జార్జ్ ఫెర్నాండెజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జార్జ్ ఫెర్నాండెజ్
2002లో ఫెర్నాండెజ్
22వ భారత రక్షణ మంత్రి
In office
2001 అక్టోబరు 21 – 2004 మే 22
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుజశ్వంత్ సింగ్
తరువాత వారుప్రణబ్ ముఖర్జీ
In office
1998 మార్చి 19 – 2001 మార్చి 16
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుములాయంసింగ్ యాదవ్
తరువాత వారుజశ్వంత్ సింగ్
రైల్వే మంత్రి
In office
1989 డిసెంబరు 2 – 1990 నవంబరు 10
ప్రథాన మంత్రివి.పి సింగ్
అంతకు ముందు వారుమాధవరావు సింధియా
తరువాత వారుజానేశ్వర్ మిశ్రా
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ, బీహార్
In office
2009 ఆగష్టు 4 – 2010 జులై 7
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
2004–2009
అంతకు ముందు వారుజై నారాయణ్ ప్రసాద్ నిషాద్
తరువాత వారుజై నారాయణ్ ప్రసాద్ నిషాద్
In office
1989–1996
అంతకు ముందు వారులలితేశ్వర్ ప్రసాద్ షాహి
తరువాత వారుజై నారాయణ్ ప్రసాద్ నిషాద్
In office
1977–1984
అంతకు ముందు వారునావల్ కిషోర్ సిన్హా
తరువాత వారులలితేశ్వర్ ప్రసాద్ షాహి
నియోజకవర్గంముజఫర్‌పూర్ నియోజకవర్గం
In office
1996–2004
అంతకు ముందు వారువిజయ్ కుమార్ యాదవ్
తరువాత వారునితీష్ కుమార్
నియోజకవర్గంనలందా, బీహార్
In office
1967–1971
అంతకు ముందు వారుఎస్.కె.పాటిల్
తరువాత వారుకైలాస్ నారాయణ్ నరుల శివనారాయణ్
నియోజకవర్గంముంబై సౌత్, మహారాష్ట్ర
వ్యక్తిగత వివరాలు
జననం
జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్

(1930-06-03)1930 జూన్ 3
మంగళూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం కర్ణాటక, భారతదేశం)
మరణం2019 జనవరి 29(2019-01-29) (వయసు 88)
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీసమతా మంచ్[1]
ఇతర రాజకీయ
పదవులు
జీవిత భాగస్వామిలీలా కబీర్
సంతానంఒక కుమారుడు
నివాసంబెంగళూరు, కర్ణాటక, భారతదేశం
పురస్కారాలుపద్మ విభూషణ్, (మరణానంతరం) (2020)
సంతకం

జార్జ్ మాథ్యూ జార్జ్ ఫెర్నాండెజ్, (1930 జూన్ 3- 2019 జనవరి 29) ఒక భారతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజనీతిజ్ఞుడు,[2] ప్రముఖ పాత్రికేయుడు,[3] బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, లోక్‌సభ సభ్యుడుగా 1967లో బొంబాయి (ప్రస్తుత ముంబై) నుండి ఎన్నికై సుదీర్ఘ కాలం, పనిచేసిన రాజకీయ నాయకుడు. కానీ ఎక్కువగా బీహార్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[4] అతను జనతాదళ్‌లో కీలక సభ్యుడు, సమతా పార్టీ వ్యవస్థాపకుడు.అతను సమాచార, పరిశ్రమ, రైల్వే, రక్షణతో సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు.[5]

మంగళూరుకు చెందిన జార్జ్ ఫెర్నాండెజ్ మొదట పూజారిగా శిక్షణ పొందడానికి 1946 లో బెంగళూరుకు పంపారు. 1949లో అతను బొంబాయికి వెళ్లాడు, అక్కడ అతను సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేరాడు. ట్రేడ్ యూనియన్ బంద్ లకు నాయకుడిగామారిన ఫెర్నాండెజ్ 1950, 1960 లలో భారతీయ రైల్వేలో పనిచేస్తున్నప్పుడు బొంబాయిలో అనేక సమ్మెలు, బంద్‌లు అతని సారథ్యంలో నిర్వహించాడు. అతను 1967 పార్లమెంట్ ఎన్నికల్లో బొంబాయి సౌత్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ఎస్.కె.పాటిల్‌ను ఓడించాడు.అతను అఖిల భారత రైల్వేమెన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1974 రైల్వే సమ్మెను నిర్వహించాడు. అత్యవసర పరిస్థితి విధించినందుకు ప్రధాని ఇందిరాగాంధీని సవాలు చేస్తూ, 1975 లో అత్వసర పరిస్థితి కాలంలో ఫెర్నాండెజ్ భూగర్భంలోకి వెళ్లాడు [6] కానీ 1976లో అతన్ని అప్రసిద్ధ బరోడా డైనమైట్ కేసులో అరెస్టు చేశారు.

1977లో, అత్యవసర పరిస్థితి తొలగించిన తరువాత, ఫెర్నాండెజ్ బీహార్‌లోని ముజఫర్‌పూర్ సీటును అజ్ఞాతంలో ఉండి గెలుపొందాడు. కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిగా నియమితులయ్యాడు. అతను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, పెట్టుబడుల ఉల్లంఘనల కారణంగా అమెరికా బహుళజాతి సంస్థలైన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్సును, కోకా-కోలా లను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాడు. అతను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 1989 నుండి 1990 వరకు నిర్వహించిన కొంకణ్ రైల్వేపథకం సమర్థవంతగా పూర్తిచేసిన ఒక చోదక శక్తిలాంటి వ్యక్తి. అతను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ) ప్రభుత్వం (1998-2004) లో రక్షణ మంత్రిగా పనిచేసాడు. అతను రక్షణ మంత్రిగా పనిచేసే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, భారతదేశం పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలను నిర్వహించింది. అనుభవజ్ఞుడైన సోషలిస్టుగా పేరుపొందిన ఫెర్నాండెజ్ బరాక్ క్షిపణి కుంభకోణం, తెహల్కా వ్యవహారాలతో సహాపలు వివాదాలు ఎదుర్కొన్నాడు. జార్జ్ ఫెర్నాండెజ్ 1967 నుండి 2004 వరకు తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాడు [7] అతను 2019 జనవరి 29న 88 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[8] అతనికి 2020లో పబ్లిక్ అఫైర్స్ రంగంలో మరణానంతరం భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది.[9][10][11]

జీవితం తొలిదశ[మార్చు]

జార్జ్ ఫెర్నాండెజ్ 1930 జూన్ 3న, జాన్ జోసెఫ్ ఫెర్నాండెజ్, ఆలిస్ మార్తా ఫెర్నాండెజ్ (నీ పింటో) దంపతులకు మంగళూరులోని ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు.[12] ఆరుగురు మగ పిల్లలలో ఫెర్నాండెజ్ పెద్దవాడు. అతని తోబుట్టువులు లారెన్స్, మైఖేల్, పాల్, అలోసియస్, రిచర్డ్. అతని తల్లి, కింగ్ జార్జ్ 5 (అతనూ జూన్ 3న జన్మించాడు) గొప్పగా అభిమానించింది, అందుకే ఆమె తన మొదటి కుమారుడికి జార్జ్ అని పేరు పెట్టింది. అతని తండ్రి పీర్‌లెస్ ఫైనాన్స్ గ్రూప్‌లో భీమా కార్యనిర్వహణాధికారిగా పనిచేసేవాడు. అనేక సంవత్సరాలు దక్షిణ భారతదేశం లోని వారి కార్యాలయానికి నాయకత్వం వహించాడు. జార్జ్ సన్నిహిత కుటుంబ సభ్యులు అతనిని "గెర్రీ" అని పిలిచేవారు. ఫెర్నాండెజ్ మొదట కొన్ని సంవత్సరాల పాఠశాల విద్యను తన ఇంటికి సమీపంలోని "బోర్డు పాఠశాల" అని పిిలిచే ప్రభుత్వ పాఠశాలలో, మునిసిపల్ పాఠశాల, చర్చి పాఠశాలలో కొనసాగించాడు.[13] అతను ఐదవ తరగతి నుండి మంగళూరులోని సెయింట్ అలోసియస్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పాఠశాలలో చదివాడు. అక్కడ అతను సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (ఎస్.ఎస్.ఎల్.సి) పూర్తి చేశాడు.[12]

ఈటీవీకి ఇచ్చిన ముఖా ముఖి సమావేశంలో, తన తండ్రి, తాను న్యాయవాది కావాలనే కోరిక ఉన్నప్పటికీ, మెట్రిక్యులేషన్ తర్వాత చదువును ఆపాలని తీసుకున్న నిర్ణయాన్ని వివరించాడు. మంగళూరు శివార్లలోని ఒక పట్టాదారు భూమి నుండి తరచుగా కౌలుదారులను తొలగించే తన తండ్రి కోసం అతను న్యాయవాదిగా దావాలతో పోరాడాలని అతను భావించలేదు. దానికి బదులుగా పూజారి కావడానికి అతను అధ్యయనాల కోసం పాఠశాలలో చేరాడు [13] అతను 16 సంవత్సరాల వయస్సులో బెంగుళూరు లోని సెయింట్ పీటర్స్ పాఠశాలకు వెళ్ళాడు. రోమన్ కాథలిక్ మతగురువుగా శిక్షణ పొందాడు. 1946 నుండి 1948 వరకు రెండున్నర సంవత్సరాలు తత్వశాస్త్రం అభ్యసించాడు, మతాధిపతులు మంచి ఆహారం తిన్నారని, పాఠశాల విద్యార్థులకంటే కంటే ఎత్తైన బల్లల మీద కూర్చున్నందుకు అతని 19 సంవత్సరాల వయస్సులో భయపడి, పూర్తిగా నిరాశతో పాఠశాలను విడిచిపెట్టాడు. అతను తరువాత తన తప్పును ఒప్పుకుంటూ "నేను భ్రమపడ్డాను, ఎందుకంటే చర్చికి సంబంధించిన ఆదేశానికి, ఆచరణకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది." అని చెప్పాడు. అతను 19 సంవత్సరాల వయస్సులో సంఘసేవ ప్రారంభించాడు. రోడ్డు రవాణా పరిశ్రమలో, మంగళూరులోని హోటళ్ళు, రెస్టారెంట్లలో దోపిడీకి గురైన కార్మికులను కూడగట్టాడు,

వృత్తి జీవితం[మార్చు]

ఎన్నికలలో పాల్గొన్న సంక్షిప్త చరిత్ర[మార్చు]

అతను మొదటిసారిగా 1967లో సోషలిస్టుగా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి, బొంబాయిలో కాంగ్రెస్ అగ్రనేత ఎస్.కె.పాటిల్‌ను ఓడించి, 'జార్జ్ ది జెయింట్-కిల్లర్' అనే పేరు సంపాదించాడు. 1977లో బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా జైలులో ఉండగానే పోటీచేసి విజయం సాధించాడు. భారతదేశం లోని మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అతను మంత్రి అయ్యాడు. 1979లో అతను జనతా పార్టీకి రాజీనామా చేసి, చరణ్ సింగ్ విడిపోయిన జనతా పార్టీ (ఎస్)లో చేరాడు. 1980లో ముజఫర్‌పూర్ నుండి మళ్లీ గెలిచాడు. 1984లో బెంగుళూరు నుంచి జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జాఫర్ షరీఫ్ చేతిలో ఓడిపోయాడు. అతను 1985, 1986 లలో బంకా నుండి జరిగిన ఉపఎన్నికలలో ఓడిపోయాడు.1989, 1991లో అతను తిరిగి బీహార్‌కు రాష్ట్రానికి మారి, రెండుసార్లు ముజఫర్‌పూర్ నుండి జనతాదళ్ అభ్యర్థిగా గెలిచాడు.1994లో లాలూ యాదవ్‌తో విభేదాల కారణంగా జనతాదళ్‌ను వీడి బీజేపీతో పొత్తు పెట్టుకుని సమతా పార్టీని స్థాపించాడు.1996, 1998 ఎన్నికల్లో నలందా నుంచి సమతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు. సమతా పార్టీ జనతాదళ్ (యునైటెడ్)లో విలీనమైన తరువాత 1999లో నలందా నుంచి మళ్లీ గెలుపొందాడు. 2004లో ముజఫర్‌పూర్ నుంచి గెలిచాడు. 2009లో అతనికి పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ముజఫర్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2009లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 2010లలో, అతను చాలా సంవత్సరాలు అల్జీమర్స్‌తో బాధపడి, 2019 జనవరిలో మరణించాడు.

  • బొంబాయి:1967 (కానీ 1971లో పోటీ చేయలేదు)
  • ముజఫర్‌పూర్: 1977,1980,1989,1991, 2004. (2009లో తిరుగుబాటుదారుడిగా ఓడిపోయాడు)
  • బెంగళూరు:1984లో ఓడిపోయాడు [14]
  • బంకా: 1985, 1986లో జరిగిన ఉప ఎన్నికలలో ఓడిపోయాడు.
  • నలంద: 1996, 1998, 1999
  • రాజ్యసభ: 2009

బొంబాయిలో జీవితం[మార్చు]

చర్చి పాఠశాలను విడిచిపెట్టిన తర్వాత, ఫెర్నాండెజ్ ఉద్యోగం వెతుక్కుంటూ 1949లో బొంబాయికి వెళ్లాడు. బొంబాయిలో అతని జీవితంచాలా కష్టంగా గడిపాడు. అతను వార్తాపత్రికలో ప్రూఫ్ రీడర్‌గా ఉద్యోగం పొందే వరకు వీధుల్లో పడుకున్నాడు.[15] అతను తన ప్రారంభ జీవితం గురించి ఇలా చెప్పాడు, "నేను బొంబాయికి వచ్చినప్పుడు, నేను చౌపాటీ ఇసుక బెంచీల మీద పడుకునేవాడిని, అర్ధరాత్రి పోలీసులు వచ్చి నన్ను నిద్రలేపి అక్కడనుండి వెళ్లమని చెప్పేవారు." [16] అతను తన జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపిన ప్రముఖ యూనియన్ నాయకుడు ప్లాసిడ్ డి'మెల్లో, సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియాతో పరిచయం ఏర్పడింది.[15][17] తరువాత అతను సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేరాడు. అతను ట్రేడ్ యూనియన్ ప్రముఖ నాయకుడుగా ఎదిగాడు. హోటళ్ళు, రెస్టారెంట్లు వంటి చిన్న తరహా సేవా పరిశ్రమలలో కార్మికుల హక్కుల కోసం పోరాడాడు. 1950వ దశకం ప్రారంభంలో బొంబాయి కార్మిక ఉద్యమంలో కీలక వ్యక్తిగా వెలుగొందిన ఫెర్నాండెజ్ 1950లలో బొంబాయి కార్మిక వర్గాలను సంఘటితం చేయడంలో ప్రధాన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కార్మికుల తరుపున నాయకుడుగా, వారి శ్రామిక శక్తి తగాదాలలో కంపెనీ గూండాలను ఎదిరించినప్పుడు అతను అనేకసార్లు జైలు శిక్షలను అనుభవించాడు.[18] అతను 1961లో బొంబాయి నగరపాలక సంస్థకు జరిగిన పౌర ఎన్నికలలో గెలిచి, 1968 వరకు సభ్యునిగా పనిచేశాడు.1968 వరకు, మహానగర ప్రాతినిధ్య సంస్థలో దోపిడీకి గురైన కార్మికుల సమస్యలను నిరంతరం లేవనెత్తాడు. 1967 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయ సమయం ఫెర్నాండెజ్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ఎస్.కె. పాటిల్‌కు వ్యతిరేకంగా సంయుక్త సోషలిస్ట్ పార్టీ, అతనికి బొంబాయి దక్షిణ నియోజకవర్గం పార్టీ టిక్కెట్‌ను ఆఫర్ చేసింది. పాటిల్ రెండు దశాబ్దాల అనుభవం కలిగిన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, అయినప్పటికీ ఫెర్నాండెజ్ 48.5 శాతం ఓట్లను సంపాదించి గెలుపొందాడు. తద్వారా అతను "జార్జ్ ది జెయింట్‌కిల్లర్" అనే మారుపేరు సంపాదించాడు. ఊహించని ఓటమితో పాటిల్ రాజకీయ జీవితం ముగిసింది.[19] బొంబాయిలో 1960ల ద్వితీయార్థంలో సమ్మె చర్యల పెరుగుదలలో ఫెర్నాండెజ్ కీలక నాయకుడిగా ఎదిగాడు.అయితే 1970ల ప్రారంభం నాటికి, అతని నాయకత్వం ప్రేరణ చాలా వరకు కనుమరుగైంది. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ జనరల్ కార్యదర్శి, 1973లో సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడుగా ఎంపికయ్యాడు. 1970ల తర్వాత, బొంబాయిలో పెరుగుతున్న ప్రైవేట్ రంగ పరిశ్రమలలో ఫెర్నాండెజ్ కార్యకలాపాల ప్రమేయం పెద్దగా లేదు.

1974 రైల్వే సమ్మె[మార్చు]

అతను అఖిల భారత రైల్వేమెన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫెర్నాండెజ్ నిర్వహించిన అత్యంత ముఖ్యమైన సమ్మె, 1974లో జరిగిన అఖిల భారత రైల్వే సమ్మె వలన దేశం మొత్తం రవాణా స్తంభించింది.సమ్మెకు రెండు దశాబ్దాల క్రితమే రైల్వే కార్మికులు చేపట్టిన ఆందోళనల ఫలితంగా ఈ సమ్మె జరిగింది. 1947, 1974 మధ్య మూడు పే కమిషన్లు ఉన్నప్పటికీ, వాటిలో ఏవీ కార్మికుల జీవన ప్రమాణాన్ని పెంచలేదు. 1974 మే 8న సమ్మె ప్రారంభించడానికి అన్నిప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అన్ని రైల్వే సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు సిద్దమై కలిసి నిర్ణయం తీసుకుని, దానికోసం 1974 ఫిబ్రవరిలో రైల్వే స్ట్రగుల్ జాతీయ కోఆర్దినేటింగ్ కమిటీని (NCCRS) స్థాపించారు [20] బొంబాయిలో, విద్యుత్, రవాణా కార్మికులు, అలాగే టాక్సీ డ్రైవర్లు నిరసనలలో పాల్గొన్నారు. బీహార్‌లోని గయాలో, సమ్మె చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు రైల్వే ట్రాక్ పై చతికిలబడ్డాయి.[20] సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు మద్రాసు లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చెందిన 10,000 మందికి పైగా కార్మికులు దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలు వెల్లువెత్తాయి.[20]

ఆర్థిక సంక్షోభం సమయంలో 1974 మే 8న ప్రారంభమైన సమ్మె బలమైన ప్రభుత్వ ప్రతిచర్యలను, భారీ అరెస్టులను రేకెత్తించింది.[21] అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం, 30,000 మంది ట్రేడ్ యూనియన్ వాదులును నిర్బంధించినట్లు, వీరిలో ఎక్కువ మంది ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల క్రింద ఉంచినట్లు తెలిసింది. అరెస్టయిన వారిలో సమ్మె యాక్షన్ కమిటీ సభ్యులు, ట్రేడ్ యూనియన్‌లు మాత్రమే కాకుండా సమ్మెలో పాల్గొన్న రైల్వే సిబ్బంది ఉన్నారు. 1974 మే 27న యాక్షన్ కమిటీ ఏకపక్షంగా సమ్మెను విరమించుకుంది. తరువాత ఫెర్నాండెజ్ "సమ్మె నిర్వహిస్తున్న వారు వేర్వేరు స్వరాలతో మాట్లాడటం ప్రారంభించినందున సమ్మె విరమించబడింది." అని వివరించాడు. పెద్ద సంఖ్యలో ఖైదీలు విడుదల చేయబడినప్పటికీ, వారిలో ఫెర్నాండెజ్, ఇంకా వేలాది మందిపై నిర్దిష్ట నేరాలు మోపబడి నిర్బంధంలో ఉన్నారు. సమ్మె అభద్రతా భావానికి దారితీసింది. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసింది. మునుపటి సమ్మెలు, కంపెనీలు లేదా పరిశ్రమలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఈ సమ్మె ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. దాని పరిణామాల నుండి భారతదేశ చరిత్రలో అత్యంత వినాశకరమైన పారిశ్రామిక చర్యలలో అత్యంత విజయవంతమైందిగా నిరూపించబడింది.[21]

మూలాలు[మార్చు]

  1. Gupta, Smita (24 October 2013). "Now a Samata Manch to build anti-Congress platform". The Hindu. Archived from the original on 26 December 2013. Retrieved 18 May 2014.
  2. Sharma, Surender (1 July 2010). "By George! It's out on the street". MiD DAY. Archived from the original on 2 March 2012. Retrieved 3 September 2010. As if it had not earned enough bad name and publicity for one of the most veteran politicians and trade unionist George Fernandes, claimants to his legacy slug it out in streets on Wednesday.
  3. "Biographical Sketch (Member of Parliament: 13th Lok Sabha)". Parliament of India. Archived from the original on 12 August 2010. Retrieved 12 September 2010.
  4. "Shri George Fernandes General Information". Government of Bihar. Archived from the original on 22 July 2011. Retrieved 3 September 2010.
  5. "Fernandes: Popular but controversial minister". BBC. 15 March 2001. Archived from the original on 3 March 2012. Retrieved 3 September 2010.
  6. "Why despite several controversial moves, George Fernandes continues to inspire us". www.dailyo.in.
  7. "The loneliness of George Fernandes". The Hindu. 21 April 2009 – via www.thehindu.com.
  8. "George Fernandes, former Defence Minister, passes away". The Hindu. 29 January 2019. Archived from the original on 29 January 2019. Retrieved 29 January 2019. Former Defence Minister George Fernandes passed away on Tuesday in New Delhi, according to family members. He was 88. Mr. Fernandes had been diagnosed with Alzheimer's disease. The family is awaiting his son Sean Fernandes' arrival from the United States to proceed with funeral arrangements. The funeral is scheduled to be held in New Delhi. 'We are saddened to announce the passing of Shri George Fernandes early this morning. Mr. Fernandes was attended to at his home by a Max Healthcare team, which found him unresponsive and declared him dead at 06:42AM on January 29th, 2019,' Max Healthcare hospital said in a statement.
  9. "Padma awards for George, Vashishtha & six others from state". The Times of India. 26 January 2020. Retrieved 26 January 2020.
  10. "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 26 January 2020. Retrieved 26 January 2020.
  11. "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. Retrieved 25 January 2020.
  12. 12.0 12.1 Lasrado, Richie. "A Knight in Shining Armour (A profile of union defence minister George Fernandes)". Daijiworld Media Pvt Ltd Mangalore. Archived from the original on 28 June 2009. Retrieved 1 January 2010.
  13. 13.0 13.1 "Kuch lamhe fursat ke – George Fernandes, a life". E TV. 27 March 2015.
  14. "1984 India General (8th Lok Sabha) Elections Results".
  15. 15.0 15.1 "George Fernandes". Hindustan Times. 1 January 2001. Archived from the original on 3 March 2012. Retrieved 3 September 2010.
  16. Himmat, Volume 4. R. M. Lala. 1974. p. 6.
  17. "The Vajpayee cabinet: All old timers minus one". Rediff. 13 October 1999. Archived from the original on 3 March 2012. Retrieved 3 September 2010.
  18. "George Fernandes". The Times of India. 27 June 2003. Archived from the original on 8 June 2011. Retrieved 8 August 2010. In his salad days, he served many prison terms as a labour organiser when his workforce squabbled with hired company thugs.
  19. Pai, Rajeev D. (2 April 2004). "When George Fernandes Humbled the 'king'". Rediff. Archived from the original on 3 March 2012. Retrieved 7 August 2010.
  20. 20.0 20.1 20.2 Shridhar, V. (15–28 September 2001). "Chronicle of a strike". Frontline. Vol. 18, no. 19. Archived from the original on 3 March 2012. Retrieved 9 August 2010.
  21. 21.0 21.1 Doctor, Vikram (6 July 2010). "Real and sham bandhs". The Economic Times. Archived from the original on 3 March 2012. Retrieved 7 August 2010.

వెలుపలి లంకెలు[మార్చు]