Jump to content

జహీరాబాద్

అక్షాంశ రేఖాంశాలు: 17°40′45″N 77°37′00″E / 17.679046°N 77.616584°E / 17.679046; 77.616584
వికీపీడియా నుండి
(జహీరాబాద్ (M) నుండి దారిమార్పు చెందింది)
జహీరాబాద్ (పట్టణం )
—  పురపాలక సంఘం  —
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి
జహీరాబాద్ (పట్టణం ) is located in తెలంగాణ
జహీరాబాద్ (పట్టణం )
జహీరాబాద్ (పట్టణం )
అక్షాంశరేఖాంశాలు: 17°40′45″N 77°37′00″E / 17.679046°N 77.616584°E / 17.679046; 77.616584
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం జహీరాబాద్
ప్రభుత్వం
 - Type పురపాలక సంఘం
 - మేయర్
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

జహీరాబాద్ (M), తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ఒక పెద్ద పట్టణం.[1]ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదునుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది.

భౌగోళికం

[మార్చు]

జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు 17°41′N 77°37′E / 17.68°N 77.62°E / 17.68; 77.62.[2] సగటు ఎత్తు 622 మీటర్లు (204 అడుగులు).ఇక్కడి నుండి కర్ణాటక రాష్ట్ర్రం లోని బీదర్ పట్టణం 31 కి.మీ. దూరంలో ఉంది.

వృత్తులు, పరిశ్రమలు

[మార్చు]

చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఊటీగా పేరొందిన గొట్టం గుట్ట ప్రాంతం ఇక్కడికి సమీపంలోనే ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

దేవాలయాలు

[మార్చు]
  • సాయినాథుని మందిరం: సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.
  • కేతకి సంగమేశ్వర ఆలయం: జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర దేవాలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసి గంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ధి. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ధి. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.

ఇతర వివరాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Falling Rain Genomics, Inc - Zahirabad
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-09.
  4. telugu, NT News (2022-02-21). "CM KCR | సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  5. Velugu, V6 (2022-02-21). "సంగమేశ్వర్,బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. telugu, NT News (2022-06-22). "నేడు జహీరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం". Namasthe Telangana. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.
  7. telugu, NT News (2022-06-23). "ఈవీ కేంద్రం తెలంగాణ". Namasthe Telangana. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
  8. Ayyappa, Mamidi (2023-04-24). "Telangana: ఎలక్ట్రిక్ బ్యాటరీల యూనిట్‌కు మంత్రి KTR శంకుస్థాపన.. వేల మందికి ఉపాధి..!". www.telugu.goodreturns.in. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.
  9. "'మహీంద్రా'లో ఈవీ బ్యాటరీల యూనిట్‌". EENADU. 2023-04-24. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.

వెలుపలి లంకెలు

[మార్చు]