జాజఱ పాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జాజఱలను పేరు తెలుగులో తొలిసారి పాల్కూరికి సోమనాథుడు వాది అతని కాలమునాటికి జాజఱ పాటలు వాదుకలో నుండినట్లు తెల్పినాడు. అయితే ప్రభాకరశాస్త్రిగారు అన్నమాచార్య చరిత్ర పీఠికలో చెప్పినట్లు, షోడశ పాత్రలు కలిగి రెండు రెండు ప్రాసలుగల 'చర్చరి అన్న ప్రాకృతుల పదమే జాజర గా వ్యాప్తి చెందియుండవచ్చును. జాజర అంటే (ద్రవ్యరూపమైన) సుగంధ ద్రవ్యమని అన్నమయ్య పదాల ద్వారా కూడా తెలుసుకోవచ్చును. నాచన సోమన చెప్పిన " వీణా గానము వెన్నెల తేట| రాణమీరగా రమణుల పాట ప్రాణమైన పిన బ్రాహ్మణువీట| జాణలు మెత్తురు జాజఱపాట " కూడా పదహారు మాత్రలుగల పాదాలూ, రెండు ప్రాసలూ కలిగి ఈ లక్షణానికి సరిపోతుంది. అయితే ఈపాటలలోని ప్రత్యేకత, సంగీత లక్షణ గ్రంధాలు సావసంతోత్సవే అని చెప్పిన జాజఱ పాటలు పాడే సన్నివేశాన్ని "వీణాగానమూ, వెన్నెల తేటా, రమణుల పాటా, జాణల మెప్పూ" చెప్పి చక్కగా వివరించడము అని తగుర్తించుకోవాలి.

అన్నమయ్య (1424-1503) తన కాలానికి వాడుకలోనున్న ఇతర పల్లెల పదాలతో పాటు జాజఱ పాటలను కూడా రచించి వీటి నైజమును చక్కగా వివరించినాడు. పూర్వులు హిందోళ రాగము లో రచిస్తే అన్నమయ్య ముఖారి హిందోళ వసంతము లోనూ రచించినాడు.

చాలుచాలు నీ జాజఱ, నన్ను
జాలి బఱచే నీ జాజఱ. "ముఖారి"
జగడపుం జనవుల జాజఱ
నగినల మంచపు జాజఱ "హిందోళ వసంతము"

జానపదుల గేయములకు రాగనిర్దేశ ముండదు. రాగనిషేధమూ ఉండదు. కనుక అభిలషితార్థ చింతామణి కాలానికి హిందోళము లో నుండిన జాజఱ అన్నమయ్య నాటికి రాగము మార్చుకోవడము జరిగినది. జాజఱ పాటల సందర్భము అన్నమయ్య పదాలలో చక్కగా తెలిసిపోతుంది. వెంకటపతిపై వెలదుల నించేరు | సంకు మదంబుల జాజఱ అన్న పాదాలు జాజర అంటే (ద్రవ్యరూపమైన) సుగంధ ద్రవ్యమని చెప్పేస్తున్నాయి. దీనిలో కస్తూరి, పుప్పొడి, సుగంధ ద్రవ్యాలు చేరీ ఘుమఘుమలాడిస్తాయి. ఈ జాజరాటకు వీణాగానమూ, వెన్నెల తేట, రమణుల పాటా చేరి అందగిస్తాయి.

నేటికీ తెలంగాణ పు పల్లెటూళ్ళలో కాముని పున్నమపండుగ సందర్భాన ....జాజఱ పాటలు కోలాటము పాటలూ పురుషులు పాడుకుంటారు అని వదంతి.

జాజిరి జాజిరి జాజిరి జాజి
జాజిరాడబోతే జొన్నిత్తు దొరికె

అన్నవి ఒకదానిలోని తెండు పంక్తులు. ఈ పక్తులు "కిటతక కిటతక కిటతక కిటతక" అని చతురశ్రగతిలో నడుస్తాయి. మన కోలాటపు పాటలలో "గొల్లవారి వాడలకు కృష్ణమూరితీ, నీ, వేమి పనికొచ్చినావు కృష్ణమూరితీ" అని చాలా మటుకు చతురశ్రగతిలోనే ఉంటాయి.

మొగ్గగాదురో మోదుగునీడ
నీడగాదురో నిమ్మలబావి
బావిగాదురో బసుమంతకూర 
కూరగాదురో కుమ్మరిమేను.

దీనిలో జాజర పాటకున్న లక్షణాలు కనిపిస్తాయి. మన వాడుకలో జాజర పూర్తిగా దిగిపోయి "కాళ్ళాగజ్జా కంకాళమ్మా, వేగూచుక్కా వెలగామొగ్గా, మొగ్గాగాదు మోదుగనీడ, నీడాగాదూ నిమ్మలవామి, వామిగాదు వామింటికూర, కూరాగాదూ గుమ్మడిపండు, పండూ కాదూ పాపాయికాలూ, కాలుతీసి గట్టునపెట్టు" అన్న పిల్లల వినోదపుపాటగా మారిపోయింది ఈ జాజర పాట.