్పటికి, శీతాకాలంలో ఎక్కువగా పుష్పిస్తాయి.

అనుకూల పరిస్థితులు

[మార్చు]

నేలలు

[మార్చు]

ఈ పూల మొక్కలకు క్షార స్వభావం గల నేలలు శ్రేష్టమైనవి. నేల PH విలువ 5.5 నుండి 6.5 మధ్యన ఉండాలి. సాధారణంగా ఎర్ర లేటరైట్ నేలలు (Red Laterite) అనువుగా ఉంటాయి. నేల ఎక్కువ సచ్ఛిద్రంగా (porous) ఉండాలి. ముఖ్యంగా నేలలో నీరు నిలవ వుండకూడదు.

శీతోష్ణస్థితి

[మార్చు]

ఇవి నీడ పట్టున చక్కగా పెరిగే మొక్కలు. తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేవు. నీడపట్టున పెరిగే మొక్కలు కావటం వలన వేసవిలో మధ్యాహ్నపు ఎండ కాకుండా ఉదయం, సాయంత్రం పూట తగిలే ఎండ వేడి వీటికి సరిపోతుంది. ఉష్ణోగ్రతలు ఉదయంపూట 27°C , రాత్రి పూట 14°C వీటికి అనువైనవి. పుష్పోత్పత్తికి కనీసం 23°C ఉష్ణోగ్రత ఉండాలి. రాత్రుళ్లు ఉష్ణోగ్రత 6°C మించి పడిపోకూడదు. ముఖ్యంగా తుహినం (frost) కు ఇవి తట్టుకోలేవు.

రకాలు

[మార్చు]

జర్బెరా మొక్కలలో అనేక వేల రకాలను సాగు చేస్తున్నారు. ఈ ప్రజాతికి చెందిన రెండు ఆఫ్రికన్ జాతి మొక్కలు - జర్బెరా జెమ్సొని (Gerbera jamesonii), జర్బెరా విరిడిఫోలియా (Gerbera viridifolia) లను సంకరకరణం చేసినపుడు[5] జర్బెరా హైబ్రీడా అనే సంకరజాతి ఏర్పడింది. నేడు సాగు చేస్తున్న రకాలలో అత్యధికం ఈ సంకరజాతికి చెందినవే.

ముఖ్యమైన సాగు రకాలు ప్రి ఇంటెన్జ్ (Pre Intenzz), స్టాంజా (Stanza), వింటర్ క్వీన్ (Winter Queen), కాచరిల్లే (Cacharelle), జఫా (Jaffa), సాంగ్రియా (Sangria), డయానా (Diana), థాల్సా (Thalsa), సోన్సారా (Sonsara),మోనిక్ (Monique), అన్నెకి (Anneke), నెట్టే (Nette), రోజెట్టా (Rosetta), గ్లోరియా (Gloria), జిన్నా (Ginna), ఇంగ్రిడ్ (Ingrid), ప్రిసిల్లా (Pricilla), అలెక్సీయస్ (Alexias), సన్వే (Sunway), జింగారో (Zingaro), రోజలిన్ (rosaline),డ్యూన్ (dune)

ప్రవర్ధనం

[మార్చు]

విత్తనాలు ద్వార, శాఖీయ పద్దతుల ద్వార ఈ మొక్కలను వర్ధనం చేయవచ్చు. విత్తనాలు 15°C-20°C ల వద్ద అయితే 2 వారాలలో మొలకెత్తుతాయి. లేకుంటే నెలరోజులు పట్టవచ్చు. శాఖీయ పద్దతులలో పక్క రెమ్మలను, పిలక మొక్కలను (suckers) కటింగ్ ద్వారా వర్ధనం చేస్తారు. విత్తనం నుంచి పుష్పించే దశకు రావడానికి 14-18 వారాల సమయం పడుతుంది.

మొక్కల సస్యరక్షణ

[మార్చు]

ఈ మొక్కలకు సాధారణంగా సోకే చీడలు, తెగుళ్లు [6]

  • చీడలు: ఎఫిడ్స్ (పేనుబంక), థ్రిప్స్ (Thrips), ఆకు తొలిచే పురుగు (Leaf miner), ఎర్ర సాలీడు పురుగు (Red spider mite), తెల్ల ఈగలు (white flies)
  • తెగుళ్లు: వేరు కుళ్ళు తెగులు (Root rot) ఫిథియమ్ (pythium), రైజొక్టనియా (Rhizoctonia), క్లేరోటియం కుళ్ళు తెగులు (sclerotinia), తెల్ల తెగులు (white rust), కాండపు మచ్చ (Blight), బూడిద తెగులు (powdery mildew), ఆకుమచ్చ తెగులు (Leaf spot)

ప్రాముఖ్యత

[మార్చు]

జర్బెరా ప్రజాతి పూల మొక్కలు చక్కని అలంకరణ మొక్కలుగా పేరుగాంచాయి. వీటిని ఎక్కువగా అలంకరణ ఉద్యాన మొక్కలుగా లేదా కట్ ఫ్లవర్స్ గా ఉపయోగిస్తారు. వాణిజ్యపరంగా కూడా ఇది ఒక ముఖ్యమైన కట్ ఫ్లవర్ పంట. కట్ ఫ్లవర్స్ కు సంబంధించిన వాణిజ్య పంటల విపణిలో గులాబీ, కార్నేషన్, చేమంతి, తులిప్ పువ్వుల తరువాత స్థానం జర్బెరా పూలదే. భారత దేశంలో జర్బెరా పూలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్న రాష్ట్రాలలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హిమాచల ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ లు ముఖ్యమైనవి.

పుష్ప నిర్మాణాన్ని అధ్యయనం చేసే ఒక నమూనా పుష్పంగా దీనిని ఉపయోగిస్తారు. జర్బెరా మొక్కలలో కౌమారిన్ (coumarin) ఉత్పన్నాలు సహజ సిద్ధంగా లభిస్తాయి.

జాతులు (species)

[మార్చు]

జర్బెరా ప్రజాతికి చెందిన మొక్క జాతులు[2]

  1. Gerbera ambigua
  2. Gerbera aurantiaca : Hilton daisy
  3. Gerbera bojeri
  4. Gerbera bonatiana
  5. Gerbera connata
  6. Gerbera cordata
  7. Gerbera crocea
  8. Gerbera curvisquama
  9. Gerbera delavayi
  10. Gerbera diversifolia
  11. Gerbera elliptica
  12. Gerbera emirnensis
  13. Gerbera galpinii
  14. Gerbera gossypina
  15. Gerbera hypochaeridoides
  16. జర్బెరా జేమ్సోని : బార్బెర్టన్ డైసీ, జర్బెరా డైసీ, ట్రాన్సవాల్ డైసీ
  17. Gerbera kunzeana
  18. Gerbera latiligulata
  19. Gerbera leandrii
  20. Gerbera leiocarpa
  21. Gerbera leucothrix
  22. Gerbera lijiangensis
  23. Gerbera linnaei
  24. Gerbera macrocephala
  25. Gerbera maxima
  26. Gerbera nepalensis
  27. Gerbera nivea
  28. Gerbera parva
  29. Gerbera perrieri
  30. Gerbera petasitifolia
  31. Gerbera piloselloides
  32. Gerbera pterodonta
  33. Gerbera raphanifolia
  34. Gerbera ruficoma
  35. Gerbera saxatilis
  36. Gerbera serotina
  37. Gerbera serrata
  38. Gerbera tomentosa
  39. Gerbera viridifolia
  40. Gerbera wrightii

దృశ్యమాలిక

[మార్చు]

రిఫరెన్సులు

[మార్చు]
  • Hansen, Hans V. A taxonomic revision of the genus Gerbera (Compositae, Mutisieae) sections Gerbera, Parva, Piloselloides (in Africa), and Lasiopus (Opera botanica. No. 78; 1985), ISBN 87-88702-04-9.
  • Nesom, G .L. 2004. Response to "The Gerbera complex (Asteraceae, Mutisieae): to split or not to split" by Liliana Katinas. Sida 21:941–942.
  • Bremer K. 1994: Asteraceae: cladistics and classification. Timber Press: Portland, Oregon.
  • [1]Model Bankable Project on Floriculture (Rose & Gerbera)

బయటిలింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Tropicos search for Gerbera[permanent dead link]
  2. 2.0 2.1 Flann, C (ed) 2009+ Global Compositae Checklist [permanent dead link]
  3. "Traugott Gerber - Gerbera.org".
  4. Sunset Western Garden Book, 1995:606–607
  5. Isabel Johnson. "Gerbera jamesonii Adlam". Archived from the original on 22 జనవరి 2014. Retrieved 22 January 2014.
  6. "gerbera". gerbera.org. gerber. Retrieved 1 March 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=జర్బెరా&oldid=3846173" నుండి వెలికితీశారు