జార్జ్ సోరోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
George Soros
George Soros - World Economic Forum Annual Meeting Davos 2010.jpg
George Soros at the World Economic Forum Annual Meeting 2010
జననం (1930-08-12) 1930 ఆగస్టు 12 (వయస్సు: 89  సంవత్సరాలు)
Budapest, Hungary
విద్యాసంస్థలుLondon School of Economics
వృత్తిEntrepreneur, currency trader, investor, philosopher, philanthropist, political activist
అసలు సంపదIncrease $14.0 billion (Forbes)[1]
మతంJudaism;
Atheism.[2]
జీవిత భాగస్వామిTwice divorced (Annaliese Witschak and Susan Weber Soros)
పిల్లలుRobert, Andrea, Jonathan, Alexander, Gregory
వెబ్ సైటుwww.georgesoros.com

జార్జ్ సోరోస్ (మూస:PronEng లేక /ˈsɔrəs/, [3] ఒక హంగేరియన్ మూస:IPA2; 1930 ఆగస్టు 12 నాడు ష్వార్ట్స్ గ్యోరగి ) గా జన్మించిన అయన ఒక హంగేరియన్-అమెరికన్ కరన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.[4] 1992 బ్లాక్ వేడ్నెస్ డే UK కరన్సి సంక్షోభ సమయములో ఆతను $1 బిలియను సంపాదించాడని చెప్పుకోబడుతుంది. అందువల్ల అతను "బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ ని పడగొట్టిన వ్యక్తి" అని పిలవబడుతాడు.[5][6]

సోరోస్ ఫండ్ మానేజ్మెంట్ కు, ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్కు సోరోస్ అధ్యక్షుడు మరియు కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ యొక్క పాలక మండలిలో పూర్వ సభ్యుడు. హంగరీలో కమ్యునిజం నుండి కేపిటలిసానికి విధాన మార్పిడి జరిగినప్పుడు (1984-89, [6] అది శాంతియుతంగా జరిగేలా చూడడంలో అతను ముఖ్య పాత్ర పోషించాడు. ఉన్నత విద్యకు గాను ఐరోపా లోనే అత్యధిక నిధులు బుడాపెస్ట్ లోని సెంట్రల్ యురోపియన్ యూనివర్సిటికి సమకూర్చాడు.[7] తరువాత జియార్జియాలో రోస్ విప్లవానికి అతను అందించిన నిధులు మరియు చేసిన నిర్వాహణ వల్లే అది విజయవంతమయిందని రష్యా మరియు పాశ్చాత్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో అధ్యక్షుడు జార్జ్ డబల్యు.బుష్ 2004లో రెండవ సారి ఎన్నికలో పోటీ చేసినప్పడు, అతను ఓటమికి పెద్ద మొత్తములో డబ్బు ఇచ్చాడు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ని స్థాపించడంలో అతను సహాయ పడ్డాడు.

సోరోస్ వ్రాసిన ది అల్కేమి అఫ్ ఫైనాన్స్ అనే పుస్తకానికి 2003లో మాజీ ఫెడేరల్ రిసర్వ్ అధ్యక్షుడు పాల్ వోల్కేర్ వ్రాసిన ముందు మాటలో ఈ విధంగా వ్రాశారు:

జార్జ్ సోరోస్ ఒక స్పెకులేటర్ గా అద్భుత విజయాలు సాధించారు. ఆ రంగము నుండి సరైన సమయములో తెలివిగా వైదొలిగారు. అయన బ్రహ్మాండమైన సంపాదనలో పెద్ద భాగము మార్పు చెందుతున్న మరియు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు'స్వేచ్చా సమాజముగా' మారడానికి ప్రోత్సాహించడానికి వాడబడుతుంది. వ్యాపార రీత్యానే కాకుండా, క్రొత్త ఆలోచనలని, అభిప్రాయాలని, ప్రవర్తనలని గౌరవించడంలో కూడా మార్పు రావాలనేదే అయన ఉద్దేశ్యం.

కుటుంబం[మార్చు]

సోరోస్ బుడాపెస్ట్, హంగేరీలో ఎస్పెరంటిస్ట్ రచయిత అయిన టివడార్ సోరోస్కు జన్మించాడు. టివడర్ (టియోడోరో అని కూడా పిలవబడుతుంది) ఒక హంగేరియన్ యూదుడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయములోనూ, ఆ తర్వాతనూ, అతను ఒక యుద్ధ ఖైదీగా ఉన్నారు. తరువాత, అతను రష్యా నుండి తప్పించుకుని పారిపోయి మళ్ళీ బుడాపెస్ట్ లోని తన కుటుంబముతో కలుస్తాడు.[8][9]

ఫాసిజంకు ఆదరణ పెరిగి, జ్యూస్ కు వ్యతిరేకత పెరుగుతుండటంతో, ఆ కుటుంబము 1936లో ష్వార్ట్స్ నుండి సోరోస్ కు పేరు మార్చుకుంది. ఆ పేరు కచిక పదం కావడం, దానికి ఒక అర్ధం ఉండటం వల్ల టివాడర్ కు క్రొత్త పేరు నచ్చింది. కాఫ్మాన్ యొక్క స్వీయచరిత్రలో ఈ పదము యొక్క అర్ధం వ్రాయనప్పటికి, హంగేరియన్ భాషలో సోరోస్ అంటే "వరుసలో మరుసటిది లేక నియమించబడిన వారుసుడు" అని అర్ధం. ఎస్పెరాంటో భాషలో, దానికి "ఎగురుతుంది" అని అర్ధం.[10] అతని కొడుకైన జార్జ్ కు పుట్టినప్పటినుండి ఎస్పెరాంటో భాష నేర్పబడింది. అందవల్ల, ఆతను ఎస్పెరాంటో మాతృభాషగా ఉన్నఅతి తక్కువ మందిలో ఒకరు అయ్యారు. తాను ఒక యూదుడి ఇంటిలో పెరిగానని, వారు మత ఆచారాల విషయములో చాలా జాగ్రత్తగా ఉండేవారని జార్జ్ సోరోస్ తరువాత చెప్పారు.[11]

జార్జ్ సోరోస్ రెండు సార్లు వివాహం చేసుకుని విడాకులు ఇచ్చారు. అయన ముందు అన్నలీస్ విట్స్చాక్ ని తరువాత సుసాన్ వేబర్ సోరోస్ని వివాహం చేసుకున్నారు. అతనికి ఐదుగురు పిల్లలు: రాబర్ట్, ఆండ్రీ, జోనాథన్ (మొదటి భార్య అన్నలీస్ కు పుట్టినవారు) ; అలెక్సాన్డర్, గ్రెగరీ (రెండవ భార్య సూసన్ కు పుట్టినవారు). అతని పెద్ద అన్నయ్య అయిన పాల్ సోరోస్ ఒక ప్రైవేట్ పెట్టుబడిదారు మరియు పరోపకారి. అయన పదవీవిరమణ చేసిన ఇంజినీర్. సోరోస్ అసోసియేట్స్ అనే ఒక అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థని న్యూ యార్క్ లో స్థాపించారు. అయన యువ అమెరికన్లకు పాల్ అండ్ డైసీ సోరోస్ ఫెలో షిప్ లు ఏర్పరిచారు.[12][13] జార్జ్ సోరోస్ యొక్క మేనల్లుడు మరియు పాల్ సోరోస్ కొడుకైన పీటర్ సోరోస్ పూర్వపు ఫ్లోర ఫ్రాసర్ని వివాహం చేసుకున్నారు. ఆమె లేడీ ఆంటోనియా ఫ్రాసర్ మరియు దివంగత సర్ హ్యు ఫ్రాసర్ యొక్క కూతురు మరియు 2005 నోబెల్ పురస్కార గ్రహీత దివంగత హెరాల్డ్ పింటర్ యొక్క సవతి కూతురు.[14]

బాల్యం[మార్చు]

మార్చి 1944లో నాజి జర్మనీ హంగేరీ మీద సైన్య ఆధిక్యత సాధించినప్పుడు సోరోస్ వయస్సు పదమూడు ఏళ్ళు.[15]

హంగేరి నాజీల ఆక్రమణలో ఉన్నప్పుడు యూదులకు వ్యతిరేకంగా బలవంతంగా చర్యలు చేప ట్టటానికి ఏర్పరచిన జ్యూయిష్ కౌన్సిల్, [8]కు సోరోస్ పనిచేశాడు. రచయిత మైకేల్ లూయిస్కు పిమ్మట సోరోస్ ఆ కాలమును ఈ విధముగా వివరించారు:

దేశం విడిచి వెళ్ళిపోమని తెలియచేసే నోటీసు లని ఇవ్వడమని జ్యుయిష్ కౌన్సిల్ చిన్న పిల్లలకు చెప్పేది. నన్ను జ్యుయిష్ కౌన్సిల్ కు రమ్మని చెప్పేవారు. అక్కడ నాకు ఈ చిన్న స్లిప్పులు ఇచ్చేవారు... ఆ స్లిప్పులో ప్రొద్దున 9 గంటకు రబ్బీ సేమినరికి రమ్మని సమాచారం ఉండేది...నాకు పేర్లు ఉన్న ఒక జాబితా ఇచ్చారు. నేను ఈ పేపర్ ని నా తండ్రి కి చూపించాను. .ఆయనా దాన్ని వెంటనే గుర్తు పట్టారు. ఇది హుంగేరి లోని జుయిష్ న్యాయవాదుల పేర్లు కలిగిన జాబితా.

"ఈ స్లిప్పులని ఇచ్చీసి, వారు కనుక వస్తే వారిని దేశమునుండి పంపించేస్తారు అని చెప్పమని చెప్పారు.[16]"

నాజీలు తన కొడుకుని పట్టుకోవడాన్ని తప్పించడానికి, సోరోస్ తండ్రి వ్యవసాయ మంత్రిత్వానికి చెందిన ఒక ఉద్యోగికి డబ్బు ఇచ్చి, 1944 వేసవిలో సోరోస్ ని తన గాడ్ సన్ అని చెప్పుకుంటూ తనతోనే పెట్టుకున్నారు. అధికారులు యూదుల ఆస్తులని జప్తు చేస్తున్న సమయములో కూడా, తాను ఒక యూదుడు అనే విషయాన్ని యువ సోరోస్ దాచి పెట్టవలసి వచ్చింది.[17]

మరుసటి ఏడాది, సోవియట్లు జర్మన్ లు నగరమంతా ఇంటింటా పోట్లాడిన బుడాపెస్ట్ యుద్ధము జరిగింది. ఆ యుద్ధమునుండి సోరోస్ ప్రాణాలతో బయటపడగలిగాడు. 1945-1946 లో హంగేరిలో మితిమీరిన ద్రవ్యోల్బణ పరిస్థితి నెలకొన్నప్పుడు, మొదటి సారిగా సోరోస్ కరన్సీలు, నగలు వ్యాపారం చేశాడు.

1947 లో సోరోస్ ఇంగ్లాండ్ కు వలసవచ్చి, 1952లో లండన్ స్కూల్ అఫ్ ఎకనమిక్స్ నుండి గ్రేడువేషన్ పూర్తి చేశాడు. తత్వవేత్త కార్ల్ పోప్పేర్ దగ్గర చదువుతూ ఉన్న సమయములో, సోరోస్ ఒక రైల్వే కూలి గాను వైటర్ గాను పనిచేశాడు. సోరోస్ కోసం ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడు సహాయం కోరగా, క్వేకర్ చారిటి నుండి 40 పౌండ్ లు లభించాయి.[18] చివరిగా, సింగెర్ & ఫ్రైడ్ లాన్డేర్ అనే లండన్ వర్తక బ్యాంకులో ఒక ప్రారంభ స్థాయి ఉద్యోగిగా చేరాడు.

== వలసపోవడం

==

1956లో, సోరోస్ న్యు యార్క్ సిటికి తన స్థావరాన్ని మార్చుకుని, 1956 నుండి 1959 వరకు F.M.మయేర్ సంస్థలో ఆర్బిట్రేజ్ వర్తకుడుగానూ, 1959 నుండి 1963 వరకు వెర్తీం అండ్ కంపనీలో ఒక విశ్లేషకుడుగానూ పనిచేశాడు. ఈ సమయములో కార్ల్ పోప్పేర్ యొక్క ఆలోచనల మీద ఆధారపడిన "ప్రతివర్తిత్వం" అనే తత్వాన్ని సోరోస్ రూపొందించాడు. సోరోస్ అభిప్రాయం ప్రకారం, ప్రతివర్తిత్వానికి నిర్వచనం ఏమంటే ఒక మార్కెట్ యొక్క విలువని ఆ మార్కెట్లో పాల్గొనేవారు అట్టిపెట్టుకుని ఉంటే దానివల్ల ఆ మార్కెట్ యొక్క విలువ ఒక "మంచి లేదా చెడు" వలయ రీతిలో ప్రభావం చూపుతుంది అని.[19]

అయితే తన సొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టినప్పుడే, ఈ ప్రతివర్తిత్వం పద్ధతి ద్వారా డబ్బు సంపాదించడం వీలవుతుందని త్వరలోనే సోరోస్ తెలుసుకున్నాడు. పెట్టుబడుల వ్యవహారాల గురించి అన్వేషించడం మొదలుపెట్టాడు. 1963 నుండి 1973 వరకు అతను అర్న్ హోల్డ్ అండ్ ఎస్. బ్లేయిక్ రోడేర్ సంస్థలో పనిచేసి, అక్కడ ఉపాద్యక్షుడి స్థాయికి ఎదిగాడు. ఒక తత్వవేత్త లేక ఒక వ్యవహారవేత్త వలే కంటే కూడా తాను ఒక పెట్టుబడిదారుడిగా విజయం సాధించవచ్చని సోరోస్ నిర్ణయానికి వచ్చాడు. ఫస్ట్ ఈగెల్ అనే ఒక పరదేసీ పెట్టుబడి నిధిని స్థాపించమని, తానే ఆ నిధిని నిర్వహిస్తానని ఆతను 1967 లో తన సంస్థని ఒప్పించాడు; 1969లో ఆ సంస్థ సోరోస్ కొరకు డబల్ ఈగెల్ హెడ్జ్ ఫండ్ అనే రెండవ నిధిని కూడా స్థాపించింది.[19]

పెట్టుబడుల నియంత్రాల వల్ల తనకు కావలసిన విధముగా ఆ నిధులని నిర్వహించలేక పోయినప్పుడు, 1973లో అతను తన పదవికి రాజీనామా చేసి, ఒక ప్రైవేట్ పెట్టుబడుల సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ తరువాత క్వాంటం ఫండ్గా రూపు దాల్చింది. ఒక రచయితగా మరియు ఒక తత్వవేత్తగా ఉండటానికి తనకు అవసరమైన డబ్బుని వాల్ స్ట్రీట్లో సంపాదించడమే తన ఉద్దేశంగా ఉండేదని అతను తరువాత చెప్పాడు. దీనికి ఇదు సంవత్సరాల తరువాత $500,000 సరిపోతుందని అతను అంచనా వేశాడు.

కార్లైల్ గ్రూప్లో కూడా అతను పూర్వ సభ్యుడు.[19]

వ్యాపారం[మార్చు]

సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్ని సోరోస్ స్థాపించాడు. 1970లో జిమ్ రోజర్స్తో కలిసి అతను క్వాంటం ఫండ్ని స్థాపించాడు. ఈ సంస్థే, సోరోస్ సంపద లోని సింహభాగాన్ని సృష్టించింది. 1980లో రోజర్స్ ఈ ఫండ్ నుండి వైదొలిగాడు. విక్టర్ నీడేర్ హోఫెర్, స్టాన్లీ డ్రకెన్ మిల్లెర్ ఈ ఫండ్ లో భాగస్వామ్యం కలిగిన వారిలో ఇతరులు.

2007లో క్వాంటం ఫండ్ దాదాపుగా 32% లాభం తేవటంతో సోరోస్ $2.9 బిలియన్లు సంపాదించాడు.[20]

కరెన్సీ స్పెకులేషన్[మార్చు]

బ్లాక్ వేడ్నెస్డే అని పిలవబడుతున్న 1992 సెప్టెంబరు 16 నాడు సోరోస్ ఫండ్ పౌండ్ స్టెర్లింగ్ కరన్సీని $10 బిలియను కంటే ఎక్కువగా షార్ట్ సెల్లింగ్ చేసింది.[ఉల్లేఖన అవసరం] యురోపియన్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజంలో భాగస్వామిగా ఉన్న ఇతర దేశాల స్థాయికి వడ్డీ రేటులని పెంచడానికి గాని కరన్సిని ఫ్లోట్ చేయడానికి గాని బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ విముఖత చూపించడం వల్ల సోరోస్ ఫండ్ మంచి లాభం సాధించింది.

ఎట్టుకేలకు బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ యురోపియన్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం నుండి ఉపసంహరించి, పౌండ్ స్టెర్లింగ్ విలువని తగ్గించింది. దీనివల్ల, సోరోస్ కు US$ 1.1 బిలియన్లు లాభం వచ్చింది. ఈ సంఘటనతో అతనికి "బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ ని పడగొట్టిన వ్యక్తి" అని పేరు వచ్చింది. ఆ బ్లాక్ వేడ్నెస్డే రోజు £3.4 బిలియను నష్టమయిందని 1997లో UK ఖజానా అంచనా వేసింది.

1992 అక్టోబరు 26, సోమవారం నాడు ది టైమ్స్ పత్రిక సోరోస్ చెప్పినట్లుగా ఈ విధముగా ప్రచురించింది: " బ్లాక్ వేడ్నెస్డే రోజు మా మొత్తము పోసిషన్ $10 బిలియను కంటే ఎక్కువగానే ఉంది. అంత కంటే ఎక్కువగా అమ్మాలనదే మా ప్రణాళిక. నిజానికి కరన్సి విలువ తగ్గించడానికి కొంత ముందు దాదాపు $15 బిలియను వరకు ఋణం తీసుకుని పౌండ్ స్టెర్లింగ్ విలువని నిలపెట్టుతామని నార్మన్ లమొంట్ చెప్పినప్పుడు, మాకు తమాషాగా ఉంది ఎందుకంటే మేము అంత మేరకే అమ్మాలని అనుకున్నాము."

సోరోస్ క్రింద వర్తకం చేసే స్టాన్లీ డ్రుకెన్ మిల్లెర్ ముందుగా పౌండ్ యొక్క బలహీనతని గుర్తు పట్టాడు.

"దీంట్లో సోరోస్ పాత్ర ఏమంటే, పౌండ్ స్టెర్లింగ్ లో అతి పెద్ద పోసిషన్ తీసుకునేలాగా ప్రోత్సాహించడమే."[21][22]

1997లో ఆసియా ఆర్ధిక సంక్షోభం సమయములో సోరోస్ తన ఆధీనంలో ఉన్న ధనాన్ని మయన్మార్కి సభ్యత్వం ఇచ్చినందుకు ASEANని శిక్క్షించాలనే ఉద్ధ్యేశంతోనే వాడారని మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ బిన్ మొహమద్ ఆరోపించారు. అయితే సోరోస్ మహాతీర్ యొక్క ఆరోపణలని నిరాకరించాడు. ASEAN యొక్క US డాలర్ GDP 1997లో US$9.2 బిలియనులకు మరియు 1998లో $218.2 బిలియనులకు (31.7%) పడిపోయింది.

=[మార్చు]

బాహాటపు ఊహాజనితాలు ===

మే 2008 లో సోరోస్ వ్రాసిన ది న్యూ పరాడిగం ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే పుస్తకములో ఈ విధముగా వ్రాశాడు: గత 25 సంవత్సరాలుగా మార్కట్ లో రూపు దిద్దుకున్న ఒక "అతి పెద్ద బుడగ" కుప్ప కూలడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక దుర్ఘటనని సూచిస్తూ అతను వ్రాసిన మూడవ పుస్తకము. అతను చెప్పిన ప్రకారం

I have a record of crying wolf.... I did it first in The Alchemy of Finance (in 1987), then in The Crisis of Global Capitalism (in 1998) and now in this book. So it's three books predicting disaster. (After) the boy cried wolf three times . . . the wolf really came.[23]

తన సూచనలు ఎప్పుడు తప్పవుతాయి అనే విషయం తాను ఊహించగలగడమే తన విజయ రహస్యముగా అతను భావిస్తాడు .

I'm only rich because I know when I'm wrong... I basically have survived by recognizing my mistakes. I very often used to get backaches due to the fact that I was wrong. Whenever you are wrong you have to fight or [take] flight. When [I] make the decision, the backache goes away.[23]

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నశించి పోయిందని జార్జ్ సోరోస్ ఫిబ్రవరి 2009 లో చెప్పాడు. అంతే కాక, ఈ సంక్షోభానికి పరిష్కారం ఏమీ దరిదాపుల్లో లేదని కూడా చెప్పాడు.[24]

"ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలడం మనం చూశాము[...] అది జీవన ఆధార ప్రక్రియలో పెట్టబడి ఉంది. ఇప్పుడు కూడా జీవన ఆధార ప్రక్రియలోనే ఉంది. దీని ముగింపు ఇప్పట్లో ఉన్నట్లు సూచనలేమీ కనబడటంలేదు."

=[మార్చు]

ఇన్సైడర్ వర్తక నేరం ===

1988లో, సొసైటీ జేనేరెల్ అనే ఒక ఫ్రాన్స్ బ్యాంకుని కైవసం చేసుకునే ప్రయత్నంలో అతన్ని కూడా పిలిచారు. ఈ ప్రయత్నంలో పాల్గొనడానికి అతను నిరాకరించాడు. కాని తరువాత ఆ కంపెనిలో అనేక షేర్లు కొన్నాడు. 1989లో ఫ్రెంచ్ అధికారులు విచారణ మొదలుపెట్టి, 2002లో అది ఇన్సైడర్ వర్తకమేనని తీర్పు చెప్పింది. ఫ్రెంచ్ చట్టాల ప్రకారం ఇది నేరం కనుక, అతనికి $2.3 మిలియను అపరాధపు రుసుము విధించింది. ఇదే అతను ఇన్సైడర్ సమాచారం ఉపయోగించి పొందిన లాభం.

ఈ కేసుని విచారణకు తీసుకురావడంలో జాప్యం అయినందున ఏ నష్టపరిహారం వేయబడలేదు. తాను మాత్రం ఈ తప్పు చేయలేదని, బ్యాంకుని కైవసం చేయబోతున్న విషయం ఒక బహిరంగ సమాచారమని చెప్పాడు.[25]

ఈ ఇన్సైడర్ వర్తక శిక్షని ఫ్రాన్స్ ఉన్నత న్యాయస్థానం కూడా జూన్ 14న సమర్దించింది.[26] ఈ కేసు విచారణ మొదలుపెట్టడానికి 14 సంవత్సరాలు జాప్యం జరిగినందున తనకు న్యాయం జరగలేదని అతను డిసెంబరు 2006న యూరోపియన్ కోర్ట్ అఫ్ హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశారు.[27]

క్రీడలు[మార్చు]

2005లో నేషనల్ లీగ్కు చెందిన వాషింగ్టన్ నేషనల్స్ని కొనడానికి ప్రయత్నించిన గ్రూప్ లో సోరోస్ ఒక చిన్న భాగస్వామి. సోరోస్ ఏ బేస్బాల్ జట్టు మీదైనా ఎటువంటి ఆసక్తి చూపించనా బేస్ బాల్ యొక్క విశ్వాస-వ్యతిరేక మినహాయింపు గురించి పునరాలోచన చేయవలసి వస్తుందని కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు సూచించారు.[28] 2008లో, AS రోమ అనే ఇటలీకి చెందిన ఒక ఫుట్ బాల్ జట్టుతో సోరోస్ కు సంబంధం ఉన్నట్లు చెప్పబడింది. కాని ఆ క్లబ్ అమ్మబడలేదు. వాషింగ్టన్ సాకర్ L.P. సంస్థకు కూడా సోరోస్ ఆర్ధికంగా సమర్ధించారు. మజర్ లీగ్ సాకర్ క్లబ్ అయిన డి.సి.యునైటెడ్కు హక్కులని, 1995లో ఆ లీగ్ స్థాపించబడిన సమయములో, ఈ సంస్థ పొంది ఉంది. కాని 2000 లో ఈ సంస్థ ఆ హక్కులని కోల్పోయింది.[29]

పరోపకారం[మార్చు]

జార్జ్ సోరోస్ (ఎడమ ప్రక్కన) మరియు జేమ్స్ హెచ్. బిల్లింగ్టన్

1970ల నుండి సోరోస్ ఒక క్రియాశీల పరోపకారిగా ఉంటున్నారు. అప్పుడే అతను జాతి విచక్షణ ఉన్న దక్షిణ ఆఫ్రికాలో నల్లజాతికు చెందిన విద్యార్థులకు కేప్ టౌన్ యునివర్సిటీలో చదవటానికి నిధులు ఇచ్చారు. ఇనుప తెర వెనుక తిరుగుబాటు ఉద్యమాలకు ఆర్ధిక సహాయం చేయడం మొదలు పెట్టాడు.

సోరోస్ చేసిన ఇతర పరోపకారాలలో సోవియట్-తరువాయి దేశాలలో ఆహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యాని నెలకొల్పడానికి ఆర్ధిక సహాయం చేయడం కూడా ఉంది. ముఖ్యంగా మధ్య మరియు తూర్పు ఐరోపాలో జరిగిన ఈ ప్రయత్నాలు, ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ (OSI) మరియు దేశీయ సోరోస్ ఫౌండేషన్ల ద్వారా జరుగుతాయి. ఈ దేశీయ సోరోస్ ఫౌండేషన్ వివిధ పేర్లతో పిలువబడతాయి. (పోలాండ్ లో స్టీఫన్ బాటరీ ఫౌండేషన్ అని పిలవబడుతుంది) 2003 నాటికి అతను మొత్తం $4 బిలియను ఇచ్చినట్లు PBS అంచనా వేసింది.[25] ఇటీవల సంవత్సరాలలో ఏటా $400 మిలియను ఖర్చు పెట్టినట్లు OSI చెబుతుంది.

2007లో టైం పత్రిక రెండు ప్రత్యేక పథకాల గురించి వ్రాసినది - రష్యాలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు ఇంటర్నెట్ వ్యవస్థ స్థాపించడానికి గాను $100 మిలియన్లు; ఆఫ్రికాలో పేదరిక నిర్మూలనకు రూపొందించిన మిల్లీన్నియం ప్రామిస్ క్రింద $50 మిలియన్లు. మరియు U.S పథకాలకు సోరోస్ $742 మిలియన్లు ఇచ్చారని, మొత్తం మీద అతను $6 బిలియన్లు ఇచ్చారని కూడా వ్రాశారు.[30]

అతను ఆర్ధిక సహాయం చేసిన ఇతర పథకాలో కొన్ని: మధ్య మరియు తూర్పు ఐరోపా అంతటా శాస్త్రీయవేత్తలు, విశ్వవిద్యాలయాలకు నిధులు, సారజేవో ముట్టడి సమయములో పౌరులకు సహాయం, ట్రాన్స్పరేన్సి ఇంటర్నేషనల్కు సహాయం. సెంట్రల్ యురోపియన్ యునివర్సిటీ (CEU) కు సోరోస్ €420 మిలియన్లు విరాళము ఇస్తానని మాట ఇచ్చారు. నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత అయిన ముహమ్మద్ యూనుస్, మరియు అతని మైక్రో ఫైనాన్సు బ్యాంకు అయిన గ్రామీన్ బ్యాంకుకు కూడా OSI సహాయం చేసింది.

నేషనల్ రివ్యూ [31] ప్రకారం, సెప్టెంబరు 2002న ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ లైన్ స్టువర్ట్ డిఫెన్స్ కమిటికి $20,000 ఇచ్చారు. ఉగ్రవాదులు అనే నేరం మోపబడినవారి తరఫున న్యాయస్థానంలో వాదించిన న్యాయవాది, లైన్ స్టువర్ట్. తన కక్షిదారుడి కోసం ఏర్పాటు చేసిన ఒక పత్రికా సమావేశం ద్వారా అతను "ఉగ్రవాదుల కుట్ర కు సహయపడటం" అనే నేరారోపణ క్రింద అతను 2⅓ సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.


"ఆ సమయములో మా సహాయాన్ని అందుకోవటానికి అర్హత కలిగి ఉండటం అనే విషయంలో సంభాషించే హక్కు కలిగి ఉన్నామని మాకు అనిపించింది" అని OSI ప్రతినిధి చెప్పింది.

సెప్టెంబరు 2006లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తాను సహాయం చేస్తూ వస్తున్న పద్ధతికి విరుద్ధంగా సోరోస్ ఆఫ్రికాలో పేదరిక నిర్మూలనకుగానూ జెఫ్రీ సాక్స్ నేతృత్వంలోని మిల్లీన్నియం ప్రామిస్కు $50 మిలియన్లు అందించటానికి హామీ ఇచ్చారు. చెడ్డ పరిపాలనకు పేదరికానికి ఉన్న సంబంధాన్ని గుర్తించి, ఈ పథకము యొక్క మానవతా విలువల గురించి అతను చెప్పాడు.[32]

1980లో యునివర్సిటీ అఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన న్యూ స్కూల్ ఫర్ సోషల్ రిసర్చ్ (న్యూయార్క్), 1991లో కర్వినస్ యునివర్సిటీ అఫ్ బుడాపెస్ట్ మరియు యేల్ యునివర్సిటీలు అతనికి గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. 2000లో యేల్ స్కూల్ అఫ్ మానేజ్మెంట్ వారి యేల్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్సు అవార్డు సోరోస్ కు లభించింది. మరియు 1995లో యునివర్సిటీ అఫ్ బోలోగ్న వారి అత్యంత గౌరవనీయమైన లారీ హొనోరిస్ కాస, సోరోస్ కు లభించింది.

=[మార్చు]

రాజాకీయ విరాళాలు మరియు క్రియాశేలక వ్యవహారాలు ===

అమెరికా సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

అధ్యక్షుడు జార్జ్ W. బుష్ని పదవినుండి తొలగించడం "తన జీవితములోని ముఖ్య ఆశయం" అని మరియు " జీవన్మరణ సమస్య వంటిది" అని సోరోస్ థ వాషింగ్టన్ పోస్ట్కు 2003 సంవత్సరం నవంబరు 11 న ఇచ్చిన ముఖాముఖీ సమావేశంలో చెప్పాడు. "ఎవరైనా ఖచ్చితంగా ఔతుందని" చెపితే తాను తన మొత్తం సంపదను త్యజించి అయినా అధ్యక్షుడు బుష్ ను ఓడిస్తానని అన్నాడు.[33] సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్కు సోరోస్ $3 మిలియన్లు, MoveOn.orgకు $5 మిలియన్లు, అమెరికా కమింగ్ టుగెదర్కు $10 మిలియన్లు విరాళం ఇచ్చాడు. ఈ వర్గాలు 2004 ఎన్నికలలో డెమోక్రాట్లకు సహాయం అందించేలా పనిచేశారు. 2004 సెప్టెంబరు 28 న అతను ఎక్కువ ధనాన్ని ప్రచారం కోసం కేటాయించి, పెక్కు రాష్ట్రాలలో పర్యటించి, తన ఉపన్యాసములో, ఎందుకు మనము అధ్యక్షుడు బుష్ ని తిరిగి ఎన్నుకోగూడదు [34] అని వాషింగ్టన్, DC లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో వాక్బాణాలు సంధించారు. డిక్ చెనీ అనాలోచితంగా FactCheck.orgకు బదులుగా "factcheck.com" అని ఉపాధ్యక్షుని వాక్యుద్ధములో సంబోధించేసరికి ఈ ఉపన్యాసము యొక్క ఆన్ లైన్ వ్యాఖ్యానముకు అనేక ప్రశంసలు లభించి, ఆ డొమైన్ యొక్క స్వంతదారు వాటిని సోరోస్ యొక్క సైట్ కు మళ్ళించవలసిన అవసరం ఏర్పడింది.[35]

2004 అధ్యక్ష ఎన్నికల దాకా సోరోస్ US రాజకీయ అవసరాలకు పెద్దగా డబ్బు విరాళంగా ఇచ్చేవాడు కాదు. కాని సెంటర్ ఫర్ రేస్పొంసివ్ పోలిటిక్స్ ప్రకారం 2003 - 2004 ఎన్నికల సమయములో సోరోస్ $23,581,000 సొమ్మును అనేక 527 వర్గాలకు విరాళంగా జార్జ్ బుష్ ను ఓడిస్తారనే ఉద్ధ్యేశంతో అందజేశాడు. 527 వర్గం అంటే అమెరికాలో పన్ను మినహాయింపు కలిగిన సంస్థ. యునైటెడ్ స్టేట్స్ టాక్స్ కోడ్, 26 U.S.C.§ 527 అనే ఒక అంకం పేరు మీద ఈ సంస్థకు ఈ పేరు పెట్టారు. . సోరోస్ ప్రయత్నాలు సఫలం కాక బుష్ రెండవసారి మరల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బుష్ తిరిగి ఎన్నికైనాక, సోరోస్ మరియు ఇతర దాతలు U.S. డెమోక్రటిక్ పార్టీ యొక్క లక్ష్యాలను సమర్ధించే డెమోక్రసీ ఎల్లయన్స్ అను ఒక క్రొత్త నిధి సమకూర్చు సంస్థకు సహాయమందించారు.[36] సోరోస్ 2002 నాటి మెక్కైన్-ఫెయిన్గోల్ద్ బైపార్టిజాన్ కాంపైన్ రిఫార్మ్ యాక్ట్ను సమర్ధించాడు. తద్వారా ఫెడరల్ ఎన్నికల ప్రచారాలకు "సాఫ్ట్ మనీ" పంపిణీ ఆగిపోతుందని అనేకులు ఆశపడ్డారు. సోరోస్ సాఫ్ట్ మనీ విరాళాలు 527 సంస్థలకి ఇచ్చి, అభ్యర్థులకో లేక రాజకీయ పార్టీలకో ప్రత్యక్షంగా ఇస్తే లంచగొండితనం అనవచ్చని, ఇప్పుడు అనలేరని, అన్నాడు.

ఆగస్టు 2009 లో సోరోస్ న్యూ యార్క్ రాష్ట్రానికి $35 మిలియన్లు నిరుపేద పిల్లలకని విరాళంగా సమర్పిస్తూ, 3 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు కల ఒక బాలుడు లేదా బాలికకు $200 బెనిఫిట్ కార్డులు ఉన్నట్లయితే, వారి తల్లిదండ్రులకు పిల్లల సంఖ్యతో నిమిత్తం లేకుండా అర్హత ఉన్నవారికి ఈ డబ్బును అందజేశారు. న్యూ యార్క్ రాష్ట్రముచే 2009 ఫెడరల్ ఆక్ట్ ద్వారా వారికి అందిన $140 మిలియన్ల అదనపు సొమ్ము కూడా ఈ నిధిలో భాగంగా ఉంచబడింది.[18]

తూర్పు ఐరోపా[మార్చు]

న్యు స్టేట్స్మన్కు చెందిన నీల్ క్లార్క్ ప్రకారం, తూర్పు ఐరోపాలో కమ్యునిజం కుప్పకూలడంలో సోరోస్ పాత్ర కీలకమైనది. క్లార్క్ ఈ విధంగా చెప్పారు: 1979 నుండి సోరోస్ ఏడాదికి $3 మిలియన్లు పోలాండ్ కు చెందిన సాలిడారిటీ ఉద్యమం, చేకోస్లోవేకియాకు చెందిన చార్టర్ 77, సోవియట్ యూనియన్కు చెందిన ఆండ్రీ సఖరోవ్ వంటి తిరుగుబాటుదారులకు విరాళం ఇచ్చారు; 1984లో అతను హంగేరిలో తన మొదటి ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ స్థాపించి, తిరుబాటు ఉద్యామాలకు, స్వతంత్ర మీడియా కోసం మిలియన్ల డాలర్లు వెచ్చించారు.[37]

సోవియట్ యూనియన్ పతనం అయిన తరువాత కూడా, పూర్వ సోవియట్ ప్రాంతాలకు సోరోస్ నిధులు ఇస్తూనే ఉన్నారు. జార్జియాలో రోస్ ఉద్యమం విజయవంతమవ్వడానికి అతని ఆర్ధిక సహాయం మరియు నిర్వాహణ ముఖ్యపాత్ర వహించాయని రష్యా మరియు ప్రాశ్చాత్య దేశాలకు చెందిన అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే తన పాత్ర "చాలా ఎక్కువ చేసి చెప్పబడినది" అని సోరోస్ చెప్పారు.[38] జార్జియన్ సెక్యురిటీ కౌన్సిల్ యొక్క కార్యదర్శి మరియు మాజీ విద్యా మరియు విజ్ఞాన మంత్రి అయిన అలేక్సాన్డర్ లోమేయా ఓపెన్ సొసైటీ జార్జియా ఫౌండేషన్ (సోరోస్ ఫౌండేషన్) యొక్క మాజీ కార్యనిర్వాహణా అధికారిగా ఉన్నారు. ఈ సంస్థలో 50 మంది సిబ్బంది ఉండి, బడ్జట్ $2,500,000 గా ఉండేది[39]

సోరోస్ ఫౌండేషన్ వంటి సంస్థలే ప్రజాస్వామ్యానికి ఉయ్యాల వంటివని, సోరోస్ ఫౌండేషన్ ని కేంద్రంగా పెట్టుకుని అన్ని NGOలు పనిచేశాయని దీనివల్లే ఉద్యమం సాధ్యమయిందని జార్జియా యొక్క మాజీ విదేశాంగ మంత్రి సాలోం జౌరబిచ్విలి వ్రాశారు. ఉద్యమం తరువాత సోరోస్ ఫౌండేషన్, NGOలు అధికారములో పాల్పంచుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.[40]

ప్రజాస్వామ్యానికి మరియు పారదర్శకతకు సోరోస్ ఇచ్చిన మద్దతుని అనేక అసంపూర్ణ అధికార దేశాలు ఖండించాయి; ప్రజాస్వామ్యమునకు మద్ధతుగా సోరోస్ ప్రయత్నాలు కజగస్థాన్ మరియు టర్క్మెనిస్తాన్ లలో నిషేధింపబడ్డాయి.[41]

టర్కీ లోని సోషల్ ట్రాన్స్పరెన్సి మూవ్మెంట్ అసోసియేషన్ (TSHD) యొక్క అధ్యక్షుడైన ఏర్కిస్ కుర్టులస్ ఒక భేటిలో ఈ విధముగా చెప్పారు: "ఈ NGO లని వాడుకుని ఉక్రెయిన్ మరియు జార్జియాలలో సోరోస్ తన ఆశయాలని నెరవేర్చుకున్నారు.... విదేశీయుల నుండి నిధులు తీసుకోకూడదని రష్యా గత ఏడాది ఒక విశేష చట్టాన్ని అమలుచేసింది. ఇది టర్కీలో కూడా నిషేధింపబడాలని నేను భావిస్తున్నాను."[42] 1997లో బెలారస్ లోని తన ఫౌండేషన్ ని సోరోస్ మూసివేయవలసి వచ్చింది. దీనికి కారణం, "పన్ను మరియు కరన్సి ఉల్లంఘన" చేసిందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆ ఫౌండేషన్ కు $3 మిలియను జరిమానా విధించడమే. న్యు యార్క్ టైమ్స్ కథనం ప్రకారం, బెలారస్ సోరోస్ ఫౌండేషన్ మరియు ఇతర స్వతంత్ర NGO లని నియంత్రించి పౌర మరియు మానవ హక్కులని అణగదొక్కారని బెలారస్ అధ్యక్షుడు అలెక్సాన్డర్ లుకషేంకో పశ్చిమ దేశాలలోనూ, రష్యాలోనూ విమర్శలకు గురయ్యారు. "స్వతంత్ర సమాజాన్ని నశింపజేసే" ప్రయత్నాలే ఈ జరిమానాలని సోరోస్ చెప్పారు.[43]

జూన్ 2009లో, ఆర్ధిక సంక్షోభం మూలాన ఇబ్బంది పడే మధ్య ఐరోపా మరియు తూర్పు ఐరోపా లోని పేదవారికి, స్వచ్ఛంద సంస్థలకు, ప్రభుత్వేతర సంస్థలకు సహాయంగా సోరోస్ $100 మిలియను విరాళం ఇచ్చారు.[44]

ఆఫ్రికా[మార్చు]

ఓపెన్ సొసైటీ ఇనిషియేటివ్ ఫర్ సదరన్ ఆఫ్రికా సోరోస్ కు అనుబంధ సంస్థ. [1] ఈ సంస్థ యొక్క జింబాబ్వే దర్శకుడైన గాడ్ఫ్రే కన్యన్జీ, జింబాబ్వే కాంగ్రెస్ అఫ్ ట్రేడ్ యూనియన్స్ (ZCTU) ని కూడా నిర్వహిస్తున్నాడు. జింబాబ్వేలో పాలక మార్పుకు కృషి చేస్తున్న ముఖ్య స్థానిక సంస్థ అయిన మూవ్మెంట్ ఫర్ డెమోక్రాటిక్ చేంజ్ వెనుక ఉన్న ముఖ్య సంస్థ ZCTU నే.

==[మార్చు]

మాదకద్రవ్య విధాన సంస్కరణ ====

ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్య విధాన సంస్కరణ కొరకు సోరోస్ నిధులు ఇచ్చారు. 2008లో మస్సచుసేట్ట్స్ రాష్ట్రములో మస్సచుసేట్ట్స్ సేన్సిబెల్ మరిజువాన పాలసీ ఇనిషియేటివ్ విజయవంతం కావడానికి సోరోస్ $400,000 విరాళంగా ఇచ్చారు. ఈ చొరవ ప్రకారం రాష్ట్రంలో 1 oz (28g) కంటే తక్కువ మారివాన కలిగి ఉండటం నేరం కాదు. కాలిఫోర్నియా, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్, కొలరాడా, నెవాడ, మైనే రాష్ట్రాలలో కూడా సోరోస్ ఇటువంటి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు.[45] లిండాస్మిత్ సెంటర్, డ్రగ్ పాలసీ ఫౌండేషన్ వంటి మాదకద్రవ్య నేరరహిత సంస్థలకు సోరోస్ నిధులు ఇచ్చారు.[46]

కాలిఫోర్నియాలో ప్రోపోసిషన్ 5 అనే ఒక విఫలమైన చట్ట సవరణని ప్రచారం చేయడానికి $1.4 మిలియను విరాళం ఇచ్చారు. ఈ సవరణ కనుక సఫలమయి ఉంటె, హింసలేని మాదకద్రవ్య నేరాలకు జైలు శిక్షకు బదులుగా మాదకద్రవ్య పునరావాస కార్యక్రమాలు చేపడతారు. [2] [47]

మారివానా తక్కువగా వ్యసనము కలిగించినా కనీ అది పిల్లలకు, విద్యార్థులకు తగినది కాదు అన్నది సోరోస్ యొక్క అభిప్రాయం అని అక్టోబరు 2009 లో ఇచ్చిన ఒక భేటిలో సోరోస్ చెప్పాడు. అతను అనేక సంవత్సరాలుగా మరివానా వాడలేదు.[48]

మరణం మరియు చనిపోతున్నవారు[మార్చు]

అమెరికాలోని మరణం అను పధకం 2001-2003 వరకు ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ పధకాలలో ఒకటిగా ఆచరణలో ఉండి, "మరణించటం మరియు ఎవరినైనా కోల్పోవటం లోని అనుభవాన్ని, నాగరికతని అర్ధం చేసుకుని మార్పు తీసుకురావటం కోసం ఉద్దేశించబడింది."[49] 1994 సంవత్సరములో సోరోస్ చేసిన ఒక ఉపన్యాసములో అతను హేమ్లోక్ సొసైటీ లోని సభ్యురాలైన తన తల్లి ఆత్మహత్య చేసుకొనటానికి సహాయం చేయటానికి తాను ముందుకు వచ్చానని తెలిపాడు.[50] అదే ఉపన్యాసంలో అతను ఒరెగాన్ డెత్ విత్ డిగ్నిటీ యాక్ట్, [51]ను బలపరిచి, ఆ ప్రచారానికి నిధి సమకూర్చాడు.[52]

తత్వశాస్త్రం[మార్చు]

మూస:BLP unsourced section

=[మార్చు]

విద్య మరియు నమ్మకాలు ===

సోరోస్ కు తత్వశాస్త్రములో ఎంతో శ్రద్ధ ఉండటంతో, అతను తత్వశాస్త్రజ్ఞుడు కావటానికి ప్రయత్నిస్తూ తన జీవితావసరాల కోసమే ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టానని చెప్పాడు. అతని తాత్విక ధోరణి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) లో తన గురువైన కార్ల్ పోప్పర్ చే ప్రభావితమయింది. అతని ఓపెన్ సొసైటీ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు పొప్పెర్ యొక్క రెండు సంపుటుల రచన అయిన థ ఓపెన్ సొసైటీ ఎండ్ ఇట్స్ ఎనిమీస్ పేరు నుండి మరియు ఫల్లిబిలిజం (తాను ఏది నమ్మినా అది తప్పు అయి ఉండవచ్చు. కాబట్టి దానిని మరల ప్రశ్నించుకుని, అభివృద్ధి పరచుకోవాలి.) అనబడు సూత్రము అందు, పొప్పర్ యొక్క వేదాంతము ద్వారా సోరోస్ కు కలిగిన తాత్విక నమ్మకము వలననూ ఉత్పన్నమయింది.

అనిచ్చా ప్రవర్తన, ఆర్ధిక మార్కెట్లు, మరియు ఆర్ధిక సిద్ధాంతము[మార్చు]

సోరోస్ వ్యాఖ్యానాలు అనిచ్చా ప్రవర్తనపై ఎక్కువగా దృష్టి నిలుపుతాయి. ఇక్కడ వ్యక్తుల ఉద్ధేశాలలోని తారతమ్యాలు మార్కెట్టు లావాదేవీలలోకి చొరబడి దాదాపుగా ఆర్ధిక వ్యవస్థ యొక్క మౌలిక సూత్రాల అవగాహన లోనే తేడాలు తీసుకురాగలవు. ఆర్ధిక వ్యవస్థ యొక్క మౌలిక సూత్రాల అవగాహనలో వచ్చే ఈ మార్పుల వల్ల సమతుల్యతకు బదులుగా అనిశ్చితి ఏర్పడుతుంది అని సోరోస్ వాదిస్తారు. మార్కెట్ యొక్క సాంప్రదాయక ఆర్ధిక సిద్ధాంతం (సమర్దవంత మార్కెట్ అను ప్రతిపాదన) ఈ పరిస్థితులలో వర్తించదు అని కూడా అతను చెప్పాడు. పరిణామశీలమైన అనిశ్చితి, స్థిరమైన అనిశ్చితి, సమస్థితి-సమీప పరిస్థితులు వంటి సిద్ధాంతాలను సోరోస్ ప్రచారంలోనికి తెచ్చారు.[19]

అనిచ్చాప్రవర్తన అనునది మూడు ముఖ్య ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఉంటుంది.[19]

పెట్టుబడిదారుల వైపు పక్షపాతము పెరిగి, అది పెట్టుబడి రంగమంతా వ్యాపించిన ప్రత్యేక పరిస్థుతులలో అనిచ్చాప్రవర్తనని పరిశీలించవచ్చు. ఈ పక్షపాతానికి గల కారణాలలో ఉదాహరణకి ఒకటి ఈక్విటి లీవరేజింగ్ అయితే రెండవది స్పేకులేటర్ ల అలవాట్లఫై ఆధారపడటం అనే పద్ధతి.

అనిచ్చాప్రవర్తన అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే, అది కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే వ్యక్తమవుతుంది కనుక; అంటే, సమస్థితి ప్రక్రియ యొక్క నడవడిక సంభావ్యతల పైనే ఎక్కువగా ఆధారపడుతుంది.

పెట్టుబడి మార్కెట్ల గురించి పెట్టుబడిదార్ల పరిశీలన మరియు అందులో పాల్గొనడం వంటి అంశాలు కొన్ని సార్లు విలువలు, మౌలిక పరిస్థితులు లేదా ఫలితాల మీద ప్రభావం చూపించవచ్చు.

గృహ మార్కెట్ లలో ఉన్న ఋణ మరియు ఈక్విటిలే, ఆధునిక ఆర్ధిక మార్కెట్ లోని అనిచ్చాప్రవర్తనకు ఉన్న ప్రస్తుత ఉదాహరణ. 1990లలో ఋణం ఇచ్చేవారు గృహ కొనుగోలుకుగానూ ఎక్కువ మందికి ఎక్కువ డబ్బు అందుబాటులో ఉంచడం ప్రారంభించారు. ఈ పెద్ద మొత్తముతో ఎక్కువ మంది ఇళ్ళు కొన్నారు. అందువల్ల గృహాల ధరలు పెరిగాయి. రుణం ఇచ్చిన వారు వారి బేలన్స్ షీట్ ని చూసినప్పుడు, వారు రుణం ఎక్కువగా ఇచ్చినట్లు, ఆ రుణం వెనక్క ఉన్న ఈక్విటి, అనగా గ్రహాల విలువ, పెరిగినట్లు కనబడింది. (ఎందుకంటే, అదే గృహాలని ఎక్కువ ద్రవ్యం వేమ్మదిస్తుంది). వారి బేలన్స్ షీట్ లు బాగా కనబడ్డాయి కనుక, వారు ఇంకా ఎక్కువ రుణాలు ఇచ్చారు. దీనివల్ల ధరలు పెరిగాయి. వారు ఇంకా ఎక్కువ రుణం ఇచ్చారు. పౌర విధానాల వల్ల ఇది ఇంకా విస్తరించబడింది. గృహ యాజమాన్యాన్ని ఒక మంచి పరిణామంగా అనేక ప్రభుత్వాలు పరిగణించాయి. మొదటి గృహాన్ని కొనుగోలు చేసేవారికి ఆర్ధిక సహాయం, రాయతీలు, - లేక ఇల్లు కొన్నవారికి మూలధన ఆదాయ పన్నులనుండి మినహాయింపు- వంటి చెర్యల వల్ల గృహ కొనుగోలు ఒక మంచి విషయమని సూచించపడింది. ధరలు త్వరగతిలో పెరిగాయి. రుణ నియమాలు సవరించబడ్డాయి. అనిచ్చా ప్రవర్తన గురించిన ఒక ముల్హ్య విషయం ఏమంటే, మార్కెట్లు కాలక్రమేణ బొంగరంలా తిరుగుతానికి కారణాలను మరియు మార్కెట్ లు ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండకుండా ఎక్కువగానో తక్కువగానో ఉంటుందనే కారణాలని ఇది తెలియచేస్తుంది.[19]

స్వేచ్చా వర్తక విధానములో ఉత్పన్నమయే అవకాశమున్న సమస్యలపై దృష్టి[మార్చు]

తనే ఒకప్పుడు ఒక పెట్టుబడిదారుడిగా, వాడుకలో ఉన్న డబ్బు యొక్క స్పెకులేటర్ గా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్ధిక స్పెకులేషన్ విధానం వల్ల అనేక అభివృద్ధి చెందని దేశాలలో ఆరోగ్యకరమైన ఆర్ధిక అభివృద్ధి జరగదని సోరోస్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ ఛాందసవాదం అని అతను పిలిచేదాంట్లో ఉన్న వైఫల్యాలే ప్రపంచములో అనేక సమస్యలకి కారణమని సోరోస్ చెప్పాడు. ప్రపంచీకరణలోని అనేక అంశాలను వ్యతిరేకించడం వల్ల అతను ఒక వివాదాస్పద వ్యక్తి అయ్యాడు.

సోరోస్ గురించి విక్టర్ నీడేర్హోఫెర్ ఐలాగ చెప్పారు: "అన్నిటికంటే ముఖ్యంగా, అధిక స్వలాభ చెర్యలు చేసినప్పుడు దాని సరి చేయడానికి బలమైన కేంద్ర అంతర్జాతీయ ప్రభుత్వం ఉన్న ఒక మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ మీద జార్జ్ నమ్మకం పెట్టేవారు."

మార్కెట్ లో బాగస్వామిగా ఉండటానికిను మార్కెట్ బాగాస్వామ్యులు పాటిస్తున్న నియమాలను మార్చడానికీను తేడా ఉందని సోరోస్ చెపుతారు. జూలై 1981 నుండి అక్టోబరు 2003 వరకు మలేషియా ప్రధాన మంత్రిగా ఉన్న మహతీర్ బిన్ మొహమేడ్ ప్రకారం, క్వాంటం ఫండ్ అధినేతగా సోరోస్ ఉన్నప్పుడు, 1997లో తాయ్ కరన్సి US డాలర్ నుండి విడిపోయి, తూర్పు ఆసియా మార్కెట్ లు ఆర్ధికంగా పతనం అవ్వడానికి అతను పాక్షింగానైన కారకుడు. మహాతిర్ ప్రకారం, మార్కెట్ పతనానికి మూడు సంవత్సరాలకు ముందు, తూర్పు ఆసియా స్టాక్ మార్కెట్ లు మరియు స్థిరాస్తి లలో స్వల్ప-కాల ఊహాగాన రీతిలో పెట్టుబడులు పెట్టాడు. అయితే, కరన్సి విలువ తగ్గింపు జరగబోతుందనే మొట్ట మొదటి సూచన వచ్చినప్పుడే, అతను "అనుచితమైన వేగంతో" పెతుబడులను ఉపసంహరించుకున్నాడు.[53] అయితే మహాతీర్ తన తప్పులని కప్పి పుచ్చడానికి తనని బలి-పశువు చేస్తున్ననాడని సోరోస్ బదులిచ్చాడు. కరన్సి వర్తకాన్ని నిషేధిస్తామని (ఈ చేర్యని మలేషియా ఆర్ధిక అధికారులు దురితగతిలో ఉపసంహరించారు) ప్రకటించడం "పతనానికి కారణం" అని చెప్పి "మహాతిర్ వల్ల అతని సొంత దేశానికే కీడు" అని చెప్పారు.[54]

2008 ఆర్ధిక సంక్షోబం గురించి ఇచ్చిన ఒక బేటిలో, ఇది 1930ల తరువాత ఏర్పడిన అతి ఘోరమైన సంక్షోబం అని వర్ణించాడు. ఆర్ధిక విషయాలలో ప్రభుత్వ జోక్యం లేకుండా మార్కెట్ లు అవి అంతట అవే సరి చేసుకుంటాయని అనుకునే మార్కెట్ ఛాందసవాదం "సిద్ధాంత పరంగా చాలా అతిగా ఆలోచించడమే" అనేది సోరోస్ అభిప్రాయం. సోరోస్ అభిప్రాయం ప్రకారం, మార్కట్ ల మనోభావాలు - మనోభావం అంటే, అప్పుడు నేలకున్న పక్షపాత వైకిరి లేదా వాస్తవాలని ఆశావాదం తోనో / నిరాశావాదం తోనూ చూడటం - వాటిని అవే బలపరుచుకోగలవు. అందువల్ల ప్రారంబములో కొంత బలపరుచుకున్నట్లు కనబడినా, ఎట్టుకేలకు అది నిలబడలేక పెరుగుదల/పతనం పరంపరలు లేదా బుడగలు ఏర్పడుతాయి.[55]

యూదులకు వ్యతిరేకత గురించిన అబిప్రాయాలు[మార్చు]

2003 నవంబరు 5 నాడు, న్యు యార్క్ సిటి లోని ఒక యోధుల ఫోరంలో మాట్లాడుతూ, ఇటీవల యోధులకు వ్యతిరేకత పెరగడానికి ఇజ్రేయిల్, యునైటెడ్ స్టేట్స్ విధానాలు మరియు తన వంటి విజయవంతమైన యూదులే కారణమని సోరోస్ చెప్పారు.

ఐరోపా లో యూదులకు వ్యతిరేకత మళ్ళీ పెర్గిగింది. బుష్ పాలన విధానాలు మరియు షరోన్ పాలన విధానాలు దానికి దోహదపడుతున్నాయి. ఇది ప్రత్యేకంగా యోధులకు వ్యతిరేకత కానప్పటికీ, అది యోధులకు వ్యతిరేకత మీద ప్రభావం చూపుతుంది. నేను ఆ విధానాలని తప్పు పటుతున్నాను... ఆ దిశని మనము మార్చ కలిగితే, యోధులకు వ్యతిరేకత తగ్గుతుంది. ప్రత్యక్షంగా దీన్ని ఎలా ఎదురుకోవాలని నాకు తెలియడం లేదు... నా స్వంత పాత్ర గురించి కూడా నాకు చాలా విచారంగా ఉంది ఎందుకంటే కొత్తగా పుంజుకుంటున్న యూదవ్యతిరేకత ప్రకారం యూదులే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు... నా చర్యల యొక్క అనుకోని పరిణామాల వల్ల... నేను కూడా ఆ భావానికి కారకుడును అయ్యాను.[56]

తరువాత ది న్యూ యార్క్ రివ్యూ అఫ్ బుక్స్లో వ్రాసిన ఒక వ్యాసంలో, సోరోస్ ఈ విధముగా చెప్పారు.

ఇజ్రాయిల్ విరోధులు ప్రచారం చేస్తున్న కల్పనా కథలను నేను ఒప్పుకొని. నేను ఈ యూదులకు వ్యతిరేకత ఏర్పడాటానికి యూదులే కారణమని కూడా ఒప్పుకోను. ఇజ్రేయిల్ ఏర్పడటానికి ముందునుండే యూదుల వైపు వ్యతిరేకత మొదలయింది. ఇజ్రేయిల్ విధానాలు గాని, ఆ విధానాలని వ్యతిరేకించేవారి విధానాలు గాని ఈ యూదుల వ్యతిరేకతకు కారణాలు కావు. అదే సమయములో, ఇజ్రేయిల్ యొక్క విధానాలే ఇజ్రేయిల్ మీద కలుగుతున్న భావాలకు కారణాలు. యూద సమాజం మీద ఉన్న భావాలకు కారణాలు, ఇజ్రేయిల్ కు అనుకూలంగా ఉండేవారు విబేధ అభిప్రాయాలని అణుగదొక్కడమే.[57]

సంపద[మార్చు]

ఫోర్బ్స్ జాబితా ప్రకారం మొత్తం ఆస్తుల విలువ బట్టి US$13.0సోరోస్ ప్రపంచంలో 29 వ ధనవంతుడైన వ్యక్తి. సోరోస్ 1979 నాటి నుండి $7 బిలియన్లు వివిధ కారణాల కోసం ఇచ్చివేశాడు.[58]

హంగరీ రాజకీయాలతో సంబంధం[మార్చు]

1980లలో విక్టర్ ఒర్బాన్ - ఫీడేశ్ అధ్యక్షుడు (1994–2000, 2000-), మరియు ప్రధాన మంత్రి (1998–2002) - మరియు లాస్లో కోవేర్ - ఫీడేశ్ అధ్యక్షుడు (2000) మరియు సీక్రాట్ సర్వీస్ మంత్రి (1998–2002) - వీరు ఇరువురూ సోరోస్ నుండి ఉపకారవేతన గ్రహీతలే. ఒర్బాన్ మంత్రిమండలిలో ఉప ప్రధాన మంత్రిగా ఉన్న ఇస్ట్వన్ స్టుమ్ప్ఫ్, సోరోస్ ఫౌండేషన్ యొక్క ట్రస్ట్ మండలి సభ్యుడుగా 1994 నుండి 2002 వరకు ఉన్నారు.

పుస్తకాలు[మార్చు]

=[మార్చు]

రచించిన లేక సహరచన చేసిన ===

 • ది న్యూ పరాడిగం ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్: ది క్రెడిట్ క్రైసిస్ అఫ్ 2008 అండ్ వాట్ ఇట్ మీన్స్ (పబ్లిక్ అఫ్ఫెర్స్, 2008). ISBN 0-525-94980-1
 • ది ఏజ్ అఫ్ ఫల్లిబిలిటి: కాంసేక్వేన్సస్ అఫ్ ది వార్ ఆన్ టెర్రర్ (పబ్లిక్ అఫ్ఫెర్స్, 2006) ISBN 1-58648-359-5
 • MoveOn.org తో పాటు మొవ్ ఆన్స్ 50 వేస్ టు లవ్ యువర్ కంట్రి: హౌ టు ఫైండ్ యువర్ పొలిటికల్ వైస్ అండ్ బికం ఎ కటలిస్ట్ ఫర్ చేంజ్ ఇన్నెర్ ఓషన్ పుబ్లిషింగ్, 2004 ISBN 1-930722-29-X
 • ది బబ్బిల్ అఫ్ అమెరికన్ సుప్రేమసి: కర్రెక్టింగ్ ది మిస్యూస్ అఫ్ అమెరికన్ పవర్ (పబ్లిక్ అఫ్ఫైర్స్, 2003) ISBN 1-58648-217-3 (పేపర్ బ్యాక్; పబ్లిక్ అఫ్ఫైర్స్, 2004; ISBN 1-58648-292-0)
 • జార్జ్ సోరోస్ ఆన్ గ్లోబలైసేషణ్ (పబ్లిక్ అఫ్ఫైర్స్, 2002) ISBN 1-58648-125-8 (పేపర్ బ్యాక్; పబ్లిక్ అఫ్ఫైర్స్, 2005; ISBN 1-52648-278-5)
 • ఓపెన్ సొసైటీ: రేఫోర్మింగ్ గ్లోబల్ కాపిటలిసం (పబ్లిక్ అఫ్ఫైర్స్, 2001) ISBN 1-58648-039-7
 • మార్క్ అమడ్యుస్ నోట్టుర్నోతో పాటు, సైన్సు అండ్ ది ఓపెన్ సొసైటీ: ది ఫ్యూచర్ అఫ్ కార్ల్ పోప్పేర్స్ ఫిలోసోఫి (సెంట్రల్ యురోపియన్ యునివెర్సిటీ ప్రెస్, 2000) ISBN 963-9116-69-6 (పేపర్ బ్యాక్: సెంట్రల్ యురోపియన్ యునివెర్సిటీ ప్రెస్, 2000; ISBN 943-9116-70-X)
 • ది క్రైసిస్ అఫ్ గ్లోబల్ కాపిటలిసం: ఓపెన్ సొసైటీ ఎండాన్జేర్డ్ (పబ్లిక్ అఫ్ఫైర్స్, 1998) ISBN 1-891220-27-4
 • సోరోస్ ఆన్ సోరోస్: స్టేయింగ్ ఆహేడ్ అఫ్ ది కర్వ్ (జాన్ వైలీ, 1995) ISBN 0-471-12014-6 (పేపర్ బ్యాక్; వైలీ, 1995; ISBN 0-371-11977-6)
 • అండర్రైటింగ్ డెమోక్రసీ: ఎంకరేజింగ్ ఫ్రీ ఎంటర్ప్రైస్ అండ్ డెమోక్రాటిక్ రేఫాం అమొంగ్ ది సోవియత్స్ అండ్ ఇన్ ఈస్టరన్ యూరోప్ (ఫ్రీ ప్రెస్, 1991) ISBN 0-02-930285-4 (పేపర్ బ్యాక్; పబ్లిక్ అఫ్ఫైర్స్, 2004; ISBN 1-58948-227-0)
 • ఓపెనింగ్ ది సోవియట్ సిస్టం (వీడేన్ ఫెల్డ్ & నికల్సన్, 1990) ISBN 0-297-82155-9 (పేపర్ బ్యాక్: పెర్సూస్ బుక్స్, 1996; ISBN 0-8133-1205-1)
 • ది అల్కేమి అఫ్ ఫైనాన్స్ (సైమన్ & స్కస్టర్, 1988) ISBN 0-671-66338-4 (పేపర్ బ్యాక్: వైలీ, 2003; ISBN 0-471-44549-5)

జీవిత చరిత్రలు[మార్చు]

 • మైకేల్ టి. కాఫ్మన్ రచించిన సోరోస్: ది లైఫ్ అండ్ టైమ్స్ అఫ్ ఎ మేస్సయానిక్ బిల్లియనైర్ మైకేల్ టి. కాఫ్మన్ (అల్ఫ్రెడ్ ఏ. నాఫ్, 2002) ISBN 0-375-40585-2
 • రాబర్ట్ స్లాటర్ రచించిన సోరోస్: ది వరల్డ్స్ మోస్ట్ ఇంఫ్లువన్షియల్ ఇన్వెస్టర్ (మక్గ్రా-హిల్ ప్రొఫెషనల్, 2009) ISBN 978-0-07-160844-2

పాత్రికేయ వ్యాసాంగం[మార్చు]

రచించిన[మార్చు]

=[మార్చు]

గురించి ===

విద్యావంతుల దృక్పధాలు[మార్చు]

 • Bryant, C. G. A. (2002). "George Soros's theory of reflexivity: a comparison with the theories of Giddens and Beck and a consideration of its practical value". Economy and Society. 31 (1): 112–131. doi:10.1080/03085140120109277.
 • Cross, R. (1997). "On George Soros and economic analysis". Kyklos. 50: 561–574. doi:10.1111/1467-6435.00030. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 • Kwong, C.P. (2008). "Mathematical analysis of Soros's theory of reflexivity". arXiv:. 0901.4447.CS1 maint: extra punctuation (link)
 • Pettis, Michael (2001). The Volatility Machine: Emerging Economies and the Threat of Financial Collapse. Oxford: Oxford University Press. ISBN 0195143302.
 • Stone, Diane (2007). "Market Principles, Philanthropic Ideals and Public Service Values: The Public Policy Program at the Central European University". PS: Political Science and Politics: 545–551.

ఉపన్యాసాలు[మార్చు]

ఇంటర్వ్యూలు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Forbes World's Billionaires -#35 George Soros, Forbes, March 10, 2009
 2. Kaufman, Michael T., Soros: The Life and Times of a Messianic Billionaire, Alfred A. Knopf: 2002, 133.
 3. "Authors@Google: జార్జ్ సోరోస్". మూలం నుండి 2006-10-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-24. Cite web requires |website= (help)
 4. విల్లియం షాక్రాస్, "డాలర్స్ ని చిల్లరగా మార్చడం," టైం సంచిక, సెప్టెంబర్ 1, 1997
 5. ఓపెన్ యునివర్సిటీ
 6. 6.0 6.1 ది అట్లాంటిక్
 7. http://www.encyclopedia.com/doc/1G1-79165556.html
 8. 8.0 8.1 కాఫ్మన్, మైకేల్ టి., సోరోస్: ది లైఫ్ అండ్ టైంస్ అఫ్ ఎ మేస్సయానిక్ బిల్లియనైర్, అల్ఫ్రెడ్ ఏ. నాఫ్: 2002
 9. Soros, George (2008). The New Paradigm for Financial Markets: The Credit Crisis of 2008 and What It Means. PublicAffairs. p. 13. ISBN 1586486837.
 10. కాఫ్మన్, మైకేల్ టి., సోరోస్: ది లైఫ్ అండ్ టైంస్ అఫ్ ఎ మేస్సయానిక్ బిల్లియనైర్, అల్ఫ్రెడ్ ఏ. నాఫ్: 2002 p. 24.
 11. స్లాటర్, ఆర్.: సోరోస్: ది అనాతరైజ్డ్ బయోగ్రఫీ , పేజి 30.
 12. "Background and History". Paul and Dora Soros Fellowships for Young Americans. మూలం నుండి 2009-03-27 న ఆర్కైవు చేసారు. Retrieved March 22, 2009.
 13. Elisabeth Bumiller (June 17, 1998). "Public Lives: An Overshadowed Altruist Sees the Light". New York Times. New York Times Company. Retrieved March 22, 2009.
 14. "Peter Soros and Flora Fraser". New York Times. New York Times Company. February 2, 1997. Retrieved March 22, 2009.
 15. "Holocaust Encyclopedia". Ushmm.org. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 16. మైకేల్ లూయిస్, "ది స్పెకులేటర్: నోటు కట్టలను తూర్పు ఐరోపా మొత్తం మల్టిబిల్లియనైర్ జార్జ్ సోరోస్ ఇందులు విసురుతూ ఉన్నారు?" ది న్యూ రిపబ్లిక్ , జనవరి 10, 1994. ఇది కూడా చూడండి. కాఫ్మన్, మైకేల్ టి., సోరోస్: ది లైఫ్ అండ్ టైంస్ అఫ్ ఎ మేస్సయానిక్ బిల్లియనైర్, అల్ఫ్రెడ్ ఏ. నాఫ్: 2002 p. 32-33.
 17. O'Brien, Timothy L (December 6, 1998). "He's Seen The Enemy. It Looks Like Him". New York Times. Retrieved July 28, 2008.
 18. 18.0 18.1 All Things Considered (August 11, 2009). "Soros Uses Leverage To Aid New York Children". Npr.org. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 19. 19.0 19.1 19.2 19.3 19.4 19.5 Soros, George (2008). The New Paradigm for Financial Markets. Public Affairs, New York. ISBN 978-1-58648-683-9.
 20. Anderson, Jenny (April 16, 2008). "Wall Street Winners Get Billion-Dollar Paydays". New York Times. Retrieved July 28, 2008.
 21. స్టీవెన్ డ్రోబ్నీ, "ఇన్సైడ్ ది హౌస్ అఫ్ మనీ", జాన్ విలీ & సన్స్: హోబోకేన్, NJ, 2006.
 22. సోరోస్ ఆన్ సోరోస్: స్టేయింగ్ ఆహేడ్ అఫ్ ది కర్వ్ (జాన్ వైలీ, 1995) ISBN 0-471-12014-6
 23. 23.0 23.1 "Soros, the Man Who Cries Wolf, Now Is Warning of a 'Superbubble'" by Greg Ip, B1, June 21–22, 2008 The Wall Street Journal.
 24. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ "కుప్ప కూలుతున్న" సంధర్బములో ముగింపు ఇప్పట్లో లేదు అని సోరోస్ మాట, రాయ్టర్స్ , ఫెబ్రవరి 21, 2009, ఆగష్టు 17, 2009 నాడు వెలుపల తీయబడినది.
 25. 25.0 25.1 డేవిడ్ బ్రన్కక్కియో జార్జ్ సోరోస్ తో ముఖాముఖి, నౌ , PBS, సెప్టెంబర్ 12, 2003, ఫెబ్. 8, 2007 నాడు చూడబడినది.
 26. "సోరోస్ మీద ఉన్న ఇన్సైడర్ వర్తక నేరము సరైనదే (ఇంటర్ నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్)". మూలం నుండి 2006-07-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-07-01. Cite web requires |website= (help)
 27. ఫ్రాన్స్ లో తన మీద మోపబడ్డ ఇన్సైడర్ వర్తక శిక్షను సవాలు చేస్తూ బిలియనీర్ సోరోస్ యురోపియన్ న్యాయస్థానానికి అప్పీల్ చేసాడు (ఇంటర్ నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్) డిసెంబర్ 14, 2006
 28. "Soros's Nats Bid Irks Republicans". Washingtonpost.com. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 29. "United's Ownership Uncertain; After Sale Fell Through, MLS Might Take Over Operation". Pqasb.pqarchiver.com. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 30. TIME 100, ది పవర్ గివేర్స్, జార్జ్ సోరోస్, TIME సంచిక, మే 14, 2007 మే 21, 2007 నాడు చూడబడినది.
 31. యార్క్, బైరన్, సోరోస్ ఫన్డేడ్ స్టీవర్ట్ డిఫెన్స్, నేషనల్ రివ్యూ ఆన్లైన్ . సేకరణ తేదీ: ఫిబ్రవరి 28, 2007.
 32. Dugger, Celia W. (September 13, 2006). "Philanthropist Gives $50 Million to Help Aid the Poor in Africa". Africa: Travel2.nytimes.com. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 33. లారా బ్లుమేన్ఫెల్డ్, డీప్ పాకెట్స్ vs. బుష్, అధ్యక్షుడు ని తొలగించడానికి పెట్టుబడిదారుడు $5 మిలియను అదనంగా ఇచ్చాడు, వాషింగ్టన్ పోస్ట్, నవంబర్ 11, 2003; పేజి A03
 34. "Why We Must Not Re-elect President Bush". Commondreams.org. September 28, 2004. మూలం నుండి 2009-10-03 న ఆర్కైవు చేసారు. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 35. Suellentrop, Chris (October 6, 2004). "Cheney Drops the Ball". Slate.com. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 36. "New Alliance Of Democrats Spreads Funding". Retrieved July 17, 2006. Cite web requires |website= (help)
 37. Clark, Neil. "Soros Profile". the New Statesman. మూలం నుండి 2007-09-30 న ఆర్కైవు చేసారు. Retrieved June 6, 2007. Cite web requires |website= (help)
 38. "Soros Downplays Role in Georgia Revolution". Archive.newsmax.com. June 1, 2005. మూలం నుండి 2009-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 39. "Alexander Lomaia — Minister of Education and Science (Georgia)". Oecd.org. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 40. సలోమే జావరబిచ్విలి, హీరోడోట్ (ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియోపోలిటిక్స్, ఏప్రిల్, 2008
 41. ఫ్రెడ్ వీర్: మాజీ సవియాట్ దేశాలలో ప్రజాస్వాంయం పెరుగుదల చెందుతుంది, క్రిస్టియన్ సైన్సు మోనిటర్ , ఫెబ్రవరి 10, 2005
 42. "Does Foreign Funding Make NGOs into Puppets?". Globalpolicy.org. October 11, 2006. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 43. Miller, Judith (September 4, 1997). "Soros Closes Foundation In Belarus — The". New York Times. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 44. సోరోస్ ఐరోపాకు $100 మిలియను విరాళం, UNIAN (జూన్ 19, 2009)
 45. లేబ్లాన్క్, స్టీవ్, మాధకద్రవ్యము నేరం కాదని చేసే మాస్. లో చేసే ప్రయత్నం వెనుక సోరోస్ Archived 2008-08-31 at the Wayback Machine., అసోసియేటడ్ ప్రెస్, ఆగస్ట్ 27, 2008
 46. Norml.org, నేషనల్ ఆర్గనైసెషన్ ఫర్ ది రేఫోం అఫ్ మరిజువాన లాస్
 47. "Wealthy Californians put their agendas to a vote — Los Angeles Times". Latimes.com. November 1, 2008. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 48. జార్జ్ సోరోస్. [permanent dead link]Ekots lördagsintevju స్వీడిష్ రేడియో, అక్టోబర్ 10 2009. [permanent dead link]12:55[permanent dead link]
 49. "ప్రాజెక్ట్ ఆన్ డెత్ ఇన్ అమెరికా". మూలం నుండి 2003-10-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-24. Cite web requires |website= (help)
 50. "George Soros: Reflections on Death in America | Project on Death in America". Web.archive.org. June 22, 2001. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 51. "George Soros: Reflections on Death in America contd. 2 | Project on Death in America". Web.archive.org. March 25, 2002. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 52. "Fatal prescription — re-enactment of the Oregon Death With Dignity Act on physician-assisted suicide | Commonweal | Find Articles at BNET". Findarticles.com. మూలం నుండి July 11, 2012 న ఆర్కైవు చేసారు. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 53. 10వ అధ్యాయం "ది డెవలప్మెంటల్ స్టేట్స్ అఫ్ ఈస్ట్ ఆసియా." హూగ్వేల్ట్, అన్కీ. 2001. ఇన్ గ్లోబలైసేషణ్ అండ్ ది పోస్ట్ కలోనియల్ వరల్డ్: ది న్యూ పోలిటికల్ ఎకనోమి అఫ్ దేవేలప్మేంట్. బలిమోర్, MD: జాన్స్ హాప్కిన్స్ ప్రెస్.
 54. మగ్గీ ఫర్లే: మలేషియన్ లీడేర్, సోరోస్ ట్రేడ్ బార్బ్స్, లోస్ అన్గేలేస్ టైమ్స్ , సెప్టెంబర్ 22, 1997
 55. బిల్ మోయేర్స్ జర్నల్, ఆర్ధిక సంక్షోబం గురించి జార్జ్ సోరోస్, అక్టోబర్ 10, 2008, http://odeo.com లో ప్రచురించబడినది, పూర్తి ట్రాన్స్క్రిప్ట్ మరియు పోడ్కాస్ట్ Archived 2009-02-06 at the Wayback Machine.
 56. Kampeas, Ron (October 12, 2009). "jta.org". jta.org. మూలం నుండి 2009-06-03 న ఆర్కైవు చేసారు. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)
 57. సోరోస్, జార్జ్. "ఇస్రేల్, అమెరికా మరియు AIPAC గురించి" న్యూ యార్క్ రివ్యూ అఫ్ బుక్స్ , ఏప్రిల్ 12, 2007.
 58. ఫోర్బ్స్ 400 -#15 జార్జ్ సోరోస్, ఫోర్బ్స్, సెప్టెంబర్ 30, 2009
 59. "The Perilous Price of Oil — The New York Review of Books". Nybooks.com. September 25, 2008. Retrieved October 16, 2009. Cite web requires |website= (help)

బాహ్య లింక్‌లు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.