Jump to content

జాన్ ఫ్రైలింక్

వికీపీడియా నుండి
జాన్ ఫ్రైలింక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ నికోలస్ ఫ్రైలింక్
పుట్టిన తేదీ (1994-04-06) 1994 ఏప్రిల్ 6 (వయసు: 32)
బెల్‌విల్ల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 19)2019 ఏప్రిల్ 27 - ఒమన్ తో
చివరి వన్‌డే2025 సెప్టెంబరు 4 - స్కాట్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 5)2019 మే 20 - ఘనా తో
చివరి T20I2025 అక్టోబరు 11 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2013బోలాండ్
2013–2016నార్దర్న్ కేప్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టీ20ఐ ఫక్లా లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 48 74 45 107
చేసిన పరుగులు 946 1,041 1,571 1,950
బ్యాటింగు సగటు 24.89 24.78 23.44 25.65
100లు/50లు 1/6 1/2 1/11 3/8
అత్యుత్తమ స్కోరు 114 134 158 126*
వేసిన బంతులు 1,388 963 5040 3,982
వికెట్లు 37 63 97 116
బౌలింగు సగటు 27.94 17.95 27.40 26.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/13 6/24 7/32 5/13
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 27/– 15/– 39/–
మూలం: Cricinfo, 2025 అక్టోబరు 12

జాన్ నికోలస్ ఫ్రైలింక్ (జననం 1994 ఏప్రిల్ 6) దక్షిణాఫ్రికాలో జన్మించిన నమీబియా క్రికెట్ ఆటగాడు. ప్రస్తుతం నమీబియా జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాటరు, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలరు. ఫ్రైలింక్ 2011 మార్చి 24న వెస్ట్రన్ ప్రావిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బోలాండ్ తరపున తన ఫస్ట్-క్లాస్ కెరీర్ మొదలుపెట్టాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

ఫ్రైలింక్ దక్షిణాఫ్రికా అండర్-19 క్రికెట్ జట్టుకు అనేక యూత్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. అతను 2015 ఆఫ్రికా T20 కప్ కోసం గ్రిక్వాలాండ్ వెస్ట్ క్రికెట్ జట్టు జట్టులో చేర్చబడ్డాడు.

ఫ్రైలింక్ వంశపారంపర్యంగా నమీబియా పౌరుడు, అతని తండ్రి వాల్విస్ బేలో జన్మించాడు. 2016 అక్టోబరులో పాపువా న్యూ గినియాతో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఆటకు నమీబియా జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు, కానీ సకాలంలో అతని అర్హత నిర్ధారణ అందకపోవడంతో వైదొలగాల్సి వచ్చింది. [1] అతను 2017–18 CSA ప్రావిన్షియల్ వన్డే ఛాలెంజ్ టోర్నమెంట్‌లో నమీబియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఎనిమిది మ్యాచిల్లో 367 పరుగులు చేశాడు. [2] ఎనిమిది మ్యాచిల్లో 16 వికెట్లు తీసి, నమీబియా తరపున టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా కూడా నిలిచాడు.[2] 2018 జనవరిలో అతను 2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3]

2018 ఆగస్టులో, ఫ్రైలింక్ 2018 ఆఫ్రికా T20 కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[4] 2018 అక్టోబరులో, బోట్స్వానాలో జరిగిన 2018–19 ICC వరల్డ్ ట్వంటీ20 ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం సదరన్ సబ్ రీజియన్ గ్రూప్ తరఫున నమీబియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [5]

2019 మార్చిలో, అతను 2019 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంటులో నమీబియా జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [6] నమీబియా, ఆ టోర్నమెంటులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి, వన్డే ఇంటర్నేషనల్ (ODI) హోదా సాధించింది.[7] ఫ్రైలింక్ 2019 ఏప్రిల్ 27న ఒమన్‌తో జరిగిన టోర్నమెంటు ఫైనల్‌లో నమీబియా తరపున వన్డేల్లోకి అడుగుపెట్టాడు.[8] ఈ మ్యాచ్‌లో, అతను ఎనిమిది ఓవర్లలో పదమూడు పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, వన్‌డేల్లో తొలిమ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసిన తొలి నమీబియా బౌలరయ్యాడు. [9] [10] అతను ఆరు మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి, టోర్నమెంటులో నమీబియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు.[11]


2019 మేలో, అతను ఉగాండాలో జరిగిన 2018–19 ICC T20 ప్రపంచ కప్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంటు ప్రాంతీయ ఫైనల్స్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [12] [13] 2019 మే 20 న ఘనాపై తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.[14]

2019 జూన్లో, 2019–20 అంతర్జాతీయ సీజన్‌కు ముందు క్రికెట్ నమీబియా వారి అత్యుత్తమ పురుషుల జట్టుకు ఎంపికైన ఇరవై ఐదు మంది క్రికెటర్లలో అతను ఒకడు. [15] [16] 2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం నమీబియా జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. [17] 2021 సెప్టెంబరులో, ఫ్రైలింక్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం నమీబియా జట్టుకు ఎంపికయ్యాడు.[18] మరుసటి నెలలో, 2021 సమ్మర్ T20 బాష్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో, ఫ్రైలింక్ T20I క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు.[19]

2024 మేలో ఫ్రైలింక్, 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం ఎంపిక చేసిన నమీబియా జట్టుకు ఎంపికయ్యాడు.[20]

మూలాలు

[మార్చు]
  1. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  2. 1 2 "CSA Provincial One-Day Challenge, 2017/18 Namibia: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 April 2018.
  3. "Six teams vying for the final two spots in ICC Cricket World Cup Qualifier 2018". International Cricket Council. Retrieved 29 January 2018.
  4. "Cricket Namibia to compete in T20 Africa Cup". The Namibian. Retrieved 24 August 2018.
  5. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  6. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  7. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  8. "Final, ICC World Cricket League Division Two at Windhoek, Apr 27 2019". ESPN Cricinfo. Retrieved 27 April 2019.
  9. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  10. "Statistics: Five-wicket hauls on ODI debut". ESPN Cricinfo. Retrieved 27 April 2019.
  11. "ICC World Cricket League Division Two, 2019 - Namibia, List A matches: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 27 April 2019.
  12. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  13. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  14. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  15. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  16. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  17. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  18. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  19. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  20. Griqualand West Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.