జానకి (సామాజిక సేవకురాలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానకి
Janaki.jpg
నివాసంనారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తిసామాజిక సేవకురాలు
తల్లిదండ్రులుసత్తెమ్మ, చంద్రప్ప

జానకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

తొలి జీవితం[మార్చు]

జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

విద్య - ఉద్యోగం[మార్చు]

చిన్నతనం నుండి తనని అందరు చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడి చదివి, సికింద్రాబాద్‌ లోని స్వీకార్ ఉపకార్‌లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది. బధిరుడైన శ్రీనివాస్‌ను పెళ్ళి చేసుకుంది.

సామాజిక సేవ[మార్చు]

యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బధిరుల తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించింది. తనే సొంతంగా 2007లో పీపుల్ విత్ హియరింగ్ ఇంపెయిర్డ్ నెట్‌వర్క్ (ఫిన్)ను స్థాపించి, గ్రామాల్లోకి వెళ్లి బధిరుల హక్కులపై అవగాహన కల్పిస్తే, ప్రభుత్వ పథకాల గురించి తెలుపుతూ వారికి ఉద్యోగాలు అవకాశాలు ఇప్పిస్తుంది. అన్ని జిల్లాల్లోనూ ఈ నెట్‌ వర్క్ ఏర్పాటుచేసి గ్రామీణస్థాయిలో వైకల్యం ఉన్నవారికి చదువుచెప్పించి, ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో ఉన్న జానకి పుణెలో కూడా ఒక సెంటర్ నిర్వహిస్తుంది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 13 March 2017. Cite news requires |newspaper= (help)