జార్జ్ క్లాసెన్
| జార్జ్ క్లాసెన్ | |
|---|---|
క్లాసెన్, c. 1915 | |
| జననం | 18 ఏప్రిల్ 1852 లండన్, ఇంగ్లాండ్ |
| మరణం | 1944 నవంబరు 22 (వయసు: 92) తచమ్, బెర్క్‌షైర్, ఇంగ్లాండ్ |
| భార్య / భర్త | ఆగ్నెస్ మేరీ వెబ్‌స్టర్ |
| ఉద్యమం |
|
| ఎన్నిక |
|
సర్ జార్జ్ క్లాసెన్ RA RWS RI ROI (18 ఏప్రిల్ 1852 – 22 నవంబర్ 1944) నూనెరంగులు, జలవర్ణాలు, ఎచ్చింగ్, మెజోటింట్, డ్రైపాయింట్, అప్పుడప్పుడు లితోగ్రాఫ్‌లలో పనిచేసిన బ్రిటిష్ చిత్రకారుడు. 1927లో ఇతనికి నైట్‌హుడ్ బిరుదు లభించింది.[1][2]
జీవిత చరిత్ర
[మార్చు]జార్జ్ క్లాసెన్ 1852 ఏప్రిల్ 18న లండన్ లోని రీజెంట్స్ పార్క్ జిల్లాలో 8 విలియం స్ట్రీట్‌లో[3] జన్మించాడు. ఇతని తండ్రి డానిష్ సంతతికి చెందిన అలంకరణ కళాకారుడు, తల్లి స్కాటిష్ మహిళ. 1867 నుండి 1873 వరకు, అతను లండన్‌లోని సౌత్ కెన్సింగ్టన్ స్కూల్స్‌లో డిజైన్ తరగతులకు హాజరై గొప్ప విజయం సాధించాడు. ఆ తర్వాత అతను ఎడ్విన్ లాంగ్ RA స్టూడియోలో, తదనంతరం పారిస్‌లో అకాడెమీ జూలియన్‌లో బౌగ్యురేయు, టోనీ రాబర్ట్-ఫ్ల్యూరీల వద్ద పనిచేశాడు.[4][5] అతను చిత్రకారుడు జూల్స్ బాస్టియన్-లేపేజ్ అనుసరించిన సహజత్వానికి ఆరాధకుడు, అతని గురించి ఇతను 1888, 1892లలో రాశాడు. క్లాసెన్ ప్రకృతి దృశ్యాలు, గ్రామీణ జీవితాన్ని చిత్రించే అగ్రగామి ఆధునిక చిత్రకారులలో ఒకరిగా నిలిచాడు. ఇతను ఇంప్రెషనిస్ట్‌లచే కొంతవరకు ప్రభావితుడయ్యాడు, ప్రకృతి దృశ్య కళలో కాంతి ప్రధానమైన అంశం అనే వారి అభిప్రాయాన్ని ఇతను పంచుకున్నాడు.[6] ఆరుబయట పడే సూర్యకాంతిలో, లేదా గాదె, అశ్వశాల నీడలో వస్తువుల రూపాన్ని అద్భుతంగా చిత్రించడంలో అతని చిత్రాలు రాణించాయి. అతను గీసిన గర్ల్ ఎట్ ది గేట్ చిత్రాన్ని చాన్ట్రీ ట్రస్టీలు కొనుగోలు చేశారు, ఇది ఇప్పుడు టేట్ గ్యాలరీలో ఉంది.[5][7] యేల్ సెంటర్ ఫర్ బ్రిటిష్ ఆర్ట్ క్లాసెన్ చిత్రించిన స్కూల్ గర్ల్స్ (1880) అనే పట్టణ దృశ్యాన్ని కలిగి ఉంది,[8] దీనిని వారు "బ్రిటన్ ఇన్ ది వరల్డ్: 1860-నౌ" అనే ప్రదర్శనలో ఉంచారు.[9]
"ది ఫీల్డ్స్ ఇన్ జూన్" (1914), "మిడ్‌సమ్మర్ డాన్" (1921) ఇతర ప్రకృతి దృశ్యాలలో ఉన్నాయి. ఇంపీరియల్ వార్ మ్యూజియం కోసం అతను "గన్ ఫ్యాక్టరీ ఎట్ వూల్‌విచ్ ఆర్సెనల్" (1919) అనే పెద్ద, విస్తృత అలంకరణ చిత్రాన్ని గీశాడు. ఇతని అలంకరణ పనులలో "పునరుజ్జీవనం" (1915), హడర్స్‌ఫీల్డ్‌లోని హై రాయిడ్ వద్ద ఉన్న హాల్ కోసం చేసిన అలంకరణలు ఉన్నాయి, ఇందులో లూనెట్‌లలో నిలువెత్తు బొమ్మలు ఉన్నాయి.[10]
క్లాసెన్ 1886లో న్యూ ఇంగ్లీష్ ఆర్ట్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడు. 1895లో అతను రాయల్ అకాడమీ అసోసియేట్‌గా, 1906లో పూర్తి అకాడెమీషియన్‌గా ఎన్నికయ్యాడు.[11] 1909లో ఆర్ట్ వర్కర్స్ గిల్డ్ మాస్టర్‌గా ఎన్నికయ్యాడు.[12] రాయల్ అకాడమీలో పెయింటింగ్ ప్రొఫెసర్‌గా అతను పాఠశాలల విద్యార్థులకు గుర్తుండిపోయే ఉపన్యాసాల పరంపరను ఇచ్చాడు, అవి సిక్స్ లెక్చర్స్ ఆన్ పెయింటింగ్ (1904), ఎయిమ్స్ అండ్ ఐడియల్స్ ఇన్ ఆర్ట్ (1906) పేరుతో ప్రచురించబడ్డాయి.[5][4]
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్లాసెన్ అధికారిక యుద్ధ కళాకారుడు. యుద్ధ సమయంలో ఇతని కుమార్తెకు కాబోయే భర్త (సెకండ్ లెఫ్టినెంట్ గెరైంట్ పేన్) మరణించాడు; ఈ సంఘటన అతని యూత్ మౌర్నింగ్ చిత్రానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు, ఇందులో ఒంటరి ప్రకృతి దృశ్యంలో విలపిస్తున్న ఒక యువతి కనిపిస్తుంది.[13][14][15][16][17] ప్రభుత్వం ప్రచురించిన ప్రింట్ పోర్ట్‌ఫోలియో బ్రిటన్స్ ఎఫర్ట్స్ అండ్ ఐడియల్స్ కోసం 'మేకింగ్ గన్స్' అనే అంశంపై ఆరు లితోగ్రాఫ్‌లను కూడా క్లాసెన్ అందించాడు.[18]
1921లో క్లాసెన్ సొసైటీ ఆఫ్ గ్రాఫిక్ ఆర్ట్ అసలు సభ్యుడు, వారి మొదటి ప్రదర్శనలో తన పనిని ప్రదర్శించాడు.
అతను 1944లో కోల్డ్ యాష్ గ్రామంలోని తన ఇంట్లో మరణించాడు, అక్కడి పారిష్ చర్చియార్డ్‌లో అతని భార్య పక్కన ఖననం చేశారు.[19]
గ్యాలరీ
[మార్చు]- ఎంచుకున్న చిత్రాలు
- బర్డ్ స్కేరింగ్, 1887
- గర్ల్, 1888
- ప్లవింగ్, 1889
- బ్రౌన్ ఐస్, 1891
- యాపిల్ బ్లోసమ్
- ది గ్లీనర్స్ రిటర్నింగ్, 1908
- యూత్ మౌర్నింగ్, 1916
- మార్నింగ్ ఇన్ నవంబర్, 1922
మూలాలు
[మార్చు]- ↑ "Artist biography, George Clausen R.A". Tate. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 October 2016.
- ↑ "Sir George Clausen RA RSW RWS HRBA RI ROI NEAC (1852-1944)". Chris Beetles Gallery. ఒరిజినల్ నుండి 15 Feb 2023 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Chris Beetles Gallery".
- 1 2 Ian Chilvers (2004). The Oxford Dictionary of Art. Oxford University Press. ISBN 0-19-860476-9.
- 1 2 3 Chisholm 1911.
- ↑ Brian Stewart & Mervyn Cutten (1997). The Dictionary of Portrait Painters in Britain up to 1920. Antique Collectors' Club. ISBN 1-85149-173-2.
- ↑ "Catelogue entry, The Girl at the Gate". Tate. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 October 2016.
- ↑ Clausen, George (1880). "Schoolgirls". Yale Center for British Art. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 22, 2021.
- ↑ Yale Center for British Art (2019). Britain in the world : highlights from the Yale Center for British Art : in honor of Amy Meyers. Amy R. W. Meyers, Martina Droth, Nathan Flis, Michael Hatt. New Haven, CT. ISBN 978-0-300-24747-3. OCLC 1088665967.
{{cite book}}: CS1 maint: location missing publisher (link) - ↑ Chisholm, Hugh, ed. (1922). . Encyclopædia Britannica. Vol. 30 (12th ed.). London & New York: The Encyclopædia Britannica Company. p. 701.
- ↑ Frances Spalding (1990). 20th Century Painters and Sculptors. Antique Collectors' Club. ISBN 1-85149-106-6.
- ↑ Kenneth McConkey (1980). Sir George Clausen, R.A. 1852-1944. City of Bradford Metropolitan District Council and Tyne and Wear County Council. p. 78. ISBN 9780905974040.
- ↑ Art from the First World War. Imperial War Museum. 2008. ISBN 978-1-904897-98-9.
- ↑ Imperial War Museum. "First World War archive, George Clausen". Imperial War Museum. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 September 2016.
- ↑ Valentine, Helen. "1916: Altered States". The Royal Academy Summer Exhibition: A Chronicle, 1769–2018. Royal Academy. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 November 2024.
- ↑ మూస:CWGC
- ↑ Potter, Matthew (2017). "The 'abysmal inexcusable middle class', Painting, Commemoration and the First World War". In Einhaus, Ann-Marie (ed.). Edinburgh Companion to the First World War and the Arts. Edinburgh University Press. pp. 111–132 [116].
- ↑ Mari Gordon, ed. (2014). The Great War:Britain's Efforts and Ideals. Amgueddfa Cymru-National Museum Wales. ISBN 9780720006278.
- ↑ "Sir George Clausen RA".
ఆపాదింపు:
- This article incorporates text from a publication now in the public domain: Chisholm, Hugh, ed. (1911). "Clausen, George". ఎన్సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 6 (11th ed.). Cambridge University Press. p. 467.
ఆధారాలు
[మార్చు]- గిబ్సన్, ఫ్రాంక్. The Etchings and Lithographs of George Clausen, R.A. The Print Collector's Quarterly 1921 జూలై Vol 8, No. 2, pp 203, 212.
- గిబ్సన్, ఫ్రాంక్. Notes to Catalogue of Etchings by George Clausen The Print Collector's Quarterly 1921 డిసెంబర్ Vol 8, No. 4, p 433.
- రూథర్సన్, ఆల్బర్ట్ (సంపాదకుడు). Contemporary British Artists: George Clausen ప్రచురణకర్త: ఎర్నెస్ట్ బెన్ లిమిటెడ్, 1923
- Sir George Clausen, R.A. 1852–1944; బ్రాడ్‌ఫోర్డ్ ఆర్ట్ గ్యాలరీ, 1980. 1980లో బ్రాడ్‌ఫోర్డ్, లండన్, బ్రిస్టల్, న్యూకాజిల్ అపాన్ టైన్‌లో జరిగిన ప్రదర్శన కేటలాగ్.
బాహ్య లింకులు
[మార్చు]- Works by జార్జ్ క్లాసెన్ at Project Gutenberg
- ఇంపీరియల్ వార్ మ్యూజియం సేకరణలో క్లాసెన్ చిత్రాలు