జవలాకర్ ఉమాదేవి
గౌరవనీయులైన శ్రీమతి జస్టిస్ జవలాకర్ ఉమాదేవి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి | |
Assumed office 2017, జనవరి 17 | |
Nominated by | జగదీష్ సింగ్ ఖేహర్ |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అనంతపురం, ఆంధ్రప్రదేశ్ | 1959 సెప్టెంబరు 26
కళాశాల | శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం |
జవలాకర్ ఉమాదేవి (జననం 26 సెప్టెంబర్ 1959) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి.[1] 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను విమర్శించే సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (భారతదేశ సమాఖ్య దర్యాప్తు సంస్థ)ని ఆదేశించడం ద్వారా, న్యాయవ్యవస్థపై దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాజకీయ ప్రముఖులతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించడం ద్వారా ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించింది.[2]
జీవితం
[మార్చు]ఉమాదేవి 1959లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జవలాకర్ జ్ఞానోబరావు, జవలాకర్ తులసీబాయి దంపతులకు జన్మించింది. ఆమె 1982లో అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ పట్టా పొందింది. 1986లో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పట్టా పొందింది. ఆమె చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని కూడా సంపాదించింది.[1]
కెరీర్
[మార్చు]ఉమాదేవి 1986లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో చేరి, మొదట అనంతపురంలోని జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేసింది. ఆమె 1996లో జిల్లా న్యాయమూర్తిగా నియమితురాలయింది. కర్నూలు, మదనపల్లె, వరంగల్, విశాఖపట్నం, హైదరాబాద్‌తో సహా అనేక ప్రదేశాలలో ప్రధాన జిల్లా న్యాయమూర్తిగా పనిచేసింది. తరువాత ఆమె హైదరాబాద్‌లోని చిన్న కేసుల న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలయింది.[1]
2017, జనవరి 17న, ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలయింది.[1]
2020 అక్టోబరులో, ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఉమాదేవి, మరో న్యాయమూర్తి రాకేష్ కుమార్, ఈ సోషల్ మీడియా పోస్టుల వెనుక 'కుట్ర' ఉందా అని నిర్ధారించడానికి వాటిని పరిశీలించి, రెండు నెలల్లో వారికి నివేదిక సమర్పించాలని భారతదేశ సమాఖ్య దర్యాప్తు సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించారు.[3] ఉమాదేవి, కుమార్ కూడా ఈ సోషల్ మీడియా పోస్టులు చేసే వ్యక్తులపై, తన అభీష్టానుసారం, నేర ప్రక్రియను ప్రారంభించే పోలీసు పత్రం అయిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను దాఖలు చేయడానికి సిబిఐకి అధికారం ఇచ్చారు.[2] ఉమాదేవి, కుమార్ ఈ విమర్శలను "ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం" అని అభివర్ణించారు.[4] ఈ ఉత్తర్వు విస్తృతంగా నివేదించబడింది.[5][6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Hon'ble Mrs. Justice J. Uma Devi". Andhra Pradesh High Court.
- ↑ 2.0 2.1 Staff Reporter (2020-10-12). "A.P. HC orders CBI probe into social media posts on judges". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-11-03.
- ↑ "Andhra Pradesh HC orders CBI probe over social media posts against the Judiciary". The New Indian Express. Retrieved 2020-11-03.
- ↑ "Andhra HC orders CBI probe into anti-judiciary remarks by YSRCP leaders". mint (in ఇంగ్లీష్). 2020-10-12. Retrieved 2020-11-03.
- ↑ PTI (2020-10-13). "Andhra Pradesh HC orders CBI probe into posts against judges on social media". ThePrint. Retrieved 2020-11-03.
- ↑ "Andhra Pradesh HC Says Persons in High Posts 'Waging War' Against Judiciary, Orders CBI Probe". The Wire. Retrieved 2020-11-03.
- ↑ "Andhra HC orders CBI to act against YSR leaders, others who attacked judges on social media". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-10-12. Retrieved 2020-11-03.
- ↑ Service, Tribune News. "Andhra Pradesh HC orders CBI probe into social media comments by YSRCP leaders". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-11-03.