జశ్వంత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జశ్వంత్‌ సింగ్‌ (జననం: 1938 జనవరి 3) భారత రాజకీయ నాయకుడు, డార్జిలింగ్ నియోజకర్గం నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు. జన్మస్థలం:రాజస్తాన్‌.నియోజకవర్గం:డార్జిలింగ్‌.గతంలో వృత్తి:సైనిక ఉద్యోగి.చదువు:మాయో కాలేజీ, నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ. నిర్వహించిన పదవులు:ఆర్థికమంత్రి, విదేశీ వ్యవహారాలమంత్రి.

పుస్తకాలు, వివాదాలు[మార్చు]

బిజేపిలో ఆయన సీనియర్‌ నేత. బిజేపిలో అగ్రనేతగానే కాకుండా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆయన పాకిస్తాన్‌ నేత మహమ్మద్‌ ఆలీ జిన్నా గురించి రాసిన జిన్నా: ఇండియా, పార్టిషన్‌, ఇండిపెండెన్స్ పుస్తకం సంచలనం సృష్టించడమే కాదు. ఏకంగా ఆయనను పార్టీనుండి బయటకు పంపేవరకూ వెళ్లింది. దేశవిభజనకు ఖ్వాదీ ఆజం, మహమ్మద్‌ అలీ జిన్నాల కంటే కూడా కాంగ్రెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌లే మరింత కారణమని వ్యాఖ్యానించారు. జిన్నా వ్యక్తిత్వం నన్నెంతో ఆకట్టుకుంది. అదే నా పుస్తకంలో ప్రతిఫలించింది. ఆ వ్యక్తిత్వమే నన్ను గనుక ఆకట్టుకో కుంటే, నేనసలు ఈ పుస్తకమే రాసేవాడిని కాదు. స్వతంత్ర భారతదేశం కోసం ఆయన బ్రిటిష్‌ వారితో పోరాడడమే కాకుండా భారతదేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతో శ్రమించారు అన్నారు. భారతీయ ముస్లింలు నేడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ‘భారత్‌లో నివసిస్తున్న ముస్లింల కళ్ళ లోకి చూడండి. తాము ఏ దేశానికి చెందారో అక్కడే వారు పరజాతీయుల్లా బతుకుతున్నారు’ అంటూ వ్యాఖ్యా నించారు. 2006 జూలైలో ఆయన ‘'ఎ కాల్‌ టు హానర్‌: ఇన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఎమర్జెంట్‌ ఇండియా'’ పుస్తకంలో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో సీఐఏ ఏజెంటు ఒకరు ఉన్నారని జస్వంత్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు ఆయన కాందహార్‌ వెళ్ళారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండిన రెండు సందర్భాల్లోనూ ఆయన కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైంది యూనిట్‌ ట్రస్ట్ ఆఫ్‌ ఇండియా పునర్‌నిర్మాణం. 1938 జనవరి3 న జన్మించిన జస్వంత్‌, ఆరెస్సెస్‌ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. 1998లో భారత అణుపరీక్ష అనంతరం, అమెరికాతో దెబ్బ తిన్న సంబంధాలను పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. చర్చల్లో, దౌత్యకార్యాల్లో ఆయన నైపుణ్యాలను ఎంతోమంది ప్రశంసించారు. భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన అనంతరం దెబ్బ తిన్న భారత్‌-పాక్‌ సంబంధాలను పూర్వస్థితికి తేవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. సైనికాధికారిగా పనిచేసిన అనుభవం ఉండడంతో, సైనిక అంశాలపై ఆయన ఎంతో మక్కువ చూపేవారు. రాజస్థాన్‌కు చెందిన జస్వంత్‌, పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్‌ నుంచి కూడా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన విజయానికి గూర్ఖాజన ముక్తి మోర్చా అందించిన తోడ్పాటు కూడా కారణమైంది. కేంద్రంలో బీజేపీ 13 రోజుల పాలనలో ఆయన ఆర్థికశాఖ మంత్రి పదవి చేపట్టారు. ఆధునిక భావాలు కలిగిన ఉదార ప్రజాస్వామ్య వాదిగా జస్వంత్‌ పేరొందారు.

మూలాలు[మార్చు]