జాని తక్కెడశిల
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్ధిష్టమైన మూస పెట్టండి. |
జాని తక్కెడశిల | |
---|---|
జననం | జాని తక్కెడశిల 08-06-1991 పులివెందుల, |
నివాస ప్రాంతం | పులివెందుల, వైఎస్ఆర్ కడప జిల్లా |
ఇతర పేర్లు | అఖిలాశ, లై, జాని బాషా చరణ్ |
వృత్తి | ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ మేనేజర్ |
ప్రసిద్ధి | కవి,రచయిత,విమర్శకుడు |
తల్లి | తక్కెడశిల ఆశ |
వెబ్సైటు | |
www.telugu.pratilipi.com |
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు. జిందగీ కె హీరే హిందీ నానో సంపుటిని 07.08.2019న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా గారు కడప క్యాంపు కార్యాలయంలో పుస్తకావిష్కరణ చేశారు.
విద్యాభ్యాసం[మార్చు]
పాఠశాల విద్యను వారి స్వస్థలం పులివెందులలోని నాగార్జున హైస్కూల్ లోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్. బి మెమోరియల్ హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. పులివెందుల లయోలా పాల్ టెక్నికల్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో అమీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఎం. టెక్., పూర్తి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా పొందారు. వీరు ఎస్.ఎస్.సి పూర్తి చేయకముందే హిందీలో డిగ్రీ పట్టా పొంది ఉన్నారు. 2006లో పదవ తరగతి పూర్తి చేసిన వీరు 2004 లోనే హిందీలో డిగ్రీ పూర్తి చేసి పదవ తరగతి కంటే ముందే డిగ్రీ పొందడం విశేషం. కంప్యూటర్, సాంకేతిక విద్యలో సి, జావా, ఓరాకిల్ మొదలగు దాదాపు ఇరవైకి పైగా టెక్నికల్ కోర్సులు పూర్తిచేసారు.
వృత్తి[మార్చు]
మొదట సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.వీరు డిప్లమా చదివే రోజుల్లో పులివెందులలోని అనేక కంప్యూటర్ ఇంస్టిట్యూట్స్ లో సి.లాంగ్వేజ్, ఆఫీస్, హార్డ్వేర్ లాంటి కోర్సులు భోదించే వారు. ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో వివిధ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు భోదించారు. చదువుకుంటూనే సాంకేతిక పరిజ్ఞానంపై విశేష ప్రతిభతో పదవ తరగతి పూర్తి అయినా వెంటనే టెక్నికల్ కోర్సులు బోధించిన ఘనత వీరి సొంతం. వీరు సి లాంగ్వేజ్, ఎం.ఎస్ ఆఫీస్ పై రాసిన పుస్తకాలు ఇప్పటికీ అనేకమందికి ఉపయోగపడుకున్నాయి. కేవలం సాహిత్య పుస్తకాలు మాత్రమే కాకుండా టెక్నికల్ పుస్తకాలు కూడా రాశారు. సౌదీ అరేబియా, కెనడాలో ఉద్యోగం వచ్చినప్పటికీ దేశాన్ని, కుటుంబాన్ని వదిలి వెళ్లలేక వదులుకున్నారు.
రచనలు[మార్చు]
ఇప్పటి వరకు వీరు కవిత్వానికి సంబంధించి ఆరు పుస్తకాలు వెలువరించారు. మరెన్నో కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో రాస్తూనే ఉన్నారు. జిందగీ కె హీరే అను పుస్తకాన్ని హిందీ భాషలో రాశారు. ఈ పుస్తకం నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం. 160 మంది కవులు అమ్మపై రాసిన కవితలను మాతృస్పర్శ పేరుతో వీరి సంపాదకత్వంలో సంకలనంగా తీసుకువచ్చారు. దాదాపు ముప్పైకి పైగా సంకలనాలలో వీరి కథలు, కవితలు ముద్రించబడ్డాయి.
కేంద్ర సాహిత్య అకాడమీ నుండి 2019లో ట్రావెల్ గ్రాంట్ పొంది కేరళ రాష్ట్రాన్ని సందర్శించడమే కాకుండా అనువాద సాహిత్యపై కేరళ రాష్ట్ర అకాడమీ అద్యక్షులు వైషాఖన్ గారిని కలిసి చర్చలు జరిపారు.
తెలుగు సాహిత్యంలో హిజ్రాలపై రాసిన రెండవ దీర్ఘ కావ్యం వీరిదే. పుస్తకం పేరు "వై". ఈ పుస్తకాన్ని ప్రముఖ అనువాదకులు డా.పతికి రమేష్ నారాయణ గారు ఆంగ్లంలోకి అనువాదం చేశారు. వీరి కొన్ని కవితలు ఒరియా, కన్నడం, హిందీ, ఆంగ్లం, తమిళ్, మలయాళం భాషల్లోకి అనువాదమయ్యాయి.
ఇప్పటివరకు 500 కవితలు, 200 సాహిత్య వ్యాసాలు, 25 బాల సాహిత్య కథలు, 20 సామాజిక కథలు,10 ముస్లిం మైనార్టీ కథలు,30 అనువాద కవితలు రాశారు.
వీరి రచనలు సాక్షి, ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, వార్త,సూర్య, నవ తెలంగాణ, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ, ఆదాబ్ హైద్రాబాద్, పవర్,గోదావరి సాహిత్యం, వెలుగు, గణేష్, నమస్తే,ధ్వని,ప్రజాపాలన,మనం,విశాలాంధ్ర,లీడర్, అల ,జనం సాక్షి,ఎర్రబాట, ప్రజాసీమ దినపత్రికల్లో, ఆదివారం అనుబంధ సంచికల్లో ప్రచురణ అయ్యాయి.నవ్య,జాగృతి,నేటి నిజం వార పత్రికల్లో, సాహిత్య ప్రస్థానం, విశాలాక్షి,దక్కన్ ల్యాండ్, మల్లెతీగ,పాలపిట్ట, విజ్ఞాన సుధ, విశాఖ సంస్కృతి,భక్తి సమాచారం,హరి కిరణం,సాహీతి కిరణం, బాల భారతం,విభిన్న, ధర్మశాస్త్రం, స్వర్ణపుష్పం, జాబిల్లి, తెలుగు వెలుగు, ఆరోగ్య లక్ష్మీ,. అనేక ఆన్లైన్ పత్రికలు, వెబ్సైట్స్ లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి.
కవిత్వం, కథా, విమర్శ ప్రక్రియ ఏదైనా లోతుల్లోకి వెళ్లి రాయడం, వివరించడం, విమర్శించడం వీరి ప్రత్యేకత. 2016 జూన్ నెలలో తెలుగు సాహిత్యం వైపు వచ్చిన వీరు కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఎనిమిది పుస్తకాలను ముద్రించారు. దాదాపు మూడు విమర్శ గ్రంధాలు, రెండు కథా సంపుటాలు, మూడు కవితా సంపుటాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. వేగంతో పాటు మంచి సాహిత్యాన్ని అందిస్తున్న అతి కొద్ది మంది యువ సాహిత్యవేత్తల్లో వీరు ఒకరు.
వీరి ముద్రిత రచనలు[మార్చు]
- అఖిలాశ(కవిత్వం) [1]
- విప్లవ సూర్యుడు (కవిత్వం)[2]
- నక్షత్ర జల్లులు (కొత్త సాహిత్య ప్రక్రియ)[3]
- వై (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)[4]
- బురద నవ్వింది (కవిత్వం)
- జిందగీ కె హీరే(నానోలు హిందీలో)
- ఊరి మధ్యలో బొడ్రాయి(దీర్ఘకావ్యం)
- వివేచని(సాహిత్య విమర్శ)
- మట్టినైపోతాను(యాత్ర కవిత్వ సంపుటి)
- గాయాల నుండి పద్యాల దాక (525 పేజీల కవిత్వ సంపుటి)
- అకాడమీ ఆణిముత్యాలు(17 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకాలపై విమర్శ వ్యాసాలు)
- మది దాటని మాట(గే కమ్యూనిటీపై తొలి తెలుగు నవల)
- షురూ (రాయలసీమ మాండలిక ముస్లిం మైనారిటీ కథా సంపుటి)
- పాపోడు (రాయలసీమ మాండలిక బాల సాహిత్య కథా సంపుటి)
- కవిత్వ స్వరం (కవిత్వ విమర్శ)
- రంకు (అక్రమ సంబంధాలపై ముస్లిం మైనారిటీ నవల)
- పరక (కవిత్వం)
సంపాదకత్వం[మార్చు]
- మాతృస్పర్శ (కవితా సంపుటి)
- తడి లేని గూడు (కథా సంపుటి)
అముద్రిత రచనలు[మార్చు]
- బాలల కథలు
- బాలల గేయాలు
- ముస్లిం మైనార్టీ కథలు
- శివారెడ్డి కవిత్వం-ఒక అవగాహన వ్యాస సంపుటి (శివారెడ్డి గారి సమగ్ర కవిత్వంపై విశ్లేషణలు)
- డా.ఎన్ గోపి కవిత్వం-ఒక పరిశీలన (గోపి గారి సమగ్ర కవిత్వంపై వ్యాస సంపుటి)
- డా.రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి రచనలు - ఒక పరిశీలన
- లై (ఆంగ్ల కవితా సంపుటి)
పురస్కారాలు[మార్చు]
- సత్రయాగం సాహిత్య వేదిక నుండి కవి మిత్ర పురస్కారం
- ప్రతిలిపి సాహిత్య వేదిక నుండి కథా భారతి పురస్కారం
- కవి సమ్మేళనం సాహిత్య వేదిక నుండి ఉగాది పురస్కారం
- బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం
- చెన్నై కి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి తెలుగు వెలుగు పురస్కారం
- ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం
- కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం
- “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019