Jump to content

జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్

వికీపీడియా నుండి

జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్ (ఆంగ్లం: Jawaharlal Nehru Fellowship), అనేది భారతదేశంలోని పరిశోధనలు చేస్తున్న భారతీయ పౌరులకు న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ జవహర్‌లాల్ నెహ్రూ స్మారక నిధి ప్రదానం చేసే ఫెలోషిప్.[1][2]

ఫెలోషిప్ అనేది ప్రత్యేక అధ్యయనాలకు మాత్రమే పరిమితం కాదు, సహజ శాస్త్రాల రంగంలో అలాగే మానవీయ శాస్త్రాలలో పరిశోధనలకు ప్రదానం చేయబడుతుంది.

జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్ ను 1968లో జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జెఎన్ఎంఎఫ్) ప్రారంభించింది.[3]

ఫెలోషిప్ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నెలవారీ స్టైపెండ్ ను అందచేస్తారు. ఇలా అందచేసిన లక్షరూపాయలకు భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, 1961 యు/ఎస్ 10 (17A) ప్రకారం గ్రహీతకు ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఇతర అదనపు ఆర్థిక అవసరాలు నెలకు 75 వేల రూపాయల వరకు ఉంటాయి.

1964లో భారతదేశం మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణించిన తరువాత ఆయనకు నివాళిగా 1966లో బర్మాకు చెందిన అడ్మిరల్ లార్డ్ మౌంట్ బాటన్ చేత జవహర్‌లాల్ నెహ్రూ ట్రస్ట్ స్కాలర్‌షిప్ (Jawaharlal Nehru Trust Scholarship U.K.) స్థాపించబడింది.

ఈ స్కాలర్‌షిప్ కు యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ లో నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్ నిధులు సమకూర్చింది. ఇది ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డమ్ లో చదువుకోవడానికి ఒక సంవత్సరం పాటు ఉండేది.

1970లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంనకు చెందిన క్లారెండన్ ప్రయోగశాలలో డాక్టర్ కర్ట్ మెండెల్సన్ తో కలిసి పనిచేయడానికి తక్కువ ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం (Low Temperature Physics) కోసం కాన్పూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డాక్టర్ వినోద్ కుమార్ చోప్రాకు స్కాలర్‌షిప్ లభించింది.

ఆయన స్కాలర్‌షిప్ పదవీకాలం సెప్టెంబరు 1970 నుండి అక్టోబరు 1973 వరకు 3 సంవత్సరాలకు పొడిగించబడింది.

అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భారతదేశం నుండి స్కాలర్‌షిప్ చైర్పర్సన్ గా ఉన్నది, యుకె డిప్యూటీ ఛైర్మన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎంపిక చేసిన తరువాత ఆమె వ్యక్తిగతంగా అభ్యర్థితో ఇంటర్వ్యూ చేసేది.

ఈ స్కాలర్‌షిప్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. బకింగ్‌హామ్ ప్యాలెస్ గార్డెన్ లో నిర్వమించే పార్టీలో యునైటెడ్ కింగ్‌డమ్ రాజు అందజేసి సత్కరిస్తాడు. వార్షిక నెహ్రూ స్మారక ఉపన్యాసాలకు కూడా వారిని ఆహ్వానిస్తారు. 

వైస్ అడ్మిరల్ సర్ రోనాల్డ్ బ్రోక్మన్, లార్డ్ బట్లర్, సర్ గ్రాహం క్లిఫోర్డ్ వంటి మరికొందరు ప్రముఖులు యుకెలోని ట్రస్ట్ గవర్నర్లు. వివిధ అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యే వారికి మద్దతు ఇవ్వడంలో ట్రస్ట్ చాలా ఉదారంగా ఉండేది.

గ్రహీతల పాక్షిక జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nirupama Rao awarded Jawaharlal Nehru Fellowship". The Economic Times. 12 November 2014. the original నుండి 16 November 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-07-18.
  2. "Mushirul Hasan bags Nehru fellowship". The Hindu. 15 November 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-07-22.
  3. "About Jawaharlal Nehru Fellowships". Jawaharlal Nehru Memorial Fund. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 January 2019.