జార్బోమ్ గామ్లిన్
| జార్బోమ్ గామ్లిన్ | |||
| |||
| పదవీ కాలం 2011 మే 5 – 2011 అక్టోబర్ 31 | |||
| ముందు | దోర్జీ ఖండూ | ||
|---|---|---|---|
| తరువాత | నభమ్ తుకీ | ||
| పదవీ కాలం 2004 – 2015 | |||
| ముందు | లిజుమ్ రోన్యా | ||
| తరువాత | న్యామర్ కర్బాక్ | ||
| నియోజకవర్గం | లిరోమోబా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1961 ఏప్రిల్ 16 అలాంగ్, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
| మరణం | 2014 November 30 (వయసు: 53) గుర్గావ్ , హర్యానా , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | శకుంతల డోలీ గామ్లిన్ & డాక్టర్ మోటర్ జిని గామ్లిన్ | ||
| సంతానం | 2 కుమార్తెలు, 1 కుమారుడు, కుమారుడు, బోమ్నీ గామ్లిన్ | ||
| నివాసం | అలాంగ్, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | క్యాంపస్ లా సెంటర్ , ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఢిల్లీ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
జార్బమ్ గామ్లిన్ (16 ఏప్రిల్ 1961 - 30 నవంబర్ 2014) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు లిరోమోబా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అరుణాచల్ ప్రదేశ్ 7వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]జార్బోమ్ గామ్లిన్ అస్సాంలోని ఆలోలో 1961 ఏప్రిల్ 16న జన్మించాడు. ఆయన గోల్పారాలోని సైనిక్ స్కూల్‌లో చదువుకుని, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి చరిత్రలో పట్టభద్రుడై, 1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్ నుండి లా డిగ్రీ పురః చేసిన తరువాత దిబ్రూఘర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జార్బోమ్ గామ్లిన్ 1981 నుండి 1984 వరకు ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ (AAPSU) అధ్యక్షుడిగా పని చేసి ఆ తరువాత పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లో చేరినప్పటికీ, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 లోక్‌సభ ఎన్నికలలో అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జార్బోమ్ గామ్లిన్ 2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లిరోమోబా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై గెగాంగ్ అపాంగ్ మంత్రివర్గంలో హోం మంత్రిగా పని చేశాడు. ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై దోర్జీ ఖండూ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు.
జార్బోమ్ గామ్లిన్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 2011 మే 5న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టి,[1] రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కారణంగా అక్టోబర్ 31న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2] ఆయన 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లిరోమోబా శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]జర్బోమ్ గామ్లిన్ 53 సంవత్సరాల వయసులో లివర్ థ్రాంబోసిస్‌తో బాధపడుతూ గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2014 నవంబరు 30న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Jarbom Gamlin sworn in as new Arunachal Chief Minister" (in ఇంగ్లీష్). NDTV. 5 May 2011. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
- ↑ "Arunachal Cong chief accused of taking an insurgent group's help to dislodge the Gamlin govt" (in ఇంగ్లీష్). India Today. 3 September 2011. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
- ↑ "Former Arunachal chief minister Jarbom Gamlin passes away". The Times of India. 1 December 2014. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
- ↑ "Former Arunachal CM Jarbom Gamlin passes away" (in Indian English). The Hindu. 1 December 2014. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.