జర్మనీలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జర్మనీలో హిందూ మతం మైనారిటీ మతం. జర్మనీ జనాభాలో 0.1% మంది దీనిని పాటిస్తున్నారు. [1] దేశంలో దాదాపు 1,00,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [2]

జనాభా వివరాలు[మార్చు]

1950 నుండి, భారతీయ హిందువులు జర్మనీకి వలస వస్తూ ఉన్నారు. 1970ల నుండి, శ్రీలంక నుండి తమిళులు జర్మనీకి శరణార్థులుగా వచ్చారు (వారిలో ఎక్కువ మంది హిందువులు). 2000లో జర్మనీలో 90,000 మంది హిందువులు ఉన్నారు. [3] 2007లో బెర్లిన్‌లో 6,000 మంది హిందువులు నివసిస్తూ ఉన్నారు. [4] 2009 నాటికి, దిగువ సాక్సనీలో దాదాపు 5,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [5]

REMID గణాంకాల ప్రకారం, [6] 2017లో జర్మనీలో 1,30,000-1,50,000 మంది హిందువులు ఉన్నారని అంచనా. వారిలో దాదాపు 42,000–45,000 మంది శ్రీలంక తమిళులు ; 60,000–80,000 మంది భారతీయులు; 7,500 పైచిలుకు మంది శ్వేతజాతీయులు, ఇతరులు; 7,000–10,000 మంది ఆఫ్ఘన్ హిందువులు.

దేవాలయాలు[మార్చు]

శాఖలు[మార్చు]

ఇస్కాన్[మార్చు]

జర్మనీలోని మొదటి హరే కృష్ణ దేవాలయాన్ని 1970లో హాంబర్గ్‌లో నిర్మించారు. ఇస్కాన్ గురువు సచ్చిదానంద స్వామి భగవద్గీతను జర్మన్ భాషలోకి అనువదించాడు. [7]

బాలినీయ హిందూమతం[మార్చు]

జర్మనీలో దాదాపు 700 బాలినీయ హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. [8] హాంబర్గ్‌లోని ఎథ్నాలజీ మ్యూజియం ముందు ఒక దేవాలయం ఉంది. రెండవది, బెర్లిన్‌లోని ఎర్హోలుంగ్‌స్పార్క్ మార్జాన్‌లో ఉన్న పురా త్రి హిత కరణ. [9] [10] పురా త్రి హిత కరణ అనేది పార్క్‌లోని బాలినీయ గార్డెన్‌లో ఉన్న హిందూ దేవాలయం. బాలినీయ వాస్తు శైలిలో ఇండోనేషియా వెలుపల నిర్మించిన హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.

ప్రసిద్ధ జర్మన్ హిందువులు[మార్చు]

 • క్లాడియా సిస్లా, బాలీవుడ్ నటి.
 • వాల్తేర్ ఈడ్లిట్జ్, రచయిత, కవి, ఇండాలజిస్ట్
 • హంసదుత్త స్వామి
 • తల్లి మీరా
 • శివశ్రీ పాస్కరకురుక్కల్
 • మథియాస్ రస్ట్
 • సదానంద
 • సచినందన స్వామి

మూలాలు[మార్చు]

 1. "Religionszugehörigkeiten in Deutschland 2017".
 2. "Religionen & Weltanschauungsgemeinschaften in Deutschland: Mitgliederzahlen – REMID – Religionswissenschaftlicher Medien- und Informationsdienst e.V." (in జర్మన్). Retrieved 2021-07-12.
 3. Martin Baumann (April 2001). "Disputed Space for Beloved Goddesses". Martin Baumann (2001 International Conference at LSE). Retrieved 24 July 2012.
 4. "Construction Starts on Berlin's First Hindu Temple". Spiegel Online. Germany. 11 February 2007.
 5. "A New Hindu Temple for Germany". Spiegel Online. Germany. 23 March 2009.
 6. "Mitgliederzahlen: Hinduismus – REMID – Religionswissenschaftlicher Medien- und Informationsdienst e.V." (in జర్మన్). Retrieved 2021-07-12.
 7. "First translation of the Gita". The Hindu (in Indian English). 2017-11-11. ISSN 0971-751X. Retrieved 2021-07-12.
 8. "Feature: The Hindu Diaspora within Continental Europe". Hinduism Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-01-01. Retrieved 2021-07-12.
 9. Blogger, Balinese (2008-09-28). "Bali "The Truly Of Paradise": The First Temple in Hamburg Germany". Bali "The Truly Of Paradise". Retrieved 2021-07-12.
 10. "Balinese Hinduism in Germany". Bali blogs.{{cite web}}: CS1 maint: url-status (link)