జాతీయ పసుపు బోర్డు
స్థాపన | 2025 జనవరి 14 |
---|---|
రకం | భారత ప్రభుత్వ సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | నిజామాబాద్, తెలంగాణ |
చైర్మన్ | పల్లె గంగారెడ్డి |
మాతృ సంస్థ | భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
జాతీయ పసుపు బోర్డు (ఎన్‌టీబీ) భారత ప్రభుత్వంలోని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్ర ఏజెన్సీ. తెలంగాణ రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించగా 2023 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వగా,[1] 2025 జనవరి 14న నిజామాబాద్‌లో ప్రధాన కార్యాలయంగా జాతీయ పసుపు బోర్డు (NTB)ని న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ద్వారా కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బిజెపి ఎంపి డి. అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,[2] స్పైస్ బోర్డు డైరెక్టర్ రెమశ్రీ తదితరులు పాల్గొన్నారు.[3]

విధులు
[మార్చు]- కేంద్ర ప్రభుత్వంచే నియమించబడే ఛైర్‌పర్సన్ .
- వాణిజ్య శాఖచే నియమించబడే కార్యదర్శి .
- కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం & రైతుల సంక్షేమం, వాణిజ్యం & పరిశ్రమల శాఖల సభ్యులు.
- పసుపు పండించే మొదటి రెండు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, మేఘాలయ రాష్ట్రం నుండి ప్రతినిధులు. రాష్ట్రాలు రొటేషన్ ద్వారా బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తాయి .
- పరిశోధనలో పాలుపంచుకున్న జాతీయ/రాష్ట్ర సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
జాతీయ పసుపు బోర్డు (ఎన్‌టీబీ) కొత్త పసుపు ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, విదేశాలలో మార్కెటింగ్ కోసం పసుపు సంబంధిత ఉత్పత్తుల విలువ జోడింపును అందిస్తుంది. పసుపు ఆవశ్యకత, వైద్య లక్షణాలు, దాని దిగుబడిని పెంచే మార్గాలు, కొత్త మార్కెట్‌లలోకి వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి లాజిస్టిక్స్, సరఫరాను పెంచడం వంటి వాటిపై అవగాహన కల్పించడాన్ని కూడా బోర్డు పరిశీలిస్తుంది.
ప్రస్థానం
[మార్చు]స్వదేశీ జాగరణ్ మంచ్ పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ 2006 నుండి ఉద్యమం ప్రారంభించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ డిమాండ్ హైలైట్ అయ్యి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత 2017 ఆగష్టులో ప్రధాని మోదీని కలిసి ఈ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకవెళ్ళింది. ధర్మపురి అరవింద్ 2017లో బీజేపీలో చేరిన అనంతరం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని 2019 లోక్‌సభ ఎన్నికల్లో బాండు పేపర్ పై రాసి హామీ ఇచ్చి ఆ ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఆ తరువాత ఆయన (2019 – 2024) హయాంలో పూర్తి స్థాయి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయిన దానికి సంబంధించిన ఇతర కార్యాలయాలు వచ్చాయి. 2020 జనవరిలో నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేశారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించగా 2023 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వగా,[4] 2025 జనవరి 14న నిజామాబాద్‌లో ప్రధాన కార్యాలయంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[5] ఈ కార్యక్రమంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, ఎన్‌టీబీ చైర్మన్ పల్లె గంగారెడ్డి,[6] స్పైస్ బోర్డు డైరెక్టర్ రెమశ్రీ, ఎమ్మెల్యేలు పైడి రాకేష్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, దేశంలోని పలు ప్రాంతాల నుంచి పసుపు రైతులు, అధికారులు పాల్గొన్నారు.[7]
ప్రయోజనాలు
[మార్చు]- పంటకు నిర్ణీత మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంటుంది.
- పసుపు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
- పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు అవుతాయి.
- పసుపును నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీ కేంద్రాలను నిర్మించే అవకాశాలున్నాయి.
- నాణ్యమైన వంగడాల రూపకల్పనకు పరిశోధనలు జరుగుతాయి.
- సాగులో ఆధునిక పద్ధతుల , యాంత్రీకరణ వైపు అడుగులేస్తారు.
- సాగు ప్రోత్సాహానికి రాయితీలు పెరుగుతాయి.
- మార్కెటింగ్ సౌకర్యాలు వృద్ధి చెందుతాయి.
- కర్షకుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి వేదిక దొరుకుతోంది.
మూలాలు
[మార్చు]- ↑ "నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఇక్కడి రైతులకు కలిగే ప్రయోజనం ఏంటంటే." BBC News తెలుగు. 14 January 2025. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి బాధ్యతల స్వీకారం". Eenadu. 1 February 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "Piyush Goyal launched National Turmeric Board with Nizamabad headquarters" (in Indian English). The Hindu. 15 January 2025. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Centre notifies establishment of National Turmeric Board" (in ఇంగ్లీష్). Telangana Today. 4 October 2023. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "నెరవేరిన కల". Andhrajyothy. 16 January 2025. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Chairman for Turmeric Board appointed" (in Indian English). The Hindu. 15 January 2025. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "NTB will help increase turmeric production in TG, AP: Union Minister Piyush Goyal" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 January 2025. Retrieved 19 January 2025.