జాతీయ అగ్నిమాపక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ అగ్నిమాపక దినోత్సవం
జాతీయ అగ్నిమాపక దినోత్సవం
1994లో ముంబాయి అగ్నిప్రమాదంలో వెలువడిన పొగ
జరుపుకొనే రోజుఏప్రిల్ 14
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

జాతీయ అగ్నిమాపక దినోత్సవం (జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవం) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. 1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నారు.[1][2]

ప్రారంభం[మార్చు]

1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులోని విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతోసహ 66మంది మరణించగా, 87మంది గాయపడ్డారు. ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.[3]

ఉద్దేశ్యం[మార్చు]

అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి, తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం[4]

కార్యక్రమాలు[మార్చు]

ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కలిపించేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు.[5]

  1. ఏప్రిల్‌ 14: అమరవీరులకు నివాళులు, ఏప్రిల్‌ 15: బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లలో అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన, ఏప్రిల్‌ 16: అపార్ట్‌మెంట్లలో అవగాహన సదస్సులు, ఏప్రిల్‌ 17: విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్‌ 18: ఎల్‌పీజీ గూడౌన్స్, ఆయిల్‌ ఫర్మ్స్‌లో అవగాహన సదస్సులు, ఏప్రిల్‌ 19: ఆస్పత్రుల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్‌ 20: అన్ని వర్గాల ప్రజలకు ఫైర్‌ సేఫ్టీపై వర్క్‌షాప్‌ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
  2. డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి దేశంలోని అగ్నిమాపక కేంద్రాల వద్ద నివాళి అర్పించి, గౌరవ సూచకంగా అగ్నిమాపక సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనాన్ని పాటిస్తారు.
  3. బస్టాండ్, రైల్వేస్టేషన్, పార్కు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, ఆస్పత్రులు, గ్యాస్ గోడౌన్, పరిశ్రమలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు.

మూలాలు[మార్చు]

  1. The Hindu, City (14 April 2018). "National Fire Service Day observed". The Hindu (in Indian English). Archived from the original on 25 జూన్ 2018. Retrieved 14 April 2020.
  2. ప్రజాశక్తి, తాజావార్తలు (14 April 2018). "అగ్నిమాపక శాఖ ఇచ్చే సూచనలు ప్రజలు పాటించాలి: కొల్లు". Archived from the original on 14 ఏప్రిల్ 2018. Retrieved 14 April 2020.
  3. వి6 వెలుగు, హైదరాబాదు (14 April 2019). "ప్రమాదాలు తప్పించుకోండిలా..! : ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు". Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.
  4. నవతెలంగాణ, నిజామాబాదు (14 April 2016). "అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరం". NavaTelangana. Retrieved 14 April 2020.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 April 2016). "అప్రమత్తతే అగ్ని ప్రమాదాలకు నివారణ". www.andhrajyothy.com. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.