Jump to content

జార్జ్ రెడ్డి (సినిమా)

వికీపీడియా నుండి
జార్జ్ రెడ్డి[1][2][3]
జార్జ్ రెడ్డి సినిమా పోస్టర్
దర్శకత్వంబి. జీవన్ రెడ్డి[4]
రచనజీవన్ రెడ్డి
నిర్మాతఅప్పిరెడ్డి
సుధాకర్ రెడ్డి యక్కంటి
సంజయ్ రెడ్డి
దామురెడ్డి
తారాగణంసందీప్ మాధవ్
సత్యదేవ్ కంచరాన
తిరువీర్
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి యక్కంటి
కూర్పుజె. ప్రతాప్ కుమార్
సంగీతంహర్షవర్ధన్ రామేశ్వర్
సురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
మైక్ మూవీస్
త్రీ లైన్ సినిమాస్
సిల్లీ మాంక్స్ స్టూడియోస్
పంపిణీదార్లుఅభిషేక్ పిక్చర్స్[5]
విడుదల తేదీ
22 నవంబరు 2019 (2019-11-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

జార్జ్ రెడ్డి అనేది 2019, నవంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. 1967 నుండి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉంటూ, తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి[6] జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

చిన్న‌ప్ప‌టి నుంచీ అన్యాయాలను ఎదుర్కొనే స్వ‌భావం కలిగిన జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌), తన తల్లి (దేవిక) చెప్పే వీరుల క‌థ‌లు వింటూ పెరుగుతాడు. చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండడంతోపాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేరి అక్క‌డి త‌ప్పుల్ని ప్ర‌శ్నిస్తూ విద్యార్థుల‌లో చైత‌న్యం ర‌గిలించి నాయ‌కుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో యూనివర్సిటీలో మాయ (ముస్కాన్‌), దస్తగిరి (పవన్‌ రమేష్), రాజన్న (అభయ్‌)లతో జార్జిరెడ్డికి పరిచయం ఏర్పడుతుంది. ఉస్మానియా క్యాంప‌స్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తి, మూడు విద్యార్థి సంఘాల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. తమ రాయకీయ మనుగడకు అడ్డు వస్తున్నాడన్న నెపంతో విద్యార్థి నాయకులైన సత్య (సత్యదేవ్‌), అర్జున్‌ (మనోజ్‌ నందం), లలన్ (తిరువీర్) లు జార్జిరెడ్డిపై పగను పెంచుకొని అతడిని అంతమొందించాలి అనుకుంటారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో జార్జిరెడ్డి చంపుతారు.[7][8][9]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: బి. జీవన్ రెడ్డి
  • నిర్మాత: అప్పిరెడ్డి, సుధాకర్ రెడ్డి యక్కంటి, సంజయ్ రెడ్డి, దామురెడ్డి
  • సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి
  • ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి
  • కూర్పు: జె. ప్రతాప్ కుమార్
  • నిర్మాణ సంస్థ: మైక్ మూవీస్, త్రీ లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
  • పంపిణీదారు: అభిషేక్ పిక్చర్స్

పాటలు

[మార్చు]
జార్జ్ రెడ్డి
పాటలు by
సురేష్ బొబ్బిలి
Released2019
Recorded2019
Genreసినిమా పాటలు
Length19:14
Labelమధుర ఆడియో
Producerసురేష్ బొబ్బిలి
సురేష్ బొబ్బిలి chronology
తిప్పరా మీసం
(2019)
జార్జ్ రెడ్డి
(2019)
అక్షర
(2019)
External audio
పాటల అధికారిక వీడియో యూట్యూబ్లో

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా,[12][13] మధుర ఆడియో ద్వారా పాటలు విడుదల అయ్యాయి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అడుగు అడుగు (రచన: మేఘ్ రాజ్)"మేఘ్ రాజ్రేవంత్04:08
2."బుల్లెట్ (రచన: మిట్టపల్లి సురేందర్)"మిట్టపల్లి సురేందర్మంగ్లీ(సత్యవతి)03:25
3."విజయం (రచన: చైతన్య ప్రసాద్)"చైతన్య ప్రసాద్అనురాగ్ కులకర్ణి03:39
4."నాలాగే అన్నీ నాలాగే (రచన: చరణ్ అర్జున్)"చరణ్ అర్జున్చరణ్ అర్జున్05:55
5."జాజిమోగులాలి (రచన: విశ్వాస్)"విశ్వాస్ఇంద్రవతి03:07
మొత్తం నిడివి:19:14

విడుదల

[మార్చు]

జార్జ్ రెడ్డి 2019, నవంబరు 22న విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర పంపిణీ హక్కులను కొనుగోలు చేసిన అభిషేక్ పిక్చర్, నైజాం పంపిణీ హక్కులను గ్లోబల్ సినిమాస్‌కు విక్రయించింది.[14] విదేశీ హక్కులను వీకెండ్ సినిమా, మైక్ మూవీస్ సంస్థలు తీసుకొని యు.ఎస్.ఏలో విడుదలచేస్తున్నాయి.[15]

ప్రచారం

[మార్చు]

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ 2019, ఆగస్టు 1న విడుదల అయింది.[16] ట్రైలర్ 2019, అక్టోబరు 8న విడుదల అయింది.[17]

స్పందన

[మార్చు]
  1. టైమ్స్ ఆఫ్ ఇండియా – 3.5/5[18]
  2. ది ఇండియన్ – 3/5[19]
  3. ది వీక్ - 3.75/5[20]
  4. ఫస్ట్ పోస్ట్ - 2.5/5[21]
  5. గ్రేట్ఆంధ్ర - 2.5/5[22]

మూలాలు

[మార్చు]
  1. "George Reddy: Story of a reble". The Hindu.
  2. "Trailer of 'George Reddy' portrays life of Osmania Uni's own Che Guevara". The News Minute.
  3. "Che Guevara of Osmania University". Hans India.
  4. "Cinema is my passion: Jeevan Reddy". Deccan Chronicle.
  5. "Abhishek Nama Acquires George Reddy". Gulte.com.
  6. "A biopic on student leader". Hans India.
  7. ఈనాడు, సినిమా (22 November 2019). "రివ్యూ: జార్జిరెడ్డి". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2019. Retrieved 26 November 2019.
  8. సాక్షి, సినిమా (22 November 2019). "'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 22 November 2019. Retrieved 26 November 2019.2.75/5 stars
  9. BBC News తెలుగు (23 November 2019). "జార్జి రెడ్డి - 'ది ఫైటర్' - సినిమా రివ్యూ". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  10. "Sandeep Madhav, Satyadev Knit the Story of 'Forgotten Leader' in George Reddy". news18.
  11. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (1 August 2019). "విప్లవమే జీవితం". www.ntnews.com. Archived from the original on 2 August 2019. Retrieved 21 November 2019.
  12. "George Reddy (Original Motion Picture Soundtrack), an album by Suresh Bobbili". Spotify. Retrieved 20 November 2019.
  13. "George Reddy Jukebox-George Reddy Songs-Sandeep Madhav-Suresh Bobbili-Jeevan Reddy". Socialnews.xyz. 20 November 2019. Retrieved 20 November 2019.
  14. "Theatrical rights of George Reddy in Nizam bought by Global Cinemas". Times of India. 10 October 2019. Retrieved 20 November 2019.
  15. "George Reddy Movie USA Theaters List Poster". Socialnews.xyz. 19 November 2019. Retrieved 20 November 2019.
  16. "First look poster: Presenting Sandeep Madhav as George Reddy-Story of a forgotten student leader". Times of India. 3 August 2019. Retrieved 20 November 2019.
  17. "'George Reddy' trailer: A rousing tale of a forgotten leader". Times of India. 9 October 2019. Retrieved 20 November 2019.
  18. "George Reddy Movie Review". The Times of India. 22 November 2019. Retrieved 22 November 2019.3.5/5 stars
  19. "George Reddy movie review: A timely film about student activism". The Indian Express. 22 November 2019. Retrieved 22 November 2019.3/5 stars
  20. "'George Reddy' review: An impressive tribute to the youth icon". The Week. 22 November 2019. Retrieved 22 November 2019.3.75/5 stars
  21. "George Reddy — Man of Action movie review". Firstpost. 22 November 2019. Retrieved 22 November 2019.2.5/5 stars
  22. "George Reddy Review: Lacks Effectiveness". Great Andhra. 22 November 2019. Retrieved 22 November 2019.2.5/5 stars

ఇతర లంకెలు

[మార్చు]