జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
గ్రామపంచాయతి కార్యాలయం, మోత్కూర్
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2010
జరుపుకొనే రోజు24 ఏప్రిల్
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న భారతదేశంలో ప్రతి ఏట నిర్వహిస్తారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంకోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1][2]

ప్రారంభం[మార్చు]

1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి అమలులోకి వచ్చింది.[3] భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010, ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు.[4] పంచాయితీ రాజ్ సంస్థలు (పిఆర్ఐలు) సక్రమంగా పనిచేసి, గ్రామస్తుల అభివృద్ధి ప్రక్రియలో పాల్గొంటే ఆయా గ్రామాలు మావోయిస్టుల బెదిరింపును ఎదుర్కొవచ్చని ఆయన పేర్కొన్నాడు.

2015, ఏప్రిల్ 24న జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎన్నికైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళా సర్పంచులు వారివారి బాధ్యతలను భర్తలకు అప్పగించకూడదని, వారి పనుల విషయంలో భర్తల ప్రభావం ఉండకుండా చూసుకోవాలని పిలుపునిచ్చాడు.[5][6][7]

కార్యక్రమాలు[మార్చు]

ఈ రోజున ఆదర్శ గ్రామంగా నిలిచిన గ్రామ పంచాయితీలను, గ్రామ సభలను శక్తీకరణ్ అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ అవార్డులతో సత్కరిస్తారు.

  • 2016: 2016 పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్‌లో భాగంగా జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్లో జాతీయ సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 3000 పంచాయతీ ప్రతినిధులు హాజరయైన ఈ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్, ఉత్తమ పనితీరు కనబర్చిన గ్రామ సభలకు రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్‌లు ప్రధానం చేయబడ్డాయి. ఈ అవార్డులను 183 పంచాయతీలకు, 124 గ్రామ పంచాయతీలకు అందజేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు ఏర్పాటు, విద్యుత్, విద్య-ఆరోగ్య-సామాజిక కార్యక్రమాలు, హరితహారం, మౌలికసదుపాయాల కల్పన, గ్రామ సభల నిర్వహణ వంటి 8 అంశాలను పరిశీలనలోకి తీసుకొని ఈ అవార్డులను ఎంపికచేయడం జరిగింది.[8]
  • 2018: 2018 జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో బహిరంగ సభ జరిగింది. గిరిజనులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల్ని వినడమే కాకుండా తదనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుందని, అత్యాచారాలకు మరణశిక్ష విధించేలా నిబంధనల్ని తెచ్చామని అని అన్నారు.[9]

మూలాలు[మార్చు]

  1. PM Modi to address conference on National Panchayati Raj Day, Zee News, 24 April 2015, retrieved 24 April 2019
  2. "PM Modi to address conference on National Panchayati Raj Day". Yahoo News. 24 April 2015. Archived from the original on 23 April 2019. Retrieved 24 April 2019.
  3. ఆంధ్రజ్యోతి, తూర్పు గోదావరి (24 April 2019). "రాజ్యాంగ సవరణతో పంచాయతీ వ్యవస్థ పటిష్టం". Archived from the original on 25 April 2019. Retrieved 25 April 2019.
  4. "24 April: National Panchayati Raj Day". Jagran Josh. 22 October 2010. Retrieved 24 April 2019.
  5. "End 'sarpanch pati' practice, says Modi". The Hindu. 25 April 2015. Retrieved 24 April 2019.
  6. "PM Modi to address conference on National Panchayati Raj Day". Business Standard. 24 April 2015. Retrieved 24 April 2019.
  7. "PM's remarks on National Panchayati Raj .Day". narendramodi.in. Narendra Modi's Blog. Retrieved 24 April 2019.
  8. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (25 April 2016). "గ్రామీణ వెలుగుదివ్వెలు". Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.
  9. సాక్షి, జాతీయం (25 April 2018). "ఆర్డినెన్స్‌తో చిత్తశుద్ధి చాటుకున్నాం". Archived from the original on 25 April 2019. Retrieved 25 April 2019.

వెలుపలి లంకెలు[మార్చు]