Jump to content

జానేశ్వర్ మిశ్రా

వికీపీడియా నుండి
జానేశ్వర్ మిశ్రా

జల వనరుల మంత్రి
పదవీ కాలం
జూన్ 1996 – మే 1997

పదవీ కాలం
1989  1991
ముందు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
తరువాత సరోజ్ దూబే
నియోజకవర్గం అలహాబాద్
పదవీ కాలం
1977  1980
ముందు హేమావతి నందన్ బహుగుణ
తరువాత విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
నియోజకవర్గం అలహాబాద్
పదవీ కాలం
1969  1971
ముందు విజయ లక్ష్మీ పండిట్
తరువాత విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
నియోజకవర్గం ఫూల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1933-08-05)1933 ఆగస్టు 5
బల్లియా, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం 2010 జనవరి 22(2010-01-22) (వయసు: 76)
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
జీవిత భాగస్వామి గంగోత్రి దేవి
సంతానం ఇద్దరు కుమార్తెలు

జనేశ్వర్ మిశ్రా (5 ఆగస్టు 1933 - 22 జనవరి 2010) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జానేశ్వర్ మిశ్రా సంయుక్త సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1969లో ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి మూడవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

జానేశ్వర్ మిశ్రా 2010 జనవరి 22న అలహాబాద్‌లోని తేజ్ బహదూర్ సప్రూ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Janeshwar Mishra, a real 'Samajwadi' leader in Mulayam Singh's SP". ThePrint. 22 January 2019. the original నుండి 9 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 June 2025.
  2. "Socialist leader Janeshwar Mishra passes away" (in Indian English). The Hindu. 22 January 2010. the original నుండి 28 October 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 June 2025.
  3. SP leader Janeshwar Mishra died Archived 17 ఫిబ్రవరి 2015 at the Wayback Machine, HT Correspondent/M Hasan, Hindustan Times Lucknow , 22 January 2010