జాతక ఫలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతక ఫలం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్. నాగేంద్ర రావు
తారాగణం యస్వీ రంగారావు,
చలం,
ఆర్. నాగేంద్రరావు,
చంద్రకుమారి,
సూర్యకళ
సంగీతం ఆర్. గోవర్ధనం
గీతరచన తోలేటి
సంభాషణలు తోలేటి
నిర్మాణ సంస్థ ఆర్. ఎన్. ఆర్ .పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

చిన్నతనంలో స్నేహితులైన నాగేంద్రరావు (ఆర్.నాగేంద్రరావు), రంగారావు (ఎస్.వి.రంగారావు) తలవని తలంపుగా ఒకచోట కలుసుకుంటారు. నాగేంద్రరావు కుమార్తె లక్ష్మి (సూర్యకళ). లక్ష్మిని తన తమ్మునికిచ్చి పెళ్ళి చేయాలని నాగేంద్రరావు భార్య పోరు పెడుతుంటుంది. రంగారావు కుమారుడైన సూర్యానికి (చలం) తన అన్న కూతురునిచ్చి పెళ్ళి చేయాలని రంగారావు భార్య (ఋష్యేంద్రమణి), చెల్లెలు (సూర్యకాంతం) తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయాలని రంగారావును వేధిస్తూ ఉంటారు. ఈ సంబంధాలు తమకు నచ్చనందున మిత్రులిద్దరూ తామే వియ్యమందాలని నిర్ణయించుకుంటారు. ఈ సంబంధాల్ని తప్పించడానికి తామే జ్యోతిష్యుల వేషాలు వేసుకుని జాతకాలు కలవలేదు కనుక ఈ సంబంధాలు పనికిరావని అందరినీ నమ్మిస్తారు. ఆ పైన సూర్యం, లక్ష్మి జాతకాలు చక్కగా కుదిరాయని చెప్పి వారిద్దరికీ పెళ్ళి చేస్తారు. కాని లక్ష్మి మీద ఆశలు పెట్టుకున్న నాగేంద్రరావు బావమరిది కాళేశ్వరరావు (జోగారావు) తన ఆశలకు అడ్డం వచ్చి సూర్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. అడ్డం వచ్చిన లక్ష్మిని గాయపరుస్తాడు. ఈలోగా పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకుపోతారు. గాయపడిన లక్ష్మి తనకు పెళ్ళి అయిన మూడు నెలలలోగా చావున్నదని జ్యోతిష్కుడు చెప్పిన మాటను వినడం తటస్థించి అందరూ తనను మోసం చేశారనుకుని దిగులుపడుతుంది. చివరకు ఈ జాతకాలన్నీ చెప్పింది నిజమైన జ్యోతిష్కులు కాదని నాగేంద్రరావు, రంగారావులు కలిసి ఆడిన నాటకమేనని తెలిసి కథ సుఖాంతమవుతుంది.

పాటలు[మార్చు]

  1. అందమైన సంసారం బండికి - ఘంటసాల - రచన: తోలేటి
  2. ఆశకు అంతం లేదే సిరులకు పరిమితి యేదే
  3. ఏలా దిగులేల యీ కాలం మారునులే మరువకే
  4. జగమే సుధా ప్రణయము కదా సోగాసగు పూవులతో
  5. నిగనిగ మెరుగుల జిలుగు వెలుగులే నిగిడి నెగడే
  6. పెళ్ళే ఆనందం పెళ్ళిళ్ళే ఆనందం పెళ్ళి చేసుకొని దంపతులిద్దరూ
  7. మదిలో భావములో మృదు వీణా రావములో
  8. మహోదయం నవోదయం శుభోదయం ప్రపంచ శాంతికి
  9. మోహన కృష్ణా రారా నవ మోహన కృష్ణా రారా
  10. లోకులు కాకులే లోకమే మాయ మాయ మాటలలోన
  11. సంగీత సాహిత్య సమ లోచనీ నీదు చరణములే నమ్మితి
  12. సిరిగలవారికి తగునటెయీపని నిను గని నగరే చెలియా

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జాతక_ఫలం&oldid=3474580" నుండి వెలికితీశారు