జాతీయ రహదారి (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢిల్లీ, గుర్గావ్‌లను కలుపుతూ 8వ నంబర్‌ జాతీయ రహదారి డ్యూయల్‌ క్యారేజీ సెక్షన్‌.భారతదేశంలో కంట్రోల్డ్‌ యాక్సెస్‌ ఎక్స్‌ప్రెస్‌ వే లున్నాయి.

భారతదేశంలో జాతీయ రహదారులు ప్రధానంగా ప్రాంతంలో విస్తరించి ఉండే పొడవాటి 67,000 km (42,000 mi)రోడ్డు మార్గాలు. వీటిలో200 km (120 mi) [1] మార్గాలను డ్యూయల్‌ క్యారేజీవేస్‌ (ఎక్స్‌ప్రెస్‌ వేస్‌)గా గుర్తించారు. వీటిలో ఒక్కో దిశలో రెండు, లేదా అంతకంటే ఎక్కువ లేన్లుంటాయి. జాతీయ రహదారుల్లో అత్యధికం (ఒక్కో మార్గంలో ఒకటి) అవిభాజ్యంగానే ఉంటాయి. జాతీయ రహదారులను దాదాపుగా భారత ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగతావి ప్రభుత్వ-ప్రైవేట్ పద్ధతిన ప్రైవేట్‌ రంగం ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ రోడ్ల నిర్వహణను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనే నోడల్‌ సంస్థ చూసుకుంటుంది. ఇది ఉపరితల రవాణా, హైవేల శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. భారతదేశంలోని మొత్తం రోడ్డు నెట్‌వర్కులో జాతీయ రహదారులు దాదాపుగా 2 శాతాన్ని ఆక్రమిస్తాయి. కానీ మొత్తం దేశ ట్రాఫిక్ లో 40 శాతాన్ని ఇవే చేరవేస్తుంటాయి.[2][3] ప్రస్తుతం అమలవుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం భారతదేశ జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను బాగా విస్తరించడం.

చారిత్రక జాతీయ రహదారులు[మార్చు]

దస్త్రం:Roadevol.svg
భారతదేశ రోడ్డు మార్గాల వికాసం - ప్రధాన పటం మొగలుల కాలం నుంచీ ఉన్న రోడ్డు మార్గాలను సూచిస్తుంది. ఇన్‌సెట్‌ ఏ లో పూర్వ చారిత్రక యుగం నాటి ప్రధాన సాంస్కృతిక పోకడలు, బీ లో మౌర్యులకు ముందు కాలం నాటి భారతదేశపు రోడ్డు మార్గాలు, సీ లో మౌర్యుల కాలం నాటి రోడ్డు మార్గాలు, డీ లో క్రీస్తుశకం మొదట్లోని వర్తక మార్గాలు, ఈ లో భారత జెడ్‌లను చూడవచ్చు.

పురాతన కాలంలో పాలక వర్గానికి చెందిన ప్రభువులు నగరాల్లో పలు ఇటుక రహదారులను నిర్మించేవారు. వీటన్నింట్లో మధ్యయుగపు భారతదేశంలోకెల్లా అత్యంత ప్రఖ్యాతి పొందినది గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు. ఇది బంగ్లాదేశ్‌లోనిఢాకా సమీపంలో సోనార్‌గావ్‌[4] వద్ద మొదలై పాకిస్థాన్‌లోని పెషావర్‌ వద్ద ముగుస్తుంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా; భారతదేశంలోని కోల్‌కతా, పాట్నా, వారణాసి, కాన్పూర్‌, ఆగ్రా, ఢిల్లీ, పానిపట్‌, లూధియానా, జలంధర్‌, అమృత్‌సర్‌; పాకిస్థాన్‌లోని లాహోర్‌, పెషావర్‌ వంటి భారత ఉపఖండంలోని పలు ప్రధాన నగరాలను ఇది కలుపుతూ సాగుతుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ వారు అప్పటికి ఉన్న జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను బాగా ఆధునికీకరించారు. పశ్చిమ కనుమల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేశారు.

ప్రస్తుత వ్యవస్థ[మార్చు]

భారతదేశంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌.

భారతదేశంలో 67,000 km (42,000 mi)అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్రాల రాజధానులను కలుపుతూ జాతీయ రహదారులున్నాయి. వీటిలోచాలావరకు విశాలంగా వేసిన రెండు లేన్ల రోడ్డులే. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నాలుగు లేన్లుగా, పెద్ద నగరాల వద్ద ఎనిమిది లేన్లుగా కూడా వాటిని విస్తరించారు. చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఈ రోడ్ల గుండా గుంతలు కూడా ఉండవు. కాస్త తక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అల్ప జనాభా ఉన్న ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేక, భారీ వర్షాల వాటి వల్ల గుంతలు పడిన రోడ్లు కన్పిస్తాయి. భారతదేశంలో అతి తక్కువ జాతీయ రహదారులు మాత్రమే కాంక్రీట్‌తో నిర్మించినవి. 2010 నాటికి19,064 km (11,846 mi) జాతీయ రహదారి వ్యవస్థలో ఇంకా సింగిల్‌ లేన్‌ రోడ్లున్నాయి. ప్రస్తుతం 2014 డిసెంబర్‌ నాటికల్లా మొత్తం జాతీయ రహదారి నెట్‌వర్క్‌లోని రోడ్లనూ రెండు, అంతకంటే ఎక్కువ లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.[5]

ప్రపంచంలోకెల్లా రెండో అతి ఎత్తయిన మోటార్‌ హైవే (లేహ్‌ - మనాలీ హైవే) భారతదేశంలోనే ఉంది. ఇది సిమ్లాను కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న లేహ్‌తో కలుపుతుంది.[ఉల్లేఖన అవసరం]

జనసాంద్రత పరంగా రహదారుల విభజనను చూపే పటం

జాతీయ రహదారులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి.[6] ఈ జాతీయ రహదారుల వెంబడి అభివృద్ధి బాగా జరుగుతుంటుంది. పలు కొత్త నగరాలు, పట్టణాలు పుట్టుకొస్తాయి. ఈ జాతీయ రహదారుల వెంబడి చిన్నా పెద్దా రెస్టారెంట్లు, ఇన్‌ లు (వీటిని దాబాలు గా కూడా పిలుస్తారు) వెలుస్తాయి. పేరున్న స్థానిక ఆహార పదార్థాలు అక్కడ దొరుకుతాయి.

భారత ప్రభుత్వపు ఉపరితల రవాణా, హైవేల శాఖ నోటిఫికేషన్‌ నంబర్‌ ఎన్‌హెచ్‌ 14019/9/2007ాపీ అండ్‌ ఎం, 2010 ఏప్రిల్‌ 28 ద్వారా జాతీయ రహదారులకు కొత్త, శాస్త్రీయ సంఖ్యా పద్ధతిని అనుసరించడం మొదలు పెట్టింది. ఈ కొత్త పద్ధతి జాతీయ రహదారి దిశను, అది ఏ దిక్కుగా వెళ్తోంది, ఏ భౌగోళిక ప్రాంతంలో ఉంది వంటి వివరాలను తెలుపుతుంది.

ఇటీవలి అభివృద్ధి కార్యక్రమాలు[మార్చు]

మాజీప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో జాతీయ రహదారుల ఆధునికీకరణ కోసం జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ) పేరుతో భారీ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. ఇందులో భాగంగా దేశ ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ కారిడార్లను దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలను కలుపుతూ నాలుగు లేన్ల రహదారులుగా పూర్తిస్థాయిలో విస్తరించారు. వీటిలో బాగా బిజీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు నుంచి ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ వే లుగా మార్చారు. ఉదాహరణకు ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-జైపూర్‌, అహ్మదాబాద్‌-వదోదర, ముంబై-పుణే, ముంబై-సూరత్‌, బెంగళూరు-మైసూర్‌, బెంగళూరు-చెన్నై, చెన్నై-తడ, ఢిల్లీ-మీరట్‌, హైదరాబాద్‌-విజయవాడ, గుంటూరు-విజయవాడ వంటి మార్గాలు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు 6,000 km (3,700 mi)ఐదో దశలో స్వర్ణ చతుర్భుజి రహదారులన్నింటినీ 2012 కల్లా ఆరు లేన్ల రహదారులు/ఎక్స్‌ప్రెస్‌ వే లుగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

1995లో ఆమోదం పొందిన జాతీయ రహదారుల బిల్లు రహదారుల నిర్మాణం, నిర్వహణల్లో ప్రైవేటు పెట్టుబడులకు కూడా అవకాశం కల్పించింది. మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఇటీవలే పలు కొత్త రోడ్లను జాతీయ రహదారులుగా వర్గీకరించారు. పెద్ద నగరాలు, పట్టణాల గుండా అంతరాయం లేకుండా రవాణా జరిగేందుకు వీలుగా హైవే ట్రాఫిక్‌ కోసం బైపాస్‌ రోడ్లను కూడా ఇటీవలే భారీగా నిర్మించారు. పలు రకాలైన వాతావరణం, భౌగోళికతలు, ట్రాఫిక్‌, కొన్ని ప్రాంతాల్లో కాలుష్య పరిస్థితుల వంటివి ఈ జాతీయ రహదారులన్నింట్లోనూ ఉమ్మడి లక్షణాలు లేకుండా చేస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అతి మారుమూల ప్రాంతాల దాకా పూర్తిస్థాయిలో ఆరు లేన్లుగా విస్తరించారు. పలు జాతీయ రహదారులు ఇంకా ఆధునికీకరణ దశలో, నిర్మాణంలో ఉన్నాయి. మెట్రో నగరాలను కలిపే అతి పొడవైన జాతీయ రహదారులతో పాటు సమీపంలోని నౌకాశ్రయాలు, రేవులను అనుసంధానించే చిన్న రోడ్డు మార్గాలు కూడా చాలా ఉన్నాయి. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 7.[7] ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి హైదరాబాద్‌, బెంగళూరుల గుండా తమిళనాడులోని కన్యాకుమారి దాకా వెళ్తుంది. మొత్తం2,369 km (1,472 mi) దూరాన్ని కవర్‌ చేస్తుంది. ఇక అతి చిన్న జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 47ఏ[8]. 6 km (3.7 mi)ఇది ఎర్నాకుళం నుంచి కోచి ఓడరేవు దాకా పొడవుంటుంది.

బెంగళూరు నుంచి కర్ణాటకాఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల మధ్య ఎన్‌హెచ్‌7 సెక్షన్‌.ఇది ఉత్తరాదక్షిణ కారిడార్‌లో భాగం.

భారతీయ మార్గ వ్యవస్థ[మార్చు]

భారతదేశ రోడ్డు నెట్‌వర్క్‌[9]
వర్గం పొడవు (కి.మీ.)
యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ 200 km (120 mi)
4 నుంచి 6 లేన్ల‌ డివైడెడ్‌ హైవేస్‌ (జనసమ్మర్ధ ప్రాంతాల్లో సర్వీస్‌ రోడ్‌తో) 10,000 km (6,200 mi)
జాతీయ రహదారులు 66,590 km (41,380 mi)
రాష్ట్ర రహదారులు 131,899 km (81,958 mi)
పెద్ద జిల్లా రహదారులు 467,763 km (290,654 mi)
గ్రామీణ, ఇతర రహదారులు 2,650,000 km (1,650,000 mi)
మొత్తం (దాదాపుగా) 3,300,000 km (2,100,000 mi)

చిత్ర మాలిక[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు
 • భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
 • భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా (హైవే నంబర్‌తో పాటు)
 • బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌
 • భారత జాతీయ రహదారుల అథారిటీ
 • జాతీయ రహదారి నంబర్‌ 1 (భారతదేశం)

సూచనలు మరియు గమనికలు[మార్చు]

 1. [9] ^ [https:// డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సిఐఎ.గవ్‌/లైబ్రరీ/పబ్లికేషన్స్‌/ది-వరల్డ్‌-ఫ్యాక్ట్‌బుక్‌/జియోస్‌/హెచ్‌కె.హెచ్‌టిఎమ్‌ఎల్‌ సిఐఏ-ది వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ - భారత్‌
 2. సమకాలీన భారతదేశం 2, ఎన్‌సీఈఆర్‌టీ పదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం, 2005 ఎడిషన్‌. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 3. రోడ్‌ నెట్‌వర్క్‌ మదింపు, బై భారతదేశ జాతీయ రహదారుల సంస్థ
 4. {0/}ఆర్చ్‌నెట్‌పై వ్యాసం
 5. K. Balchand (23 March 2010). "Two-laning of entire National Highway network by 2014". Chennai, India: The Hindu. Cite news requires |newspaper= (help)
 6. [1] భూ సేకరణ, జాతీయ రహదారులు - మూలం- భారతదేశ జాతీయ రహదారుల సంస్థ
 7. భారతదేశ రోడ్‌ మ్యాప్ - మూలాం భారతదేశ పటాలు
 8. కేరళ జాబితా, కేరళలోని రహదారులు,
  [2] జాతీయ రహదారి 47 ఏ -మూలం-ఇండియా9.‌కామ్‌
 9. రోడ్‌ నెట్‌వర్క్‌ నివేదిక, భారతదేశ జాతీయ రహదారుల సంస్థ నుంచి.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Indian Highways Network