Jump to content

జాన్ కెన్నెత్ గాల్‌బ్రెయిత్

వికీపీడియా నుండి


John_Kenneth_Galbraith_1982

జాన్ కెన్నెత్ గాల్‌బ్రెయిత్ (అక్టోబరు 15, 1908 - ఏప్రిల్ 29, 2006) అమెరికన్ ఆర్థికవేత్త, దౌత్యవేత్త.

గాల్‌బ్రెయిత్ 1908 అక్టోబరు 15 న కెనడా లోని అంటారియోలో జన్మించాడు. టొరాంటో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి హార్వర్డ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేశాడు. 1949లో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా వచ్చాడు. జాన్ కెన్నడీ ఈయనను 1961-63 మధ్య కాలంలో భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమించాడు. జవాహర్‌లాల్ నెహ్రూ తన అంతరంగిక స్నేహితుడని ఈయన చెప్పుకునేవాడు. చైనా భారత యుద్ధంలో అమెరికా భారతదేశానికి అండగా నిలబడడానికి ఈయన తీవ్రంగా పని చేసేడు. ఈయన ముఖ్య రచనలు ది అఫ్లుయెంట్ సొసైటీ, ది న్యూ ఇండస్ట్రియల్ స్టేట్, ది గ్రేట్ క్రాష్:1929.

గాల్‌బ్రెయిత్ డెమొక్రాటిక్ పార్టీ రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, హ్యారీ ఎస్. ట్రూమన్, జాన్ ఎఫ్. కెన్నెడీ, లిండన్ బి. జాన్సన్ ప్రభుత్వాల్లో పనిచేశాడు. అతని రాజకీయ క్రియాశీలత, సాహిత్య సృష్టి, బహిరంగంగా మాట్లాడటం అతని జీవితకాలంలో అతనికి విస్తృత ఖ్యాతిని తెచ్చిపెట్టింది. [1] [2] రెండవ ప్రపంచ యుద్ధ పతకం (1946), ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం (2000) రెండింటినీ అందుకున్న కొద్దిమందిలో గాల్‌బ్రెయిత్ ఒకడు. ఫ్రాన్స్ ప్రభుత్వం అతన్ని కమాండూర్ డి లా లెజియన్ డి హోన్నూర్‌గా చేసింది.

కుటుంబం

[మార్చు]
1937 సెప్టెంబరు 17 న, గాల్‌బ్రెయిత్ కేథరీన్ మెరియం అట్వాటర్‌ను వివాహం చేసుకున్నాడు, ఆమె రాడ్‌క్లిఫ్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమెను కలుసుకున్నాడు. వారి వివాహం 68 సంవత్సరాల పాటు, గాల్‌బ్రెయిత్ మరణించే వరకు కొనసాగింది. వారికి నలుగురు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "John Kenneth Galbraith". The Economist. May 4, 2006. Retrieved July 3, 2013.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; thecrimson.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు