Jump to content

జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్ డిడిబి)

వికీపీడియా నుండి
జాతీయ పాడిపారిశ్రామిక అభివృద్ధి బోర్డు
స్థాపనజూలై 1965, 16; 59 సంవత్సరాల క్రితం (16-07-1965)
వ్యవస్థాపకులుడాక్టర్ వర్గీస్ కురియన్
రకంచట్టబద్దమైన సంస్థ
కేంద్రీకరణ
పాడి పరిశ్రమ నియంత్రణ

పాడి పరిశ్రమ అభివృద్ధి

కార్యస్థానం
యజమానిమత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
చైర్మన్మహేష్ షా
అనుబంధ సంస్థలు

జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) (The National Dairy Development Board (NDDB) మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) ప్రధాన కార్యాలయం గుజరాత్ రాష్ట్రము ఆనంద్ లో ఉంది.  భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ.  భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉన్నది[1]. జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి మండలిని ఒక సంస్థగా ఏర్పాటు చేసి భారత పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు.

చరిత్ర

[మార్చు]

జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్) మొదట సొసైటీస్ యాక్ట్ 1860 కింద సొసైటీగా రిజిస్టర్ చేయబడింది. 1987 అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చే ఎన్డిడిబి చట్టం 1987 (37 ఆఫ్ 1987) ద్వారా కంపెనీల చట్టం 1956 కింద ఏర్పాటు చేయబడి రిజిస్టర్ చేయబడిన మునుపటి ఇండియన్ డెయిరీ కార్పొరేషన్తో విలీనం చేయబడింది.  ఈ చట్టం ద్వారా కొత్త సంస్థ కార్పొరేట్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు. లక్షలాది మంది దిగువ పాల ఉత్పత్తిదారులకు మెరుగైన భవిష్యత్తు కోసం పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డిడిబి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా భారతదేశం ఆవిర్భవించడానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని ఉపయోగించిన "ఆపరేషన్ ఫ్లడ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా, ఈ లక్ష్యంలో విజయం  సాధించింది.   ఆపరేషన్ ఫ్లడ్ మూడవ దశ 1996 సంవత్సరంలో పూర్తయింది, అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది.

డెయిరీ బోర్డు ప్రారంభమైనప్పటి నుండి, పాల ఉత్పత్తిదారులు, వారి సహకార సంఘాలను నిర్వహించడానికి వారు నియమించే నిపుణుల చేతుల్లో పాడి అభివృద్ధిని ఉంచడం ద్వారా, భారతదేశం  పాడి కార్యక్రమాలను ప్రణాళిక చేయడం జరిగి, ఆ దిశలో నడిపించింది. అదనంగా సంస్థ ఇతర కమోడిటీ ఆధారిత సహకార సంస్థలు, అనుబంధ పరిశ్రమలు, వెటర్నరీ బయోలాజికల్స్ను ఇంటెన్సివ్, దేశవ్యాప్త ప్రాతిపదికన ప్రోత్సహిస్తుంది. సంస్థ  వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల  పర్యవేక్షణ, దిశ, నియంత్రణ నిర్వహణ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ద్వారా జరుగుతాయి. సంస్థలో సుమారు 1,000 మంది ఉద్యోగులతో,భారతదేశంలో పాడిపరిశ్రమ వ్యూహాత్మక ప్రణాళిక, నిర్వహణ, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ & ఇంజనీరింగ్, అన్ని డెయిరీ యూనియన్ లు,సమాఖ్యలకు ( ఫెడరేషన్), సొసైటీలకు సాంకేతిక సలహాలు, యాంత్రిక మద్దతు ( ప్రొఫెషనల్, టెక్నికల్ సపోర్ట్)  పశువుల ఆహరం ( యానిమల్ బ్రీడింగ్ ), వాటి  బలవర్ధకమైన పోషకాల (యానిమల్ న్యూట్రిషన్) రంగంలో పరిశోధన, అభివృద్ధి మొదలైనవి సేవలను అందిస్తుంది.

విధులు

[మార్చు]

జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డిడిబి) ఈ క్రింది అధికారాలను, విధులను కలిగి ఉంది. "నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి)" అధికారిక చట్టంలో అధికారం, విధులు చాప్టర్ 4 లో ప్రస్తావించబడ్డాయి[2].

  • ప్రణాళికలు, కార్యక్రమాల ప్రచారం
  • దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) విధి అని చట్టంలో పేర్కొన్నారు. కార్యక్రమాల అమలుపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం చేయాలి.
  • ఉత్పత్తికి ధర నిర్ణయించాలంటే. పాల అమ్మకాలు, కొనుగోళ్లకు కనీస, గరిష్ట ధరను నిర్ణయించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం.
  • ఎగుమతి, దిగుమతి ఛానలైజింగ్ ఏజెన్సీ గా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) పాలు, పాల ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతికి సంబంధించిన ఛానలైజింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. పాలు, దాని ఉత్పత్తులు మాత్రమే కాకుండా, పాడి పశువులు లేదా ఎద్దులు కూడా ఆర్థిక విలువను అందిస్తాయి.
  • సమాచార ( డేటా) సేకరణ లో జాతీయ గ్రిడ్, జాతీయ పాడి పశువుల మంద సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన డేటా, గణాంకాలను సేకరించడం, నిర్వహించడం లేదా ఇతర విషయాలలో, పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తులకు సంబంధించినవి సమాచారం సేకరిస్తుంది.

అభివృద్ధి

[మార్చు]

2012 లో, జాతీయ పాడి ప్రణాళిక (ఎన్డిపి) కార్యక్రమం కింద, జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్డిడిబి) 14 కేంద్ర పాల ఉత్పత్తి రాష్ట్రాల్లోని 40 వేల గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి అనేక ప్రణాళికలను ప్రారంభించింది. ఈ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు. పేర్కొన్న పాల ఉత్పత్తి రాష్ట్రాల్లోని సుమారు 2.7 మిలియన్ల పాడి పశువులను కవర్ చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. 2019 లో, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) దాని పరిధిని విస్తరించడానికి ప్రయత్నించింది, ముఖ్యమైన రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. . లద్దాఖ్ అధికార యంత్రాంగంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం (యుటి) లో పాడి పరిశ్రమ, ఇతర గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడం  ప్రాధమిక ఉద్దేశ్యం

2020 లో, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) గుజరాత్లోని ఆనంద్ జిల్లాలోని ముజ్కువా డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ (డిసిఎస్) లో ఎరువు నిర్వహణ ఇనిషియేటివ్ (ఎంఎంఐ) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రదేశంలో బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి, వీటిని నివాస ప్రాంతం వెలుపల పాడి రైతులు గ్యాస్ ఉత్పత్తి చేయడానికిగ్యాస్, వంట ఇంధనంగా చేయడానికి ఏర్పాటు చేశారు[2].

అనుబంధ సంస్థలు

[మార్చు]
మదర్ డైరీ పాల ప్యాకెట్ -ఢిల్లీ నగరంలో

జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డిడిబి) కు నాలుగు అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు, విధి నిర్వహణ చేస్తుంది.[3]

  • మదర్ డెయిరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ (ఎండి ఎఫ్ అండ్ వి)
  • ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, హైదరాబాద్ (ఐఐఎల్)
  • ఇండియన్ డెయిరీ మెషినరీ కంపెనీ లిమిటెడ్, ఆనంద్ (ఐడిఎంసి)
  • ఎన్డీడీబీ డెయిరీ సర్వీసెస్

మూలాలు

[మార్చు]
  1. "Dilip Rath appointed as NDDB chairman". The Times of India. 2016-12-02. ISSN 0971-8257. Retrieved 2023-02-07.
  2. 2.0 2.1 "National Dairy Development Board (NDDB): Meaning, Initiatives, Functions and more - Benefits". My India (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-06. Retrieved 2023-02-07.
  3. "SUBSIDIARIES". 7 February 2023. Retrieved 7 February 2023.