జాన్ బర్గర్
జాన్ పీటర్ బెర్గర్ (John Peter Berger) (5 నవంబర్ 1926 – 2 జనవరి 2017) ఇంగ్లాండ్‌కు చెందిన కళా విమర్శకుడు, నవలా రచయిత, చిత్రకారుడు, కవి. ఆయన రచించిన G. అనే నవల 1972లో బుకర్ ప్రైజ్‌ను గెలుచుకుంది. కళా విమర్శకు సంబంధించిన ఆయన వ్యాస సంకలనం చేసే పద్ధతి బిబిసి కోసం రూపొందించిన టెలివిజన్ ధారావాహికకు అనుబంధంగా వెలువడింది. ఈ గ్రంథం కళను చూసే విధానంపై గొప్ప సాంస్కృతిక ప్రభావాన్ని చూపింది. నేటికీ ఇది విస్తృతంగా చదవబడుతోంది. బెర్గర్ తన జీవితంలో యాభై సంవత్సరాలకు పైగా ఫ్రాన్స్‌లో నివసించాడు.[1]
బాల్యం విద్య
[మార్చు]బెర్గర్ 5 నవంబర్ 1926న లండన్‌లోని స్టోక్ న్యూయింగ్టన్లో జన్మించాడు. మిరియం మరియు స్టాన్లీ బెర్గర్ దంపతులకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఇతను మొదటివాడు.
ఇతని తాత ప్రస్తుతం ఇటలీలో ఉన్న ట్రియెస్టే ప్రాంతానికి చెందినవాడు. ఇతను తండ్రి స్టాన్లీ మొదట మతపరంగా యూదు సంప్రదాయంలో పెరిగి, తరువాత కాథలిక్ మతాన్ని స్వీకరించాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇతను పశ్చిమ రంగంలో పదాతిదళ అధికారిగా పనిచేశాడు. ఇతనికి మిలిటరీ క్రాస్ పురస్కారాలు లభించాయి.
బెర్గర్ ఎస్ టి ఎడ్వర్డ్ పాఠశాల, ఆక్స్‌వర్డ్ లో విద్యాభ్యాసం చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944 నుంచి 1946 వరకు బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. అనంతరం లండన్‌లోని చెల్సియా పాఠశాల లోని కళా మరియు రూపకల్పన అనే పాఠశాల లో విద్యను అభ్యసించారు[2].
ప్రారంభ వృత్తి జీవితం
[మార్చు]- బెర్గర్ తన వ్యక్తిగత జీవితాన్ని చిత్రకారుడిగా ప్రారంభించాడు. 1940ల చివర్లో లండన్‌లోని అనేక కళా ప్రదర్శనశాలల్లో తన చిత్రాలను ప్రదర్శించాడు. ఇతను చిత్రాలు వైల్డన్ స్టెయిన్, రెడ్‌ఫెర్న్ లెసిస్టర్ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి.
- ఇతను ఎస్ టి మేర్స్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో డ్రాయింగ్ బోధించాడు. తరువాత కళా విమర్శకుడిగా మారి న్యూ స్టేట్స్ మాన్ పత్రికలో అనేక వ్యాసాలు, సమీక్షలు రాశాడు.
- బెర్గర్ విమర్శలో మార్క్సిస్టు దృక్పథం ఆధునిక కళపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు ఆయన తన ప్రారంభ దశలోనే వివాదాస్పద వ్యక్తిగా చేశాయి. తన రాజకీయ నిబద్ధతను తెలియజేసే విధంగా ఆయన తన ప్రారంభ వ్యాస సంకలనానికి పెర్మనెంట్ రెడ్ అనే పేరు పెట్టాడు.
- బెర్గర్ అధికారికంగా Communist Party of Great Britain సభ్యుడు కాకపోయినప్పటికీ, ఆ పార్టీతో దానికి అనుబంధమైన Artists’ International Associationతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు.[3]
ప్రచురిత రచనలు
[మార్చు]- 1958లో బెర్గర్ తన మొదటి నవల A Painter of Our Timeను ప్రచురించాడు. ఇందులో జానోష్ లావిన్ అనే కల్పిత హంగేరియన్ ప్రవాస చిత్రకారుడు అదృశ్యం కావడం, అతని డైరీని ఒక కళా విమర్శకుడైన జాన్ కనుగొనడం వంటి అంశాలు ఉన్నాయి.
- ఈ పుస్తకం ప్రచురితమైన ఒక నెల తరువాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రచురణకర్త దాన్ని ఉపసంహరించుకున్నాడు.
- తరువాత ఇతను The Foot of Clive , Corker’s Freedom అనే నవలలను రచించాడు. ఈ రెండు రచనల్లోనూ ఇంగ్లాండ్‌లోని పట్టణ జీవితం, ఒంటరితనం మరియు విషాదభావనలను చిత్రించాడు.
- 1962లో బ్రిటన్‌లోని జీవన విధానంపై అసంతృప్తితో బెర్గర్ ఫ్రాన్స్‌లోని హాట్-సావోయ్ ప్రాంతంలోని మియుస్సీలోని క్విన్సీకి వెళ్లి నివసించాడు.
- Ways of Seeing
- 1972లో BBC బెర్గర్ రూపొందించిన నాలుగు భాగాల టెలివిజన్ కార్యక్రమాన్ని Ways of Seeing పేరుతో ప్రసారం చేసింది. అదే పేరుతో దానికి అనుబంధంగా ఒక పుస్తకం కూడా ప్రచురించబడింది.
- ఈ గ్రంథంలోని మొదటి భాగం చిత్రాలను చూసే విధానం గురించి పరిచయం చేస్తుంది. దీనిపై జర్మన్ తత్వవేత్త వాల్టర్ బెంజమిన్ రచించిన The Work of Art in the Age of Mechanical Reproduction వ్యాసం ప్రభావం ఉంది.
- తరువాతి భాగాల్లో పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీని లైంగిక వస్తువుగా చూపించే విధానం, యూరోపియన్ ఆయిల్ పెయింటింగ్స్‌లో ఆస్తి, సంపద మరియు యాజమాన్య భావనల వ్యక్తీకరణ, అలాగే ఆధునిక ప్రకటనల ప్రభావం వంటి అంశాలను బెర్గర్ విశ్లేషించాడు.
- ఈ కార్యక్రమం మరియు పుస్తకం కళను అర్థం చేసుకునే విధానంలో దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా యూరోపియన్ చిత్రకళలో స్త్రీ నగ్న చిత్రణను విశ్లేషిస్తూ బెర్గర్ చేసిన చర్చ “Male Gaze” (పురుష దృష్టి) అనే భావనను ప్రజాదరణ పొందేలా చేసింది.
- ఈ ఆలోచనలను స్త్రీవాద విమర్శకులు కూడా విస్తృతంగా ఉపయోగించారు. ముఖ్యంగా బ్రిటిష్ చలనచిత్ర విమర్శకురాలు లారా ముల్వే సినిమా రంగంలో స్త్రీ పాత్రల సంప్రదాయిక చిత్రణను విమర్శించడానికి ఈ భావనను ఉపయోగించింది.
- G. నవల బుకర్ ప్రైజ్
బెర్గర్ రచించిన G. అనే నవల 1898లో యూరప్ నేపథ్యంగా రూపొందిన ఒక picaresque నవల. ఈ రచనకు James Tait Black Memorial Prizeతో పాటు 1972 Booker Prize కూడా లభించింది.
బుకర్ ప్రైజ్ ద్వారా వచ్చిన నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బెర్గర్ British Black Panthersకు విరాళంగా ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని యూరప్‌లోని వలస కార్మికులపై పరిశోధన చేయడానికి ఉపయోగించాడు. ఆ పరిశోధన ఫలితంగా A Seventh Man అనే గ్రంథం వెలువడింది.
బుకర్ ప్రైజ్ స్వీకరణ సందర్భంగా బెర్గర్, ఆ బహుమతిని అందిస్తున్న సంస్థకు కరేబియన్ ప్రాంతంలో బానిసత్వం మరియు దోపిడీతో కూడిన చరిత్ర ఉందని విమర్శించాడు. అందుకే తాను బహుమతిలోని కొంత మొత్తాన్ని British Black Panthersకు ఇవ్వాలని, మిగిలిన మొత్తంతో వలస కార్మికులపై రచన చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
సామాజిక సమాజశాస్త్ర రచనలు
[మార్చు]బెర్గర్ రచనలు కేవలం కళా విమర్శకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక జీవితాన్ని, గ్రామీణ ప్రజలను, వలస కార్మికులను కూడా ఆయన తన రచనల్లో పరిశీలించాడు.
ప్రధాన రచనలు:
[మార్చు]- ↑ "Berger, John, (5 Nov. 1926–2 Jan. 2017), author and art critic", Who Was Who, Oxford University Press, 2007-12-01, retrieved 2026-08-07
- ↑ Ancient TL (2011-11-15). "Obituary: Glenn Berger (1945-2011)". Ancient TL. 29 (2): 91. doi:10.26034/la.atl.2011.456. ISSN 2693-0935.
- ↑ Forrest, John (2024). Moments: Times That Make Us Stop and Think. Nova Science Publishers, Inc. ISBN 979-8-89530-147-0.