జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2014 అక్టోబరు 1 న న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రసంగిస్తున్న దృశ్యచిత్రం.

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు.

ప్రపంచ రక్త దాతల దినోత్సవం[మార్చు]

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటారు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాలను మెరుగు పరచుకునేందుకు 2005లో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 01-10-2014 - (ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి - నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం)