జాంనగర్ జిల్లా
Jump to navigation
Jump to search
జాంనగర్ జిల్లా Jamnagar | |
---|---|
Coordinates: Coordinates: Unknown argument format | |
Population (2001) | |
• Total | 1,904,278 |

Districts of Saurastra, Gujarat
జాంనగర్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది గుజరాత్ పశ్చిమభాగాన కచ్చ్ సింధూశాఖకు దక్షిణ ఒడ్డున ఉంది. చారిత్రకంగా ప్రసిద్ధిచెందిన ద్వారక పట్టణం ఈ జిల్లాలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 19,04,278. జిల్లాలో ఒక జాతీయపార్కు, ఒక పక్షి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. జాంనగర్ పట్టణం ఈ జిల్లాకు ప్రధానకేంద్రము.
సరిహద్దులు[మార్చు]
జాంనగర్ జిల్లాకు ఉత్తరాన కచ్ సింధూశాఖ ఉండగా, పశ్చిమాన [[అరేబియా మహాసముద్రము, దక్షిణమున పోరుబందర్, రాజ్‌కోట్ జిల్లాలు, తూర్పున రాజ్‌కోట్ జిల్లా సరిహద్దుగా ఉన్నది.
ప్రధాన పట్టణాలు[మార్చు]
జాంనగర్ జిల్లాలో ద్వారక, ఓఖా, కళ్యాణ్‌పూర్, కలవాడ్, లింబ్డి, భన్వాడ్, ఖంబాలియాలు ప్రధాన పట్టణాలు.